సముద్రం ఎందుకు ఎప్పుడూ అలాఘోషిస్తుంటుంది?
ఆకాశం అందనంతదూరంలో ఉందేమో, అది అలా ఘోషిస్తుంది,
అందుకే చెలియలకట్ట మీద తెగ విసుక్కుంటుంది;
భూమ్మీది ఒడ్లు ఒరిసిపాడే సమస్తనదులూ
సముద్రపు ఆర్తిని తీర్చలేవు. ఇంకా దాహం అంటుంది.
ఎన్నడూ శోధింపబడని దాని భూతలం మీద
అద్భుతమైన అందాలు దాగున్నాయి;
ఏ సంపర్కమూ లేని అపురూపమైన పుష్పాలు, లవణాలూ
సింహపర్ణి పూలలా బ్రతకడానికి సరిపడా,
వ్యాపించి, వృద్ధిచెంది బతకగలిగేలా.
చిత్రమైన వంపులతో, మచ్చలతో, మొనలతో శంఖులు
వెయ్యికళ్ళున్నట్టు ఒకదానిమీద ఒకటి పేరుకుని జీవరాశులు,
అన్నీ అందమైనవే, ఒకలాగ కనిపిస్తూనే ఎంతో భిన్నంగా,
ఏ పురిటి నొప్పులూ లేకుండా పుడుతూ,
ఏ మరణయాతనా లేకుండా మరణిస్తూ, చరిత్రకి అందకుండా.
.
క్రిస్టినా రోజేటి
5 December 1830 – 29 December 1894
ఆంగ్ల కవయిత్రి.
.

Leave a reply to nmraobandi స్పందనను రద్దుచేయి