ఏదీ రెండుసార్లు జరగదు… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి.

ఏదీ రెండుసార్లు జరగదు.
దానివల్ల, విచారించవలసిన పర్యవసానం
మనం ఇక్కడకి ఉన్నపాటుగా వచ్చేస్తాము,
సాధన చేసే అవకాశం లేకుండా వెళిపోతాము.
మనకంటే తెలివితక్కువవాడు లేడనుకున్నా
ఈ భూమ్మీద మనమే చవట రాచ్చిప్ప అనుకున్నా
వచ్చే సెమిస్టరులో పరీక్షకి కూర్చుందికి లేదు
ఈ పాఠం ఈ ఒక్కసారే బోధించ బడుతుంది.
ఏ రోజూ నిన్నని అనుకరించదు.
ఏ రెండు రాత్రుళ్ళూ బ్రహ్మానందమటే ఏమిటో
సరిగ్గా ఒక్కలా చెప్పలేవు
సరిగ్గా అవే ముద్దులతో.
బహుశ ఏ పనీ లేనివాడు ఒకడు
నీ పేరు ప్రసంగవశాత్తూ ఉటంకించవచ్చు
ఎవరో నా గదిలోకి ఒక గులాబీ విసిరినట్టూ, అది
రంగులతో, సువాసనలతో నిండినట్టనిపించొచ్చు.
రెండో రోజు నువ్వు నా చెంతనే ఉన్నా, నే మాటిమాటికీ
గడియారంవైపు చూడకుండా ఉండలేక పోవచ్చు.
ఒక గులాబీనా? ఒక గులాబీ? అంటే ఏమిటి?
అదొక పువ్వా లేక పాషాణమా?
ఇలా వచ్చి అలా పోయే రోజుని మనం ఎందుకంత
అవసరంలేని భయంతో, విచారంతో వెళ్ళదీస్తాము?
నిలకడగా ఉండలేకపోవడం దాని ప్రకృతి:
రేపువచ్చేసరికి ఇవాళ ఎప్పుడూ వెళ్లిపోతుంది.
సూర్యుడున్నంత కాలం ఈ నేలమీద
నవ్వులతో, ముద్దులతో ఐకమత్యంగా ఉందాం;
మనిద్దరిమీ రెండు నీటిచుక్కల్లా
ఒకదాన్నొకటిపోలకపోయినా (ఇందులో మన అభిప్రాయం ఒకటే).
.
జిస్వావా షింబోర్స్కా

(2 July 1923 – 1 February 2012)

పోలిష్ కవయిత్రి.

.

కాలం చలన శీలత గురించి చెబుతున్నప్పుడు, You can’t step into the same river twice అన్న హెరాక్లిటస్ ఆఫ్ యూఫ్యూస్ సూక్తి గుర్తు రాకమానదు. ఇది నిరాశలోనో, నిస్పృహలోనో కూరుకుపోకుండా, మనిషికూడా కాలంతోపాటే ప్రవహించడానికి చెప్పిన సూక్తి. ప్రకృతి ధర్మాన్ని చిన్న మాటలలో బంధించిన తత్త్వవేత్త మేధో మధన ఫలం.  సృష్టిలో ఏదీ శాశ్వతం కాకపోయినా, ఈ చలనశీలత మాత్రం శాశ్వతం. అదే, ఈ కవితలో కవయిత్రి చెపుతోంది.

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

Nothing Twice

.

Nothing can ever happen twice.

In consequence, the sorry fact is


that we arrive here improvised


and leave without the chance to practice.


Even if there is no one dumber,


if you’re the planet’s biggest dunce,


you can’t repeat the class in summer:


this course is only offered once.


No day copies yesterday,


no two nights will teach what bliss is


in precisely the same way,


with precisely the same kisses.


One day, perhaps some idle tongue


mentions your name by accident:


I feel as if a rose were flung


into the room, all hue and scent.


The next day, though you’re here with me,


I can’t help looking at the clock:


A rose? A rose? What could that be?


Is it a flower or a rock?


Why do we treat the fleeting day


with so much needless fear and sorrow?


It’s in its nature not to stay:


Today is always gone tomorrow.


With smiles and kisses, we prefer


to seek accord beneath our star,


although we’re different (we concur)


just as two drops of water are.


.

Wislawa Szymborska,

(2 July 1923 – 1 February 2012)

Polish Poet.

Translated from the Polish by Clare Cavanagh and Stanislaw Baranczak.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: