శలభము చెప్పిన పాఠము… డాన్ మార్క్విజ్, అమెరికను

(గమనిక: ఈ కవిత బొద్దింకలో ప్రవేశించిన కవి చెబుతున్నాడు.)

ఓ రోజు సాయంత్రం
నేనో దీపపు పురుగుతో మాటాడుతున్నాను
అది విద్యుత్ బల్బులోకి
ఎలాగైనా దూరిపోయి
అక్కడి ఫిలమెంటుమీద
మాడిపోవాలని ప్రయత్నిస్తోంది

నే నడిగాను, మీరెందుకు
ఇలాంటి సాహసాలు చేస్తారని.
అది ఈ పురుగులకి సంప్రదాయమా?
“అది బల్బు గనుక,
గాజు తొడుగుంది గనుక సరిపోయింది గాని,
దానికి బదులు అక్కడ ఏ కొవ్వొత్తో
ఉండి ఉంటే, ఈ పాటికి
బూడిదకూడా మిగలకుండా మాడిపోయేదానివి
నీకు బుద్ధిలేదా?” అని అడిగేను.

“లేకేం, కావలసినంత ఉంది” అంది
“కానీ ఒక్కోసారి అది వాడి వాడి
అలసిపోతాం,
మాకు చేసిందే చేసి విసుగొచ్చి
అందంకోసం అర్రులు చాస్తాం,
మాకు ఉత్సాహం కావాలి.
నిప్పు అందంగా ఉంటుంది.
మాకు తెలుసు దానికి మరీ
దగ్గరంగా వెళితే కాలుస్తుందని.
దానికి ఎవరు లక్ష్యపెడతారు.
ఒక్క క్షణకాలమైనా
ఆనందంగా ఉండడం మెరుగు
అందంలో దగ్ధమయినప్పటికీ
ఎక్కువకాలం జీవించి
నిస్సారంగా బ్రతకడం కన్నా.
అందుకని మా జీవితాన్నంతటినీ
ఒక చుట్టచుట్టి
దానితో ఆడుకుంటాం
జీవితం విలువ ఏదైనప్పటికీ.
కలకాలం జీవించి
అందంలో విలినం కాలేకపోవడం కంటే
ఒక క్షణకాలం అయినాసరే
అందంలో భాగం అవడం మేలు
తర్వాత మృత్యువు కబళించినా.
జీవితం అంటే మా దృష్టిలో
ఇలా రావాలి, అలా పోవాలి
నాగరికత మరీ ఎక్కువై
జీవించడం మరిచిపోవడానికి ముందు
ఉండే మనుషుల్లాంటి వాళ్ళం మేము”.

తన తాత్త్విక చింతన తప్పని వాదించి
నా త్రోవకి తెచ్చే లోగా
అది పోయి ఒక “సిగార్ లైటర్”
దగ్గర ఆత్మాహుతి చేసుకుంది.
నేను తనతో ఏకీభవించలేను.
నేనయితే అందులో సగం ఆనందానికి తృప్తిపడి
రెట్టింపు జీవనప్రమాణం కోరుకుందును.

కానీ, అదే సమయంలో నాకు
ఏదో కావాలని మహా కాంక్షగా ఉంది
తనని తను దహించుకుందికి ఉరికినంతగా.
.
ఆర్చీ
—————-
డాన్ మార్క్విస్

(July 29, 1878,  – December 29, 1937)

అమెరికను

  Donald Robert Perry Marquis

.

the lesson of the moth

i was talking to a moth

the other evening

he was trying to break into

an electric light bulb

and fry himself on the wires

why do you fellows

pull this stunt i asked him

because it is the conventional

thing for moths or why

if that had been an uncovered

candle instead of an electric

light bulb you would

now be a small unsightly cinder

have you no sense

plenty of it he answered

but at times we get tired

of using it

we get bored with the routine

and crave beauty

and excitement

fire is beautiful

and we know that if we get

too close it will kill us

but what does that matter

it is better to be happy

for a moment

and be burned up with beauty

than to live a long time

and be bored all the while

so we wad all our life up

into one little roll

and then we shoot the roll

that is what life is for

it is better to be a part of beauty

for one instant and then cease to

exist than to exist forever

and never be a part of beauty

our attitude toward life

is come easy go easy

we are like human beings

used to be before they became

too civilized to enjoy themselves

and before i could argue him

out of his philosophy

he went and immolated himself

on a patent cigar lighter

i do not agree with him

myself i would rather have

half the happiness and twice

the longevity

but at the same time i wish

there was something i wanted

as badly as he wanted to fry himself

*archy

(Note : *Archy … is the name of the cockroach.

The narrator is a poet reincarnated in a cockroach’s body. He types by jumping on the keys of a typewriter, hence the lack of caps)

Don Marquis

(July 29, 1878,  – December 29, 1937)

American

Donald Robert Perry Marquis was a newspaper columnist,humorist, poet, playwright and author of about 35 books of which the best  known are books of humorous poetry about Archy the cockroach and Mehitabel the cat. Don’s work appeared regularly in the New York Sun and the Saturday Evening Post, among other places.

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/03/lesson-of-moth-don-marquis.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: