.
గురువులకీ, గురుతుల్యులకీ, స్నేహితులకి, హితులకీ,
కుటుంబసభ్యులందరికీ
విజయనామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు.
.
ఒక గొప్ప సామ్రాజ్యంలో రాజుగారు
ఠీవిగా నిలబడి ప్రజల్ని అణగదొక్కడం చూశాను.
అతని చే సంజ్ఞ చాలు, ప్రజలు తలవంచి నిల్చునేవారు
అతని ఉక్కుపాదం ఎప్పుడూ వాళ్ళ కుత్తుకమీద ఉండేది
అతని పేరు పాలకుల్లో, బాధితుల్లో మారుమోగేది
అతని కత్తి వాళ్ళ స్తోత్రాలని ప్రతిఫలించేది.
మరొక రాజు తలెత్తడం ఇంకొకచోట చూశాను.
అతని మాటలు ఉదాత్తంగా, మంచిగా, వివేకంగా ఉండేవి;
ప్రశాంతమైన అతని అధికార ముద్రికతో
ప్రజల హృదయాలనీ, ఆలోచనలనీ ఏలేవాడు;
కొందరు చీదరించుకునేవారు, కొందరు పొగిడేవారు
ఎంతోమంది విన్నా, అతనిమాట అతితక్కువమంది అనుసరించేవారు.
తర్వాత మరో రాజుని చూసేను…
ప్రేమా అనుకంపా… ఈ రెండే అతని చట్టము;
అందులో గొప్పవాళ్లకీ, అతి సామాన్యులకీ భాగం ఉండేది
అందర్లోకీ అతి నిర్భాగ్యులకి అతని హృదయంలో చోటుండేది.
కానీ, ఆ మాహా సామ్రాజ్యంలో ప్రజలు
ఒక్కసారిగా తిరుగుబాటు చేసి, అతన్ని దేశంనుండి తరిమేసేరు.
.
ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్.
(30th Oct 1825 – 2 Feb 1864)
బ్రిటన్
.

Leave a reply to ఫణీన్ద్ర పురాణపణ్డ స్పందనను రద్దుచేయి