భయం… ఖలీల్ జిబ్రాన్, లెబనీస్- అమెరికను కవి

 

సముద్రంలో కలవడానికి ముందు
నది భయవిహ్వలం అవుతుందని నానుడి.

మహోన్నత గిరి శిఖరాలనుండి
దుర్గమారణ్యాలూ, నవసీమల చుట్టుదారులంట
తాను నడిచిన దారులు పరికించి చూస్తుంది.

దాని ఎట్ట ఎదుట
సువిశాలమైన సముద్రాన్ని చూస్తుంది
అందులో అడుగిడటమంటే
మరేమీ కాదు, తన అస్తిత్వాన్ని శాశ్వతంగా వదులుకోవడమే.

కానీ మరో దారి లేదు.
నది వెనక్కి మరల లేదు.

ఆ మాటకొస్తే ఎవరూ వెనక్కి పోలేరు.
జీవితంలో వెనక్కి పోవడం అసంభవం.

తప్పదు. నదికి
సముద్రంలోకి అడుగిదే సాహసం చెయ్యాల్సిందే.
ఎందుకంటే, అప్పుడే భయం పోతుంది.
అప్పుడే నదికి తెలిసి వస్తుంది
సముద్రంలో కలవడం అంటే అస్తిత్వం కోల్పోడం కాదు
తానే ఒక మహాసముద్రం అయిపోవడమని.

ఖలీల్ జిబ్రాన్
లెబనీస్- అమెరికను కవి

 

 

 

లెబనీస్- అమెరికను కవి

Fear

 

It is said that before entering the sea

A river trembles with fear.

 

She looks back at the path she has travelled,

From the peaks of mountains,

The long winding road crossing forests and villages.

 

And in front of her,

She sees an ocean so vast,

That to enter

There seems nothing more than to disappear forever.

 

But there is no other way.

The river cannot go back.

 

Nobody can go back.

To go back is impossible in existence.

 

The river needs to take the risk

Of entering the ocean

Because only then will fear disappear,

Because that’s where the river will know

It’s not about disappearing into the ocean,

But of becoming the ocean.

 

Kahlil Gibran

Lebanese-American Poet

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.