నా బ్రతుకులో వైరుధ్యాలు… డెల్మైరా ఆగస్టినీ, ఉరుగ్వే కవయిత్రి

నే బ్రతుకుతాను, మరణిస్తాను, దహిస్తాను, మునిగిపోతాను

ఏకకాలంలోనే వేడినీ చల్లదనాన్నీ అనుభవిస్తాను.

జీవితం ఒకప్రక్క మెత్తగా ఉంటూనే చాలా కఠినంగా ఉంటుంది

నా కష్టాలలో ఆనందం కలగలిసే ఉంటుంది.

ఒక్కొక్కసారి నవ్వుతోపాటే ఏడుపూ వస్తుంది

నా ఆనందం ఎన్నో కష్టాలను దిగమింగగలిగేలా చేసింది.

నా సుఖం క్రమేణా పల్చబడినా మార్పులేక స్థిరంగా ఉంటుంది

జీవితం నిస్సారమైన క్షణంలోనే పచ్చగా మొలకెత్తుతుంటాను.

ప్రేమలోని వైరుద్గ్యాలూ అలాగే భరిస్తుంటాను.

‘నా వల్లకాదు, ఈ బాధ భరించలేను’ అని నే ననుకుంటానా

నాకు తెలియకుండానే అది ఎలా మాయమౌతుందో మాయమౌతుంది.

హమ్మయ్య ఇక ఫర్వాలేదు ఈ బాధలు గట్టెక్కాయి

నా జీవితంలో అత్యంత ఆనందకర క్షణాలొచ్చాయి అనుకుంటానా

వెంటనే శరీరమంతటా తెలీని నొప్పేదో సలపడం ప్రారంభిస్తుంది.

.

డెల్మైరా ఆగస్టినీ,

(October 24, 1886 – July 6, 1914)

ఉరుగ్వే కవయిత్రి

.

Delmira Augustini

(October 24, 1886 – July 6, 1914)

.

I Live, I Die, I Burn, I Drown

.

I live, I die, I burn, I drown

I endure at once chill and cold

Life is at once too soft and too hard

I have sore troubles mingled with joys

Suddenly I laugh and at the same time cry

And in pleasure many a grief endure

My happiness wanes and yet it lasts unchanged

All at once I dry up and grow green

Thus I suffer love’s inconstancies

And when I think the pain is most intense

Without thinking, it is gone again.

Then when I feel my joys certain

And my hour of greatest delight arrived

I find my pain beginning all over once again.

.

Delmira Agustini

(October 24, 1886 – July 6, 1914)

Uruguayan Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/delmira_agustini/poems/7504

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: