రజనీస్తుతి… ఋగ్వేదం నుండి

దిగంతపరీవ్యాప్తమై తమస్విని లేస్తుంటే 

చుక్కలు కళ్ళు మిటకరించి చూస్తున్నాయి;

ఆమె ఉడుపుల ఆడంబరం అంబరాన్ని తాకుతోంది.

చీకట్లను తరుముతూ అక్షయమైన తమస్సు 

భూమ్యాకాశాలను ఆవహిస్తోంది.

సోదరి అహస్సు అడుగులో అడుగులేస్తూ

పయనిస్తోంది. చీకట్లను వ్యాపించనీండి…

ఓ విభావరీ! పక్షులు గూళ్ళకి ఎగసినట్టు 

నీ ఆగమనతో మేము ఇంటిదారి పట్టుతాము.

మనిషీ, మెకమూ, విహంగమూ మొదలుగా

సమస్త జీవవ్యాపారాలూ సద్దుమణుగుతాయి.

విహాయస పథంలో నిర్విరామంగా ఎగిరే

డేగలు సైతం విశ్రాంతికై తిరోన్ముఖమౌతాయి.

ఓ రజనీ! మమ్మల్ని దొంగలూ, తోడేళ్ళబారినుండి కాపాడు.

నీ ఏలుబడి సమయమంతా ప్రశాంతత నెలకొనుగాక!

చిక్కనిచీకటి ఒక ముసుగులా నను కమ్ముకొంది.

ఓ ప్రభాతమా! నా ఋణాలతోబాటు దాన్నీ పారద్రోలు

ఓ దినకరుడా, ఆవు దూడకు మల్లే నీకు

నా కీర్తనాసవాన్ని సమర్పించుకుంటున్నాను.

దాన్ని ప్రభువుకు సమర్పించిన

స్తుతిగీతంగా స్వీకరించి అనుగ్రహించు.

.

ఋగ్వేదం నుండి

Hymn to Night

.

So vast, our Goddess Night, she rises,

Star-eyes gazing everywhere;

All her finery of dress displayed.

Space high and low she fills, Eternal Night,

Her beauty driving out dark.

Close on the heels of sister Day

She treads. Let darkness run…

As you draw near, we turn for home

Like birds that wing to nest.

Life everywhere retreats: man, beast

And bird. Even the soaring hawk

Returns to seek out rest.

Night, shield us from the wolf and thief.

Throughout your hours let there be calm.

Pitch dark has brought a shroud for me.

Dawn, drive it, like my debts, away.

Child of Day, to you, as to a calf,

My hymn is offered. Receive it now

As paean to a conqueror.

From Rig Veda

Translated by: Edwin Gerow and Peter Dent

Poem Courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/50

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: