బుజ్జి పిట్ట … రాబర్ట్ ఫ్రాస్ట్

bird at piano lesson with rock

.

రోజల్లా మా ఇంటిపక్కనే కూస్తున్న

ఒక పిట్టని తరిమేద్దామనుకున్నాను

.

ఇక ఎంతమాత్రం భరించలేననుకున్నాక

ద్వారం దగ్గరనిలబడి చప్పట్లుకొట్టేను

.

నాలో కూడ కొంతలోపం ఉంది ఉండాలి

అది పాడుతోందంటే దాని లోపం కాదు

.

అసలు ఆ మాటకొస్తే, ఏ పాటనైనా

అణచివెయ్యాలనుకోవడంలోనే ఏదో లోపం ఉంది

.

రాబర్ట్ ఫ్రాస్ట్

.

(ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ కవితలో ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఏ పాటనైనా అణచివేయాలనుకోడం లోనే ఏదో లోపం ఉంది… అన్నది.

లోపాలని ఎత్తిచూపిస్తూ చిన్న కార్టూనులుగీసినా సహించలేని మనపాలకుల అసహనాన్ని ఈ నేపథ్యంలో చూడండి. ఈ కవితలో తాత్త్విక సందేశం ఎంత సున్నితంగా చెప్పబడిందో. ప్రజాస్వామ్యం అడ్దుపెట్టుకుని నియంతలు  పాలకులైతే విమర్శలు జీర్ణించుకోలేరు. అధికారం పోవడం తట్టుకోలేరు. కనుక వాళ్ళకి వ్యతిరేకంగా ఎంత చిన్న స్వరం వినిపించినా దాన్ని అణచివెయ్యాలని ప్రయత్నిస్తారు. If self-pity is hallmark of villainy, impatience is the hallmark of tyranny ప్రజాస్వామ్యాన్ని ప్రజలే  పరిరక్షించుకోవాలి… తమవారసులకి బానిసత్వం రాకుండా చూసుకోడానికి.) 

Robert Frost
Robert Frost (Photo credit: Boston Public Library)

.

A Minor Bird

.

I have wished a bird would fly away,

And not sing by my house all day;

.

Have clapped my hands at him from the door

When it seemed as if I could bear no more.

.

The fault must partly have been in me.

The bird was not to blame for his key.

.

And of course there must be something wrong

In wanting to silence any song.

.

Robert Frost

“బుజ్జి పిట్ట … రాబర్ట్ ఫ్రాస్ట్” కి 3 స్పందనలు

  1. agree with you sir. especially in the context of current situation in the country.

    మెచ్చుకోండి

  2. నిజమే!అంత చిన్న కవితలో ఎంత అద్భుతమైన సందేశమో!

    పాటను అణచి వేయాలనుకోవడం స్వేచ్ఛను అణచివేయాలనుకోవడమే!

    ….And of course there must be something wrong
    In wanting to silence any song…

    బ్యూటిఫుల్!

    చాలా నచ్చిందండీ మూర్తి గారూ నాకు ఇది

    మెచ్చుకోండి

  3. సుజాతగారూ,

    Thank You.

    ఒక చిన్న సంఘటన. చాలా సాధారణమైనది. చెవిలో రొదపెడుతుండే పక్షిలాంటి బలహీనమైన జీవిని తరిమెస్తుంటాం. కాని, ఒక వ్యక్తి, personal level లో ఈ సత్యాన్ని గుర్తించడం ఒక ఎత్తు అయితే, దానికి తాత్త్విక స్వరూపం ఇచ్చి, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం మరొక ఎత్తు. అందుకే నానృషిః కురుతే కావ్యం అన్నారు పెద్దలు. ఈ తాత్త్విక చింతనే ఋషిత్వం.

    అభివాదములతో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: