చావుకీ, బ్రతుకుకీ మధ్య వేలాడే శూన్యంలో
ఎవరికీ కనపడకుండా ఉండాలని దొరికిన ఆధారాన్ని పట్టుకుని
ఒకమూలకి ఒదుక్కుని ఉంటాము;
మన మాటలకీ, చేతలకీ మధ్యనున్న సంబంధం
మనం అర్థం అయిందనుకున్నంతమట్టుకు, ఒక సాలెగూడు అల్లుకుంటాం
చివరకి అపార్థాలే మిగిలినా;
వెంటనే దృష్టిపెట్టవలసిన అవసరాలూ,
మనం ఆవేశంతో జరిపే చర్చల …
సందిగ్ధ జారుడుతలం మీద నడుస్తూ
నన్ను నేను ప్రశ్నించుకుంటుంటాను
“ఇంతకీ నేను ఇక్కడ ఏం చేస్తున్నట్టు?”
.
సిసీలియా బొరోమియో,
సమకాలీన ఫిలిప్పీన్ కవయిత్రి
Cecilia_Borromeo
Filipino Poetess
.
Restless
.
It is that perennial immateriality dwelling between living and dying
crouched in the corners and grappling by the hinges
only to remain unseen;
We weave our web of what we believe we understand
of the relationship of our acts and events
only to remain misunderstood;
From that odd wisp of steam of heated discussions
to the urgent hiss of a new page calling;
I teeter on that thin ice —
That single space of uncertainty —
And I ask
“What am I doing here?”.
.
Cecilia Borromeo
Contemporary Filipino Poetess
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/cecilia_borromeo/poems/21841
స్పందించండి