శోకమా, ఓ శోకమా, నా హృదయానికి నువ్వు
ఎంతచిరపరిచితురాలవంటే, నీ విషాదస్వరానికి
అలవాటుపడిన ఆ చెవి, నీ పాటకై ఎదురుచూస్తుంది.
కొత్తగా ఈ మధ్యనే నాకు ఊల్లాసమని పిలిచే భావనతో
పరిచయమేర్పడినా, అల్లంత దూరంలో చిరుచీకటిలో
అస్పష్టంగానైనా పోల్చుకోగలిగేట్టుగా నీ రూపు తెలుస్తోంది
అదెంత సాహసంతో గులాబిపూలహారాలతో మనసుదోచి
నీ విషాదచ్ఛాయలను చెరిపివేయడానికి ప్రయత్నించినా.
కానీ, ఓ శోకమా! నీ మార్గంలో చిరకాలం నడిచిన నాకు
ఇపుడు వేరొక కొత్తదారిని నడవడం నాకు సాధ్యపడదు-
చీకటిరోజులకు నీ వల్ల ఈ కనులు అలవాటు పడితే,
అచలమైన దాని బరువుకి ఈ మేను వంగిపోతోంది.
Leave a reply to మరువం ఉష స్పందనను రద్దుచేయి