బాధ … సారా టీజ్డేల్

A mother holds up her child.
A mother holds up her child. (Photo credit: Wikipedia)

కెరటాలు సముద్రపు శ్వేత పుత్రికలు

చిరు చినుకులు ఆ వర్షపు చిన్ని పిల్లలు

నులివెచ్చని నా తనువున

ఏ మూలనో మాతృత్వపు తీపు?

.

రాత్రి ఈ తారకలకు మాతృమూర్తి

నురగలని చేతుల్లోకెత్తుకుని ఆడిస్తోంది గాలితల్లి

విశ్వమంతా సౌందర్యంతో పొంగిపొర్లుతోంది

కానీ, నేనే ఇంటిపట్టున ఉండిపోవాలి

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

సారా టీజ్డేల్

మాతృత్వ కాంక్ష ఎలా ఉదయిస్తుందో సారా టీజ్డేల్ ఈ కవితలో చక్కగా చెప్పింది. ఆ కాంక్ష మనసులో రగిలినప్పుడు ప్రకృతిలోని సమస్త వస్తువులూ మాతృత్వపు ప్రతిబింబాలుగా కనపడినట్టు చెప్పడం ఎంత కమ్మని ఊహ!

.

Pain

Waves are the sea’s white daughters,
And raindrops the children of rain,
But why for my shimmering body
Have I a mother like Pain?

Night is the mother of stars,
And wind the mother of foam —
The world is brimming with beauty,
But I must stay at home.

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American Lyrical Poet

“బాధ … సారా టీజ్డేల్” కి 6 స్పందనలు

  1. ఈవిడ రచనలు చదువుతున్న కొద్దీ అభిమానం పెరిగిపోతోంది. ఎంత బాగా వ్రాశారో!

    మెచ్చుకోండి

    1. అమ్మా రసజ్ఞా,
      ఆ మాట నిజం. ఆమె ప్రత్యేకత తక్కువ మాటల్లో మంచి భావాన్ని పలికించడం. ఆమె ఎన్నుకునే ఉపమానాలుకూడా సందర్భానికి అతికినట్టు సరిపోయేవే ఎన్నుకుంటుంది.
      ఆశీస్సులతో

      మెచ్చుకోండి

    1. Thank you Dr. Saradagaru.
      with best regards

      మెచ్చుకోండి

    1. భాస్కర్ గారూ,
      కవిత్వం రాయడానికి కూడా శిక్షణా తరగతులు ఉంటే, ఆ సిలబస్ లో తప్పకుండా చేర్చదగిన రచయిత్రి సారా టీజ్డేల్. ఆమె కవితలు నెట్ లో బాగానే లభిస్తాయి. తప్పకుండా చదవండి.
      అభివాదములతో

      మెచ్చుకోండి

Leave a reply to the tree స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.