గుడారాల దీపాల వెలుగులో… Walt Whitman

గుడారాల దీపాలవెలుగులో,

నా చుట్టూ నిశ్శబ్దంగా,

నెమ్మదిగా కొన్ని అందమైన నీడలు తారట్లాడుతున్నాయి…

ముందుగా నేను గమనించింది

దూరాన నిద్రలో నున్న సైనిక  పటాలం;

రేఖామాత్రంగా కనిపిస్తున్న పొలాలూ;

చిట్టడవుల చివరలూ; చిమ్మచీకటీ;

ఉండుండి చీకటిని వెలిగిస్తూ

చలిమంటలను ఎగదోసినపుడు

పైకి ఎగసిపడే నిప్పు రవ్వలూ…

నిశ్శబ్దమూ;

అప్పుడప్పుడు  దెయ్యాల్లా కదుల్తున్న

ఒకటో అరో మనుషుల జాడలూ;

చెట్లూ చేమలూ

(ఒక్కసారి కళ్ళెత్తిచూసేసరికి

అవి నన్నుదొంగచాటుగా గమనిస్తున్నాయేమోనని అనిపించింది);

గాలికూడా ఆలోచనలతో జతకట్టి ఊరేగుతుంటే…

ఓహ్! ఎంత సున్నితమైన, అద్భుతమైన ఆలోచనలు…

జీవితం గురించీ, మృత్యువుగురించీ,

ఇంట్లోవాళ్లగురించీ, గతమూ, గతించిన ప్రేమలూ,

దూరమైపోయినవాళ్ళూ;

నేనలా నేలమీద కూర్చుని గమనిస్తుంటే,

నా చుట్టూ చప్పుడుచెయ్యకుండా వెళ్తున్న ఊరేగింపులా…

దూరాన్నున్న గుడారాల వెలుగునుండి

ప్రవాహంలా వస్తున్ననీడలు…

.

Walt Whitman's use of free verse became apprec...

వాల్ట్ వ్హిట్మన్

(May 31, 1819 – March 26, 1892)

.

By the Bivouac’s Fitful Flame

.

By the bivouac’s fitful flame,
A procession winding around me, solemn and sweet and slow;—but first I note,
The tents of the sleeping army, the fields’ and woods’ dim outline,
The darkness, lit by spots of kindled fire—the silence;
Like a phantom far or near an occasional figure moving;
The shrubs and trees, (as I lift my eyes they seem to be stealthily watching me;)
While wind in procession thoughts, O tender and wondrous thoughts,
Of life and death—of home and the past and loved, and of those that are far away;
A solemn and slow procession there as I sit on the ground,
By the bivouac’s fitful flame.

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American Poet

“గుడారాల దీపాల వెలుగులో… Walt Whitman” కి 10 స్పందనలు

  1. వివరించ ప్రార్ధన.

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      మామూలు మనిషికి అనారోగ్యం పాలైనపుడూ, దగ్గరవాళ్ళెవరైనాపొయినపుడూ ఆలోచనలు మృత్యువుచుట్టూ తిరుగుతాయి తప్ప, సాధారణపరిస్థితుల్లో అసలు మృత్యువే లేనట్లుగా ప్రవర్తిస్తాడు. కాని యుద్ధరంగంలో సైనికుడికి ప్రతిరోజూ మృత్యుస్పర్శే. ప్రతిక్షణం మృత్యువునుండితప్పించుకునే పోరాటమే. అందులో రాత్రి ఏకాంతంగా కాపలా కాస్తూ, మేలుకుని కూచుంటే (Night watch) ఆలోచనలన్నీ అయినవాళ్ళమీదకీ, జీవితంలోని పాత సంఘటనలూ, స్నేహాలూ, ద్వేషాలూ… ఇలా వెళ్తుంది. ఒక రకంగా మన జీవితాన్ని మనమే అవలోడనం చేసుకుని మనమే ఒక తీర్పు చేసుకుంటాం… సరిగా ఎక్కడ గడిపేమో, ఎక్కడ ఏ ఏ పొరపాట్లు చేశామో… అదే Final Judgement. ఆ భావననే కవి చక్కగా చిత్రించాడు
      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. oka sainikuni swagatham, entha chakkani swagatham, chaalaa bhgundandi,
    thank you sir.

    మెచ్చుకోండి

    1. THank you Bhaskar garu.
      with best regards

      మెచ్చుకోండి

  3. తిలక్ కూడా ఇలాగే ఓ అమృతం కురిసిన రాత్రిలో సైనికుని స్వగతం రాసినట్టున్నాడు కదా…

    మెచ్చుకోండి

    1. ఫణీంద్రగారూ,
      బాగా చెప్పారు. తిలక్ అమృతం కురిసిన రాత్రిలో సైనికుని ఉత్తరం అన్న కవిత రాసేడు. అయితే రెండింటికీ సామ్యం చలిలో సెంట్రీ డ్యూటీలోనో ఇంకేదో డ్యూటీలోనో ఉండడం వరకే అనుకుంటున్నాను. అది యుద్ధాల్ని నిరసిస్తూ, యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ రాసిన కవిత. అక్కడ సైనికుడి అసహాయత ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అది కనిపించినా, కవిత టోన్ అదికాదు. యుధ్ధానికి రాజీ పడుతూనే, మృత్యుముఖంలో జరిగే సైనికుడి అంతర్మధనం. తిలక్ ను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  4. మాస్టారూ… మీకో మెయిల్ పంపాను, చూసుకోగలరు.

    మెచ్చుకోండి

    1. Thank you so much Phaneendragaru. It’s of great help to me. My reply mail bounced so I am acknowledging here.
      with very best regards

      మెచ్చుకోండి

      1. what i have done is nothing. what you will be doing is laudable. its happy for me to have a miniscule role like the squirrel in constructing ram setu. thanks for giving me such opportunity.

        మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: