ఫోటో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి

Picasso ఒక సారి కళ గురించి చెబుతూ, “కళ గోడమీద తగిలిచుకునే అందమైన బొమ్మలకి పరిమితమైనది కాదు; వాటికన్నా అతీతమైనది,” అని అంటాడు. కనుక ఒకోసారి కళ అందవిహీనంగా ఉన్నది కూడా కావచ్చు.

దాని అర్థం ఏమిటి? అందవిహీనమైనదాన్ని ఏ కళాకారుడూ సృష్టించడు కదా?

అది ఒక నిరసన తెలిపే మార్గం. తన ఆగ్రహాన్ని ప్రకటించే తీరు.

దిగంబరకవులు తమ కవిత్వంలో అంతవరకు సంప్రదాయంగా వస్తున్న ఉపమానాలూ, మాటలూ కాకుండా వేరే భాష ఎందుకు ఉపయోగించినట్టు? కవిత్వం రహస్యాలు తెలీకనా? సమాజం నిద్రలో మునిగినపుడు దాన్ని లేపాలంటే, కొన్ని విపరీతమైన చర్యలు తీసుకోక తప్పదు. ఆ పదచిత్రాలు, ఆ భాష మనలో జుగుప్స కలిగించడం ద్వారా మన దృష్టిని ఆకర్షిస్తాయి. మనని ఒక రకమైన అశాంతి సృష్టిస్తాయి. ఆ అశాంతి మనల్ని అంతర్ముఖులుగా చేస్తుంది. మన తప్పుల్ని అవలోడనం చేసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే మార్గాలు అన్వేషిస్తాం. ఆ అంతర్ముఖత్వం మనల్ని మనుషులుగా చేస్తుంది. ఈ విషయమే William Wordsworth తన Elegiac Stanzasలో చెబుతాడు.

ఈ కవిత అటువంటి కవిత.

***

అతి రహస్యంగా సందు చివరలో అమ్ముతున్న
ఈ అశ్లీలమైన ఫోటోలో (పోలీసులు దీన్ని చూడరాదు)
కలలు దోచుకునేంత అందమైన ముఖం
ఇంత పోకిరిగా ఉందేమిటి? “అసలిందులోకి ఎలా వచ్చేవు నువ్వు?”

నువ్వెంత నీచమైన, అశ్లీలమైన జీవితం గడుపుతున్నావో ఎవడికి తెలుసు?
ఈ చిత్రం తియ్యడానికి నువ్వీ భంగిమలో నిలుచున్నావంటే
నీ పరిసరాలు ఎంత దారుణంగా ఉండి ఉంటాయి?
నీది ఎంతటి దిగజారుడు మనస్తత్వమై ఉండి ఉండాలి?
అయినప్పటికీ, ఇంతకంటే కనికిష్టంగా ఉన్నా సరే,
నువ్వు నాకెప్పుడూ కలలు దోచుకునే ముఖానివే.
నీ తను సౌందర్యం, సౌష్టవం గ్రీకు ప్రజలకే అంకితం—
నువ్వు నాకు అలాగే ఎప్పుడూ కనిపిస్తావు
నా కవిత్వం నిన్నలాగే పరిచయం చేస్తుంది.
.

కన్స్టాంటిన్ కవాఫిజ్

(ఏప్రిల్ 29 1863 – ఏప్రిల్ 29, 1933)

గ్రీకు కవి

[గ్రీకు సాహిత్యంపట్ల దేశంలోనూ బయటా ఆసక్తి పునరుజ్జీవింపజెయ్యడంలో Cavafy పాత్ర ఎంతైనా ఉంది. కాని దురదృష్టవశాత్తూ, అతను చనిపోయిన తర్వాత, EM Forster, Arnold Toynbee and TS Eliot వంటి ప్రముఖులు చేపట్టేదాకా అతనికృషి ఇంగ్లీషుమాటాడేప్రపంచానికి దాదాపు తెలియదు. అతని సాహిత్యసృష్టిఅంతా గ్రీకుభాషలోనే జరిగింది. అయితే అతని అన్ని కవితలూ అనువాదం చెయ్యబడ్డాయి. కాకపోతే, అతని మాతృభాషలోని నైపుణ్యం అనువాదాలలో అంతగా కనిపించదు. అంత్యప్రాసలు లేకపోవడం, ఉన్నచోట వ్యంగ్యాన్ని సూచించడం, సంప్రదాయేతర విషయాలపై కవిత్వం రాయడం అతని ప్రత్యేకతలు. అగోచరమైనభవిషత్తు, మనసునివివశంచేసే ఆనందాలు, నైతిక ప్రవర్తన, వ్యక్తుల మానసిక ప్రవృత్తి, స్వలింగసంపర్కం, అతని కవిత్వాన్ని నిర్వచించే కొన్ని ముఖ్యమైన కవితావస్తువులు. అతనికి కవితలో ప్రతి పాదాన్నీ లోపరహితంగా రాయడం ఎంత అలవాటంటే, అది ఒక చాదస్తంగా గుర్తించవలసినంత.
1904 లో రాసిన “Waiting for the Barbarians” కవితా, 1911 లో వ్రాసిన Ithaca అన్న కవితలు కన్స్టాంటిన్ కవాఫిజ్ కి అమితమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. అతను తన కవిత్వాన్ని పుస్తకరూపంలో తీసుకు రాలేదు. అతని మరణానంతరం 1935లో అతని 154 కవితలతో మొదటి కవితా సంకలనం వచ్చింది. ఇంకా చాలా సాహిత్యం అసంపూర్ణంగా ఉండిపోయింది.]

Image Courtesy: http://www.poemhunter.com
Image Courtesy: http://www.poemhunter.com

The Photograph.

.

In this obscene photograph secretly sold
(the policeman mustn’t see) around the corner,
in this whorish photograph,
how did such a dream-like face
make its way; How did you get in here?

Who knows what a degrading, vulgar life you lead;
how horrible the surroundings must have been
when you posed to have the picture taken;
what a cheap soul you must have.
But in spite of all this, and even more, you remain for me
the dream-like face, the figure
shaped for and dedicated to Hellenic love—
that’s how you remain for me
and how my poetry speaks of you.

Constantine Cavafy (Konstantinos P. Kabaphes)
(1863-1933)
Greek Poet
Translated from Greek by : Edmund Keeley and George Savidis

Poem Courtesy:

http://thewonderingminstrels.blogspot.com/2004/12/the-photograph-constantine-cavafy.html

“ఫోటో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి” కి 2 స్పందనలు

  1. “నువ్వు నాకెప్పుడూ కలలు దోచుకునే ముఖానివే” ఎంత చిక్కని పంక్తి ! “అతనికి కవితలో ప్రతి పాదాన్నీ లోపరహితంగా రాయడం ఎంత అలవాటంటే, అది ఒక చాదస్తంగా గుర్తించవలసినంత.” అన్న పరిచయ వాక్యం మీరు అనువదించిన కవితలో పాదం పదం లో ప్రతిఫలించింది… “అశాంతి మనల్ని అంతర్ముఖులుగా చేస్తుంది. మన తప్పుల్ని అవలోడనం చేసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే మార్గాలు అన్వేషిస్తాం. ఆ అంతర్ముఖత్వం మనల్ని మనుషులుగా చేస్తుంది.” I loved this phrase of your a lot! నెనర్లు!

    మెచ్చుకోండి

    1. Thank you Usharani garu for your encouraging comments.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: