మానవ జీవితంలో ఋతువులు… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి

ఒక ఏడాది ప్రమాణాన్ని నాల్గు ఋతువులతో కొలవొచ్చు;
మనిషి జీవితంలో కూడా నాలుగు ఋతువులున్నాయి;
జీవంతో ఉట్టిపడే వసంతంలో, పరీవ్యాప్తమైన
సౌందర్యాన్నంతటినీ వెర్రిగా అంచనా వేస్తుంటాడు.

అతనూ గొప్పరోజులు రుచి చూస్తాడు, వసంత మధురిమల
చవితో మత్తెక్కి, యవ్వనపుటాలోచనల పరమార్థమైన
వాటి తియ్యదనాన్ని తీరికగా నెమరువేసుకుంటూ, ఆ ఆలోచనల గాఢతలో
స్వర్గానికి పొలిమేరలలో తారాడుతుంటాడు; తనలోకంలో తానుంటూ

అతనికీ శరత్కాలం అనుభవంలోకి వస్తుంది, అపుడు
తన రెక్కలు దగ్గరా ముడుచుకుని, గడపముందునుంచి పోయే
సెలయేరువంటి సౌందర్యాన్ని కూడా పట్టించుకోకుండా
దూరానపొగమంచుతెరలు చూడడంలో సంతృప్తి పొందుతాడు.

రూపహీనత తీసుకువచ్చే హేమంతమూ అతనికి అనుభవమే,
లేదా, తన నశ్వరమైన శరీరాన్ని త్యజిస్తాడు.
.

జాన్ కీట్స్
31 October 1795 – 23 February 1821
ఇంగ్లీషు కవి

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

The Human Seasons

Four Seasons fill the measure of the year;

There are four seasons in the mind of man:

He has his lusty Spring, when fancy clear

Takes in all beauty with an easy span:

He has his Sumer, when luxuriously

Spring’s honeyed cud of youthful thought he loves

To ruminate and by such dreaming high

Is nearest unto Heaven: quiet coves

His soul has in its Autumn, when his wings

He furleth close; contented to look

On mists in idleness —- to let fair things

Pass by unheeded as a threshold brook: —

He has his Winter too of pale misfeature,

Or else he would forego his mortal nature.

.

John Keats

31 October 1795 – 23 February 1821

English Romantic Poet

 

Poem Courtesy: 

https://archive.org/stream/homebookofversea00stev#page/n91/mode/1up

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: