Snare… Kavi Yakoob

.

It has been long since soil lost faith in man.

.

In an age when one sees no grain but only ensnaring nets,

poor birds, they still land on land in hope.

Another season has been added afresh now

to the list of seasons,

to take seize of the birds and the grain.

.

Innocent farmer!

He never knew any fable,

other than the birds flying away with the net.

To this new huntsman, however,

grain has been dearer than the farmer.

1

Farmer is a synonym for pledging and pawning.

.

When the familiar

“harrows”

and” funnels of a drill plough”

disappear from the tongue,

and unfamiliar terms and unheard relations

become tools,

the canopy looks in bewilderment!

With accursed future,

hybridized seeds,

and hissing machinery,

the backbone of this country

has now reduced to

a lone hapless wooden mast ravaged by termites.

.

As human relations get washed in dollars,

the farmer is weaned away from Nature,

to lean on her stead, the machine.

.

In her own interest,

and no longer trusting the nets

that snare man,

soil

and the Nature,

Time heralds:

The Earth needs freedom!

.

Image Courtesy: Kavi Yakoob

Kavi Yakoob

Dr. Yakoob is working as Associate Professor at Anwarul – Uloom Degree College, University of Hyderabad, Hyderabad, Andhra Pradesh. He runs a blog: http://kaviyakoob.blogspot.in/

He has so far published 3 anthologies of his poems: eDategani prayAnam(2009) PravahimcE jnApakam (1992) and Sarihaddu rEkha (2002).

The present poem focuses on how the value system existed, the fabric of  human relations in spite of caste differences prospered in earlier times and how the advent of economic liberalization made agriculture unviable and the soil barren, with the farmer sucked into the vortex of  debts, crop failures and deaths.

వల

.

మనిషిని భూమి నమ్మక చాలాకాలమైంది

నిజానికి నేలపైన మాయవలలు తప్ప
గింజలే కన్పించని కాలంలో
పక్షులు గింజల కోసం భూమ్మీద వాల్తున్నాయి
పక్షుల  మీదా
గింజల మీదా
పెత్తనం కోసం
ఇప్పుడు కొత్తగా రుతువుల జాబితాలో
వలల రుతువు

వలల్ని ఎత్తుకుపోయిన
పక్షుల కథలు తప్ప
మరేమీ తెలీని రైతు
సరికొత్త బోయవానికి
రైతు కన్నా గింజలంటేనే అతి ప్రేమ!!

1

రైతుకి మారుపేరు తాకట్టు

దూరమైన మాటలూ, విన్పించని పిలుపులూ
అన్నీ పనిముట్లైన ఈ పూట
గుంటకలూ
జడ్డిగమూ
నాలుక మీంచి ఎగిరిపోతుంటే
తలపైని కప్పుబిత్తరపోతోంది!!
వంకర జాతకాలు
సంకర గింజలూ
సర్పయంత్రాలూ
వెరసి ఈ దేశానికి వెన్నెముకరాజు
చెదలు పట్టిన నిలువెత్తు వొంటరి దిక్కులేని చెక్కస్తంభం

మానవీయ సంబంధాలు
డాలర్ అలంకారాల్ని పులుముకొంటుంటే
రైతు ప్రకృతిలోంచి యంత్రంలోకి వొదిగిపోతున్నాడు.

మనిషినీ
భూమినీ
ప్రకృతినీ
దగాచేసే వలల్ని నమ్మక
ఇప్పుడు తన స్వేచ్చకోసం కాలమే నినదిస్తుంది
భూమికి ఇప్పుడు స్వేచ్చ కావాలి!!

***

కవి యాకూబ్

డా. యాకూబ్  Anwarul – Uloom Degree College, University of Hyderabad, Hyderabad, Andhra Pradesh లో Associate Professor గా పనిచేస్తున్నారు. ఆయన రొట్టమాకురేవు అన్న బ్లాగుతో పాటు (http://kaviyakoob.blogspot.in/) Face Bookలో కవిసంగమం అన్న ఫోరం కూడా నడుపుతున్నారు. అదే పేరుతో మరొక బ్లాగుకూడ త్వరలో ప్రారంభించబోతున్నారు.
ఇంతవరకు ఎడతెగని ప్రయాణం(2009) ఫ్రవహించే జ్ఞాపకం (1992) సరిహద్దు రేఖ (2002) అన్న కవితా  సంపుటులు వెలయించారు.

“Snare… Kavi Yakoob” కి 8 స్పందనలు

  1. భూమికి ఇప్పుడు స్వేచ్చ కావాలి!!

    True

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      పురాణాల్లో శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించేదని చదివి ఏదో పుక్కిటి పురాణం అనుకున్నాను. ఇప్పటి పరిస్థితులు గమనిస్తుంటే, బహుశా పాతరోజుల్లోకూడ ఇలాంటి భూకబ్జాలే జరిగి ఉంటాయేమోననీ, ఆ భూమిని మళ్ళీ తిరిగి ప్రజలకు అప్పగించడమే పురాణంగా అభివర్ణించేరేమోననీ అనిపిస్తోంది.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. మాయగాళ్ళ పిడికిట్లో ..భూమాత విల విల లాడుతుంది. నిజం.
    ఆకాశం అంతా కొత్తగా వచ్చిన వలలు..నిజం.నిజం
    చాలా మంచి కవితని పరిచయం చేసారు. ధన్యవాదములు మూర్తి గారు.

    మెచ్చుకోండి

    1. వనజ గారూ,
      చిత్రంగా ఏళ్ళు గడుస్తున్నకొద్దీ భారతదేశ చిత్రం ఏం మారడం లేదు. అప్పుడు రాజులూ రాజ్యాలుంటే, ఇప్పుడు విభిన్నమైన పార్టీలూ, రాష్ట్రాలూ ఉన్నాయి. అవే కలహించుకోడాలు, అదే రాజకీయాలు, అదే దేశాన్ని ఇవతలవాళ్లకి తాకట్టుపెట్టే ప్రయత్నాలు. అప్పుడు కేవలం రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే పోయింది. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం కూడ పోతున్నాది. ఈ సరళి ఇలాగే ఇంకా కొనసాగి దేశద్రోహులకి తగిన శిక్షలు పడకపోతే, భవిష్యత్తులో పిల్లలు మళ్ళీ స్వాతంత్ర్యం కోసం యుద్ధాం చెయ్యవలసి వచ్చేట్టు కనిపిస్తోంది.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  3. సరికొత్త బోయవానికి
    రైతు కన్నా గింజలంటేనే అతి ప్రేమ!!
    భూమికి ఇప్పుడు స్వేచ్చ కావాలి!!
    chakkani kavitha, manchi anuvadham,
    thank you sir.

    మెచ్చుకోండి

    1. భాస్కర్ గారూ,
      ఇప్పుడు రైతులు ఏమైపోయినా ఫర్వాలేదు. కంపెనీలకు కావలసినవి గింజలే. ఈ దేశం వ్యవసాయ రంగం లో స్వయం సమృద్ధంగా ఉండడానికి డాక్టర్ స్వామినాథన్ వంటి వ్యవసాయ శాశ్త్రవేత్తలకృషిని పూర్తిగా భ్రష్టుపట్టించి, మళ్ళీ మనం తిండిగింజలకి పైదేశాలమీద ఆధారపడే స్థితి తీసుకు వస్తున్నారు. చిన్నదేశాలకైతే ఫర్వాలేదు గాని, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభాగల మనదేశానికి అది ఎంత విపత్కరమైన పరిణామాలు తీసుకురాగలదో ప్రజలూ గమనించడంలేదు, ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. ఈ సమస్యని పట్టించుకుని యువతరమే తగిన చర్య తీసుకోవాలి.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  4. “భూమికి ఇప్పుడు స్వేచ్చ కావాలి!!” మరో ఆణిముత్యం యాకూబ్ గారి కలంనుండి….అక్షరసత్యాలే. మూర్తిగారూ మీరన్నట్టు మళ్ళీ స్వాతంత్ర్యం కోసం పోరాడే రోజులు ప్రారంభమయ్యాయని నా ఉద్దేశ్యంకూడా….అయితే ఈ సారి స్పష్టతలేదు దేనికోసం పోరాడుతున్నామే తెలియనితనం లాగ. ఆఖరికి విత్తనాల్లోనూ కల్తీ అంటే ఆత్మహత్యాసదృశ్యం. మనల్ని మనమే మోసగించుకోవడం లాంటిదేగా..మీ అనువాదంలో “Farmer is a synonym for pledging and pawning.” నాకు నచ్చింది.

    మెచ్చుకోండి

    1. శ్రీనివాస్ గారూ,
      మేధావులు ఇప్పుడు జండాలనీడల్లో భద్రంగా ఉంటున్నారు. మనదేశ ఐక్యతని భగ్నం చెయ్యడానికీ ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దెబ్బతియ్యడానికి శత్రుదేశాలు పన్నిన/పన్ను తున్న పన్నాగాలు అన్నీ సఫలమౌతూనే ఉన్నాయి. మనకి చాణక్యులూ లేరు, తిమ్మరుసులూ లేరు. స్వంతలాభంకోసం దేశాన్నీ, దేశప్రయోజనాలనీ పణం పెడుతున్నప్పుడు అడ్డుకోగలిగింది చైతన్యవంతమైన యువతరం మాత్రమే. అందుకే వాళ్ళని సమస్యలమీద దృష్టిఉంచకుండ చెయ్యడానికి కావలసిన అన్ని రకాల diversions అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు చదువు మానేసి మరీ స్వాతంత్ర్యపోరాటంలోకి దిగారు విద్యార్థులు. ఇప్పుడు అలా కాదు. వాళ్లని ఒక లక్ష్యంకోసం సమీకరించడం కష్టం. రోజురోజుకీ వ్యవసాయభూమి తరిగిపోయి వ్యవసాయేతర ఉపయోగాలకు మళ్ళుతోంది. ఉన్న వ్యవసాయభూమిలో వ్యవసాయం లాభసాటి కాదు. రైతు బ్రతికేదలా/ అతనికి విశ్వాసం కలిగించేదెలా? ఆకాశంలోంచి rains కి బదులు grainsరాలాలని కోరుకునే రోజు వస్తుంది. అందుకే ఇలాంటి కవితలు ఇప్పుడు అవసరం. ప్రజల్లో చైతన్యం అవసరం. మనం ఎన్నుకోవలసినవాళ్లకి దేశభక్తీ, నిజాయితీ ఉండడం అవసరం… మనకులమో, మనమతమో, మన ప్రాంతమో అయి ఉండడంకంటే. కానీ, రాజకీయనాయకులు వాటినిపట్టుకునే వేలాడతారు. ప్రజల్లో ఆ విభజన శాశ్వతంగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: