అనువాదలహరి

Awaiting Inspiration… Ramaswamy Nagaraju, Telugu, Indian

Whenever I reduce

To a still silent vacuous voice

I reach out to the swelling seas of sound

To implete myself with waves of melody;

Then

The notes that echo shall

Awaken the dormant ideas within.

 .

Whenever I reduce

To a bare barren autumnal wood

I run to vast verdurous pastures

To glean tender grass shoots for cover;

There

An invisible cuckoo shall be strumming

Silently the music of heart’s muse within.

.

How long shall I have to look for

That lukewarm ray that thaws this icy stretch?

To let the quiescent word to flow

From the subconscious deep asleep.

When shall the affluent Bhagirathi of thoughts

Shall spring effortlessly breaking from within!?

Ramaswamy Nagaraju

Telugu

Indian

Ramaswamy Nagaraju
Ramaswamy Nagaraju

.

 ప్రేరణకై ప్రతీక్ష

( Poetry is an echo, asking a shadow
to dance – Carl Sandburg )

.

నేను శూన్యం నిండిన
నీరవ గళాన్ని అయినప్పుడల్లా
స్వర సాగరం చెంతకు చేరుకుంటాను
రాగ తరంగాలను నింపుకునేందుకు;
అప్పుడు
నినదించే నాదాలు నాలో
నిశ్శబ్ద భావాలను నిదుర లేపుతుంటవి.

నేను శిశిర వృక్ష శుష్క
దిగంబర దేహాన్ని అయినప్పుడల్లా
హరిత వనాలకు పరుగిడుతుంటాను
పసిరిక వలువలను కోసుకునేందుకు;
అక్కడ
కనుపించని మౌన గీత కోకిలం లోన
కవన మనోసంగీతాన్ని మీటుతుంటుంది.

ఎన్నాళ్లిలా తడుము కోవాలో
హిమనదాన్ని కరిగించే వేడి కిరణం కోసం?
సుప్త చేతనలోని
సుషుప్త వాక్యాన్ని ప్రవహించు కునేందుకు?
ఎప్పుడు గట్టు తెంచు కుంటుందో మరి
లోలోన అలవోకగా నిసర్గ భావ భాగీరథి ?!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: