నేను మట్టిలోకి తిరిగి చేరుకున్నప్పుడు
ఆనందంతో తుళ్ళిసలాడిన నా శరీరం
ఒకప్పుడు విర్రవీగిన దాని
ఎరుపు తెలుపు వన్నెలని వదులుకున్నప్పుడు
పురుషులెవరైనా పక్కనుండి పోతూ
పేలవమైన, తెచ్చిపెట్టున జాలితో మాటాడితే
నా మట్టి గొంతు ఎరువుతెచ్చుకుని మరీ
వాళ్ళకి గట్టిగా సమాధానం చెబుతుంది:
“ఓయ్! చాలు, కట్టిపెట్టు. నేను సంతృప్తిగానే ఉన్నా.
అవసరం లేని నీ జాలిమాటలు వెనక్కు తీసుకో!
ఆనందం నాలో ఒక జ్వాల
అది ఒక్క సారి దహించేది కాదు, నిలకడైనది.
అలవోకగా వంగే రెల్లులా సుకుమారమైనది
దాన్ని వంచే తుఫానుని ప్రేమిస్తుంది….
నువ్వు సుఖంలో పొందే ఆనందం కన్నా
నేను దుఃఖంలో ఎంతో ఆనందాన్ననుభవించేను.”
.
సారా టీజ్డేల్
August 8, 1884 – January 29, 1933
అమెరికను కవయిత్రి

వ్యాఖ్యానించండి