ఓ నేలతల్లీ! ఆమె కళ్ళను గట్టిగా ముయ్యి; ప్రపంచాన్ని
చూసి చూసి అలసిన ఆమె అందమైన కళ్ళని ముయ్యి;
ఆమెను దగ్గరగా హత్తుకో; సుఖానికి ఏ మాత్రం సందివ్వకు
గట్టిగా నవ్వే ఆ నవ్వుకీ; లేదా నిట్టుర్చే నిట్టూర్పులకీ.
ఆమెకు అడగడానికి ప్రశ్నలూ, చెప్పడానికి సమాధానాలూ లేవు;
పుట్టిన దగ్గరనుండీ ఆమెను బాధించినవాటిలో
ఈ కరువు ఆమెను మూగదాన్ని చేసి ఆమెపై పరదా కప్పింది;
ఆ నిశ్చలత్వం ఒక రకంగా నిజంగా స్వర్గమే.
మధ్యాహ్నం కంటే కూడా చీకటి స్పష్టంగా ఉంది;
ఏ పాటకన్నా కూడా నిశ్శబ్దమే వినడానికి ఇంపుగా ఉంది;
స్వయంగా ఆమె హృదయమే స్పందించడం మానుకుంది
ఈ అనంతత్వపు రోజు ఉదయించేదాకా.
ఆమె విశ్రాంతికి మొదలూ చివరా లేవు; అది శాశ్వతం;
ఆమె మేల్కొన్నప్పుడు, ఆమెకి అది చాలా దీర్ఘమని తెలీదు.
.
క్రిస్టినా జార్జినా రోజేటి
డిశంబరు 5, 1830 – డిశంబరు 29, 1894
ఇంగ్లీషు కవయిత్రి
.

వ్యాఖ్యానించండి