ఓ స్వచ్ఛ సరోవరమా! నీ తేటనీటిలో నా శరీరాన్ని శుభ్రపరచ కోరుతాను. నీ నైర్మల్యాన్ని ఏ ప్రవాహమూ కలుషితం చెయ్యలేదు; పుడమి బుగ్గమీది సొట్టవి, నీ మార్గాన్ని ఏ రాయీ నిలువరించలేదు; మాతృ సరసిని పోలిన నీ జలాలు, పొదలతో, తోపులతో, సుందర ఉద్యానాలతో మనసును హరిస్తూ విభ్రమం గొలుపుతాయి
ఆహ్లాదకరంగా పచ్చదనం పరచుకున్న నీ తీరాన ఎన్నో పశుల మందలూ, కాపరులూ తిరుగాడుతూ ఉంటారు, పాడుకుంటూ యువతులు బిందెలతో నీళ్ళు మోసుకెళుతుంటే లోయల్లో గొల్లల పిల్లనగ్రోవులు మారుమోగుతుంటాయి, ఏ కపటమూ ఎరుగని ఒక కాలాతీతమైన నమ్మకం, ఒళ్ళు వంచి చేసే పరిశ్రమ వర్ధిల్లుతాయి; మనసులు మెచ్చి, చేతులు అందించిన
దీవెనలు వారిని సదా సంరక్షిస్తాయి.
.
స్మాలెట్
స్పందించండి