మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, బ్రిటిష్

నువ్వు నిజంగా రోదిస్తావా, మిసెస్ థాచర్, రోదిస్తావా?

నువ్వు మేల్కొంటావా, మిసెస్ థాచర్, నిద్రలో ఉలిక్కిపడి ఎన్నడైనా?

ఎండి మోడై విచారగ్రస్తమైన చెట్టులా?

ఖరీదైన నీ “మార్క్స్ & స్పెన్సర్” తలగడ మీద?

నీ కన్నీళ్ళు మరుగుతున్న ఉక్కులా ఉంటయా?

అసలు నీకు అసలు ఎప్పుడైనా ఏడుపొస్తుందా?

నీ  మనసులో “3 మిలియన్లు” అన్న ఆలోచనతో ఎప్పుడన్నా నిద్రలేస్తావా?

వాళ్ళకి చెయ్యడానికి పని లేదని నీకెప్పుడైనా నిజంగా బాధకలుగుతుందా?

నువ్వు నీ అధికారదుస్తులు వేసుకుంటున్నప్పుడు,

ఉద్యోగంకోసం క్యూలో నిరీక్షిస్తున్నవారు నీ కంటికి కనిపిస్తారా?

నువ్వు రోదిస్తావా, మిసెస్ థాచర్, నిజంగా రోదిస్తావా?”

.

స్యూ టౌన్ సెండ్,

ఏప్రిల్ 2, 1946.

బ్రిటిషు నవలా కారిణి, నాటక రచయితా.

అధికారంలోకి రావడానికీ, ఉన్న అధికారాన్ని నిలుపుకోడానికీ రాజకీయ నాయకులు ఇవ్వని వాగ్దానాలు ఉండవు. కాని, ఒక సారి అధికారంలోకి వచ్చిన తర్వాత,  చిన్నపార్టీలను లాలించో, బుజ్జగించో, భయపెట్టో, చీల్చో, ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడమే వాళ్ల ఏకైక లక్ష్యం.

తమకి అధికారాన్నిచ్చిన ప్రజలని మరచి, అధికారగణంతో కుమ్మక్కై, ప్రజలనెత్తిమీద అలవి మాలిన భారాన్ని మోపుతూ, పారిశ్రామికవేత్తలకు, దోపిడీదార్లకూ కొమ్ముకాయడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లకి ప్రజల నిత్య జీవిత సమస్యలు సమస్యలు కావు… నిరుద్యోగం సమస్య కాదు.  ఎందుకంటే ఏ పార్టీ గెలిచినా వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోగలరు. దరిద్రాన్ని తగ్గించలేనపుడు వాళ్లు చెయ్యగలిగింది దారిద్ర్యరేఖని ఇంకా కిందకి దించడం. దేశ రక్షణ, తనకి రెండుపూటలా తిండిలేకున్నా, దేశానికి తిండిపెడుతున్న రైతు రక్షణ, నిజాయితీ పరులైన అధికరుల రక్షణ, ప్రజలకు కనీసావసరాల పరికల్పన… ఇవేవీ వాళ్ళ సమస్యలు కావు.

సామాన్యుడి జీవితం బ్రిటనులో స్థితి మనకంటె భిన్నంగా లేదు.  Iron Lady గా పేరుపొందిన థాచర్ ని సంబోధిస్తూ ఈ కవిత రాసినా,  ఆ పేరుకు బదులు, ఇంకొకపేరుని  అభివృద్ధిచెందుతున్న దేశాలలోని దేశాధినేతల పేర్లు ఎవరికివారు ప్రతిక్షేపించుకోవచ్చు.  అందుకే, “నీ కన్నీళ్ళు ఉక్కులా ప్రవహిస్తాయా?” అని అడిగింది.   “నా ఆఖరి బొట్టువరకు దేశానికి సేవ చేస్తానని” చాలా మంది వాగ్దానాలిస్తారు. కాని ఆఖరి బొట్టుదాకా చేసేది వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం, తర్వాత తమ సంతానం అధికారంలోకి రావడానికి ఎదురులేకుండా చెయ్యడం.  తొత్తుల్ని, తాబేదార్లనీ, నైతికంగా దిగజారిన మేధావి వర్గాన్ని వాళ్లు అందలం ఎక్కించి వాళ్లచేత ఊడిగం చేయించుకోవడం.

చిన్న కవిత అయినా, చాలా ప్రతిభావంతమైన కవిత.

మన కాలానికి అక్షరాలా సరిపోయే కవిత.

ప్రజలు మేలుకోవలసిన కవిత.

.

Mrs. Thatcher

.

Do you weep, Mrs Thatcher, do you weep?

Do you wake, Mrs Thatcher, in your sleep?

Do you weep like a sad willow?

On your Marks and Spencer’s pillow?

Are your tears molten steel?

Do you weep?

Do you wake with ‘Three million’ on your brain?

Are you sorry that they’ll never work again?

When you’re dressing in your blue, do you see the waiting queue?

Do you weep, Mrs Thatcher, do you weep?

.

Sue Townsend

born 2 April 1946

English novelist and playwright, best known as the author of the Adrian Mole books

Mrs Margaret Thatcher (13 October 1925 – 8 April 2013) was the only lady British Prime Minister of UK and to hold office for the longest term  between 1979 – 1990.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: