సానెట్ 34… షేక్స్పియర్

ఇంత అందమైన రోజుని ఎందుకు వాగ్దానం చేసి

నన్ను ఏ మెయికప్పులూ లేకుండా బయలుదేరేలా పురికొల్పావు?

బడుగు మేఘాలు దారిలో నన్ను దాటి ముందుకుపోయి

వాటి దట్టమైన నల్లటి పొగల్లో నీ ప్రతాపాన్ని కనుమరుగుచెయ్యడానికా?

నువ్వు అప్పుడప్పుడు మేఘాల్ని చీల్చుకువచ్చి వర్షం దెబ్బతిన్న

నా ముఖం మీది చినుకుల తడి ఆరబెడితే సరిపోదు

గాయాన్ని మాన్చగలిగినా అవమానం తొలగించలేని

గాయం గురించి ఏ మనిషీ గొప్పగా చెప్పుకోలేడు

నీకు జరిగిన అవమానం నా దుఃఖానికి ఉపశమనం ఇవ్వదు

నువ్వు విచారించినంతమాత్రాన, నా నష్టం తీరేదీ కాదు:

పరంపరలుగా బలమైన దెబ్బలకి బలి అయిన వ్యక్తికి

నేరస్థుడు పడే పశ్చాత్తాపం ఏ రకమైన ఊరటనీ ఇవ్వదు.

ఓహ్! అయితేనేం? నీ ప్రేమ రాల్చేవి అశ్రువులు కావు, ముత్యాలు

అన్ని నేరాలనుండీ విముక్తి చెయ్యగల విలువైన పరిహారాలు.

.

షేక్స్పియర్

William Shakespeare

.

SONNET 34

Why didst thou promise such a beauteous day,

And make me travel forth without my cloak,

To let base clouds o’ertake me in my way,

Hiding thy bravery in their rotten smoke?

‘Tis not enough that through the cloud thou break,

To dry the rain on my storm-beaten face,

For no man well of such a salve can speak

That heals the wound and cures not the disgrace:

Nor can thy shame give physic to my grief;

Though thou repent, yet I have still the loss:

The offender’s sorrow lends but weak relief

To him that bears the strong offence’s [cross].

   Ah! but those tears are pearl which thy love sheds,

   And they are rich and ransom all ill deeds.

NOTES

.

Imagery similar to that of the last Sonnet is used, and the poet again contrasts the dark storm-clouds with the promise of the early morning. The sun, however, is beginning to break through the clouds; the poet’s friend shows signs of penitence. But tears shed after the offence had been committed could give no adequate relief. Still, on second thoughts, the poet pronounces these tears a rich treasure and a full satisfaction.

  1. Base clouds. The clouds are “base” on account of their dampness defacing and obscuring the glory of the heavens.

  1. Bravery. Glory and splendour. Rotten smoke. Meaning possibly damp, unwholesome vapour. Steevens compares “the reek o’ the rotten fins.” Coriolanus, Act iii. sc. 3, line 121. “Rotten,” however, may here mean “loose,” “wanting in coherence.”

  1. To dry the rain, &c. Continuing the imagery of the last Sonnet, according to which the poet had been overtaken by a storm.

  1. [Cross]. Q. has “losse,” which may possibly have remained by oversight on a revision of the MS.

  1. Sheds. Q. “sheeds.”

Sonnet and Notes Courtesy:

 http://www.shakespeare-online.com/sonnets/34.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: