ప్రేమంటే ఇదే: ఎరుగని విహాయస పథాల్లోకి ఎగిరిపోవడం.
ప్రతి క్షణం కొన్ని వందల తెరలు తొలగేలా చేసుకోవడం .
మునుముందుగా, జీవితంపై మమకారాన్ని విడిచిపెట్టడం,
చివరకి, అడుగువెయ్యకుండానే, ముందడుగు వెయ్యడం;
ఈ ప్రపంచం అగోచరమని నిశ్చయించుకోవడం,
చివరకి, ‘నేను’ గా కనిపిస్తున్నదాన్ని ఉపేక్షించడం.
హృదయమా! ఇటువంటి ప్రేమికుల సమూహంలో
ప్రవేశించగలగడం ఎంతో అదృష్టమని నే చెప్పలేదూ?
చూపుల పరిధిదాటి చూడగలగడం వంటిది;
హృదయాంతరం చేరుకుని అనుభూతి చెందడం వంటిది.
.
రూమీ
(30 September 1207 – 17 December 1273)
పారశీక కవి

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
స్పందించండి