అశాంతీ, ఆతురతలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో,
నువ్వూ, నేనూ, మనవంతు ఆనందం మనసారా అనుభవించేం;
ఈ నావకెత్తిన తెల్లని తెరచాపలు మూసివేయబడ్డాయి
మనం ఇందులోకెత్తిన సరకంతా ఖర్చుచేసేశాం.
.
రోదనవల్ల సంతోషం నానుండి నిష్క్రమించింది,
అందుకు నా చెక్కిళ్ళు ప్రాయములోనే కళతప్పాయి,
వయసుమీరని నా పెదాల అరుణిమని వేదన హరించింది,
వినాశము నా శయ్యమీద ఆఖరితెరలు దించుతోంది.
.
కానీ, కిక్కిరిసిన ఈ జీవితం నీకు ఒక వీణ,
ఒక జంత్రం, లేక వయోలాల సమ్మోహనాదంలాగో
లేదా, ఉదాత్త సాగర సంగీతానికి పేలవమైన అనుకరణ
శంకువులో నిద్రించే ప్రతిధ్వనిలాగో అనిపించవచ్చు.
.
ఆస్కార్ వైల్డ్
(16 October 1854 – 30 November 1900)
ఐరిష్ కవి, నాటక కర్త
షేక్స్పియరు తర్వాత అంత ఎక్కువగానూ సాహిత్యంలో ఉటంకించబడే (quoted) వ్యక్తి ఆస్కార్ వైల్డ్ మాత్రమే.
ఈ కవిత నిజానికి Dialogues అన్న పేరుతో రాసిన కవితల్లో రెండవది. మొదటికవితలో ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నప్పుడు, స్త్రీ దృక్పధంలో ఆ విడిపోవడానికి కారణాలు చెబితే, దానికి సమాధానంగా చెప్పిన ఈ కవితలో, పురుషుడి దృక్కోణం నుండి సమాధానం ఉంటుంది.
అనేక కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం చాలా సందర్భాలలో జరుగుతుంది. కానీ అన్నిటిలోనూ ఒకరు వాళ్ల విడిపోవడానికి కారణమైన విషయాన్ని మన్నించగలిగినా/ మరిచిపోవాలని చూసినా, రెండవవారు దాన్ని క్షమించలేరు. అప్పుడుకూడ, కొందరిలో ఉదాత్తమైన వ్యక్తిత్వం, అవతలి వ్యక్తి పట్ల నిజమైన ప్రేమానురాగాలూ వ్యక్తమవుతూనే ఉంటాయి. ఈ కవిత, బహుశా అతని తొలిప్రేయసి Florence తో విడిపోయిన సందర్భంలో వ్రాసి ఉండవచ్చునని కొందరి ఊహ.

.
My Voice
.
Within this restless, hurried, modern world
We took our hearts’ full pleasure – You and I,
And now the white sails of our ship are furled,
And spent the lading of our argosy.
.
Wherefore my cheeks before their time are wan,
For very weeping is my gladness fled,
Sorrow has paled my young mouth’s vermilion,
And Ruin draws the curtains of my bed.
.
But all this crowded life has been to thee
No more than lyre, or lute, or subtle spell
Of viols, or the music of the sea
That sleeps, a mimic echo, in the shell.
.
Oscar Wilde
(16 October 1854 – 30 November 1900)
Irish Poet
For an analysis of the poem pl. visit:
1. http://www.helium.com/items/2252109-poetry-analysis-my-voice-by-oscar-wilde
2. http://kellyrfineman.blogspot.com/2009/05/her-voice-and-my-voice-by-oscar-wilde.html
Related articles
- Reflection for today…To Live Is The Rarest Thing In The World -Oscar Wilde (mysoulsonice.wordpress.com)
- 10 Oscar Wilde Inspirations – From ‘Wilde’ Reality Show Parodies to Literary Fashion Photography (TrendHunter.com) (trendhunter.com)
- Review: ‘The Picture of Dorian Gray’ by Oscar Wilde (therabbitbooks.wordpress.com)
వ్యాఖ్యానించండి