Chilling Stories… Kondepudi Nirmala, Telugu, Indian
I am scared
of the word motherhood…
The constant fear that I might not be able
to discharge my motherly obligations
unnerves and defeats me.
My children eulogizing me
as motherhood incarnate
in lyrical panegyrics deludes me
as kids’ vomitings, viral fevers, soiled laundry,
and the milk bottles and nipples left for boiling
confirm my square responsibility,
and my loneliness amidst a teeming family.
The scornful neglect and indifference
meted out to mothers in their sunset years
bankrupts my faith.
*
Why do you bother me?
If you want to lick few beautiful lines about mother,
or, somehow want to scale the slippery ridges
to reach the starry heights overhead
the agony behind that mothership
is beyond the ken of your marketing mindset.
For,
I have no choice to my pregnancy;
I am compelled to know the sex of the foetus,
and
I can’t even choose the numbers of my hellish labor!
*
The more you comfortably hide yourself
in the gross chilling tales with wornout laughs
sweating blood and shedding warm tears,
the more you get inspiration
to churn out nobler and exotic lyrics.
If there is a Nobel for awarding to mothers
better present it to your fathers instead
for deftly handling their urge to sire and sex
to make merry of our basic feminal rights.
But, please
never make poetry a ready handkerchief
to blow your nose as casually as you did
with our frills when you were children.
.
Kondepudi Nirmala
Indian

సెంటిమెంట్స్ మనకు కాస్త ఎక్కువే.ముఖ్యంగా అమ్మ అనంగానే అవి లోనుంచీ తన్నుకొస్తాయి అనుకుంటా.యాంగ్ మహాశయుడు చెప్పినట్లు సమిష్టి అవచేతనలో జాతి సంతరించుకునే పురాసంస్కృతి ప్రాగ్రూపాల వర్గ చిహ్నాల ప్రభావం కూడా ఐవుండచ్చేమో కదా మూర్తి గారూ!నిర్మలగారి లాంటి వాస్తవికవాదులు స్త్రీత్వాన్ని దైవీకరణ చేసి దోపిడీ చేస్తున్న మగసమాజం మీద కురిపిస్తున్న నిప్పులు ఇప్పటివి కావు.నొప్పిగా అనిపించినా స్త్రీవాదుల ఫిర్యాదులో అధిక శాతం వాస్తవమే అనిపిస్తుంది. మంచి ఆలోచనాప్రేరకమైన కవితను ఎంచుకుని తదనుగుణమైన ఆంగ్ల కవితని అనుస్రుజించారు.ధన్యవాదాలు సార్!
మెచ్చుకోండిమెచ్చుకోండి
హనుమంత రావుగారూ,
నిర్మలగారు, మనం గర్వించదగ్గ కవయిత్రి. పైన చెప్పినట్టు స్త్రీవాదకవుల్లో ముందుంటుందామె. కొన్నివిషయాలు శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టే చెప్పాలి. పాపం, ఆవిడ లాంటి వాళ్లు అలా చెబుతున్నా కొందరికి మాతృత్వం ఇంకా మెటా ఫిజికల్ కాన్సెప్టే… భగవదారాధనలా భావనలో ఆరాధనే తప్ప, ఎదుటకనబడితే, ఆమెకోసం కొన్ని వదులుకోవలసి వస్తే, చీదరింపే. ఒకాయనని (బాగా లబ్దప్రతిష్టుడే) అమ్మపదం కవితాసంకలనం జి. ఎం. ఆర్. గ్రూపు వాళ్ళు వేసినపుడు అతని కవితలగురించి సంప్రదిస్తే, “నాకు మా అమ్మ అంటే చాలా బాధాకరమైన అనుభూతులున్నాయండి. నాకు అమ్మ అంటే అసహ్యం. అందుకే ఆ విషయం మీద కవితలు రాయలేదు. రాయను,” అన్నాడు. (నిజానికి ఇది ఒకరకంగా మెరుగేననుకోండి. మనసులో ద్వేషం దాచుకుంటూ పైకి తల్లిని దేవతంటూ రాసే కంటే). అంటే, అతనికి ఇంకా తన దృక్కోణంలోంచి లాభనష్టాలబేరీజువేసిచూడడం తప్ప, వస్తువుని విశ్వజనీనతలోంచి చూడగల సౌందర్యలక్షణం అబ్బలేదన్న మాట. అతని ప్రేమ కూడా కండిషనలే… వ్యక్తులైనా, దైవమైనా… అని అనుకోవలసి వస్తుంది. ఇక్కడ నిజంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మనకు వ్యక్తిగతంగా నష్టం కలుగుతున్నా, ఒక సత్యాన్ని సత్యంగా అంగీకరించగల మానసిక స్థాయికి కవులూ రచయితలూ ఎదుగుతున్నారా? ఈ పార్శ్వం కవిత్వంలో నాకు ఎక్కడా కనిపించటం లేదు, ఒక్క విరహ గీతుల్లో తప్ప.
మీ స్పందనకి ధన్యవాదాలు.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
మీ ప్రతిస్పందనా ఆలోచనా ప్రేరపకమే మూర్తి గారూ! కాకపొతే మీరు చెప్పిన కొన్ని విషయాలు..లాభ నష్టాలకతీతంగా కవులు విశ్వసౌందర్యవీక్షణం చేయడం వంటివి..విస్తృతమైన వేదిక మీద పుర్వాపర సత్యాల ఆధారంగా నిగ్గు తేలవలసిన విషయాలు.ఒక్కటి మాత్రం నేను ఒప్పుకుంటాను..నేటి తరం కవులలో మునుపటి తరం వారికున్నంత నిస్వార్థ భావ చింతన.. విశాల భావన ..నిబద్ధత వదిలేయండి..నిజాయితీ..లేదేమోనన్నది.సాధారణ వ్యక్తులకు మల్లే వ్యవహారికంగా ఒకటి..వ్యక్తిత్వపరంగా మరొకటి..వ్యక్తిక్త్వాలౌ కలిగి వుండటం..అతి లబ్ధప్రతిష్టులలఓ సైతం కనిపించి నిరాశకు గురి చేసింది. మొత్తానికి మంచి కవితకు మంచి వ్యాఖ్యానం కూడా జత చేసారు.ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి