కుర్రాడా! ప్రపంచం అంతా కొత్తగా ఉన్నప్పుడు
ప్రకృతి అంతా పచ్చగా కనిపిస్తున్నప్పుడు;
బాబూ! ప్రతి బాతూ హంసలాగానూ,
ప్రతి పిల్లా మహరాణిలానూ కనిపిస్తున్నప్పుడు;
బాలకా! అప్పుడు గుర్రాన్నీ బూటునీ వెతుక్కుని
దేశాటన చెయ్యడానికి పోవాలి;
పిల్లడా! యువరక్తం దాని దారి అది వెతుక్కోవాలి,
ప్రతి జీవికీ దాని రోజంటూ ఒకటి ఉంటుంది.
కుర్రాడా! ప్రపంచం అంతా పాతబడిపోయినప్పుడు
చెట్లన్నీ పచ్చదాన్ని కోల్పోయినపుడు;
బాబూ! ఏ క్రీడలోనూ ఉత్సాహం దొరకనప్పుడు
బండి చక్రాలన్నీ అరిగిపోయినప్పుడు;
ఇంటికి మెల్లగా చేరుకో; జీవితంలో అలిసి
చేవలుడిగిన వారిలో నీచోటు చూసుకో;
అక్కడి ముఖాలలో నువ్వు చిన్నప్పుడు ప్రేమించినది
ఒక్కటైనా దొరికేలా దేముడు నిన్ననుగ్రహించుగాక!
.
ఛార్ల్స్ కింగ్స్ లీ
12 June 1819 – 23 January 1875
English Poet

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి