Driftwood… Sara Teasdale

Driftwood
Driftwood (Photo credit: sirwiseowl)

.

కొట్టుమిట్టాడుతున్న నా ఆత్మజ్యోతికి
ఒక ఆకారాన్నీ, ఒక హృదయాన్నీ,
ఒక పేరునీ ఇచ్చింది నా తాతముత్తాతలే గాని

నిలకడలేని ఆ దీపకళికకి
ఇంద్రధనుసు వన్నెలనద్దింది మాత్రం
నా ప్రేమికులే…

రగుల్తున్న బల్లచెక్క
తన రతనాలవెలుగులను
సముద్రంమీద దిక్కులేక కొట్టుకొస్తున్నప్పుడు,
నీలి అలల దీప్తులనుండీ,
రంగురంగుల రేయింబవళ్ళనుండీ
నేర్చుకున్నట్టు.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

సారా టీజ్డేల్

.

Driftwood
.

My forefathers gave me
My spirit’s shaken flame,
The shape of hands, the beat of heart,
The letters of my name.

But it was my lovers,
And not my sleeping sires,
Who gave the flame its changeful
And iridescent fires;

As the driftwood burning
Learned its jewelled blaze
From the sea’s blue splendor
Of colored nights and days.

.

Sara Teasdale

“Driftwood… Sara Teasdale” కి 5 స్పందనలు

  1. koncham kothaga undi, pada prayoogalu chikkumudulla anipisthunnai andi.
    రగుల్తున్న బల్లచెక్క
    తన రతనాలవెలుగులను
    సముద్రంమీద దిక్కులేక కొట్టుకొస్తున్నప్పుడు,
    నీలి అలల దీప్తులనుండీ,
    రంగురంగుల రేయింబవళ్ళనుండీ
    నేర్చుకున్నట్టు.
    i think it needs some more shape.
    emanukokandi,
    thanking you sir.

    మెచ్చుకోండి

  2. భాస్కర్ గారూ,
    మీరు చెప్పిన కొంచెం అన్వయ క్లిష్టత కొంతవరకు నిజమే. దానికి కారణం ఉపమాన ఉపమేయాలూ, వాటి వరుసక్రమమూను. ఇందులో కలగలిసిఫోయి ఉన్న ముఖ్యమైన Driftwoodకీ జీవితానికీ చెప్పిన పోలిక కూడ ఒక కారణం. Driftwood అంటే నదిలోనో సముద్రం మీదనుండో ఏ దిక్కూలేక (ఇక్కడ దాని అర్థం directionlessఅని) కొట్టికొచ్చిన కలప ముక్క. చెట్టు దానికి జీవితాన్నిస్తుంది. అది పడవగనో నావగానో ఆకారం దాలుస్తుందికూడ. జీవితంలోని ఆటుపోట్లకు గురై ఛిన్నాభిన్నమైపోయినపుడు, అది అలలమీద రాత్రీ పగలూకొట్టుకొస్తుంది. అదే మనజీవితం కూడా. అయితే అది మండుతున్నప్పుడు … జీవిత చరమాంకంలో, దానివెలుగులు… లేదా జీవితంలో అదిసాధించిన వెలుగులు ఎక్కడనుండి వచ్చాయి? జీవితంలోని ఆటుపోట్లనుండే వచ్చాయి. తల్లిదండ్రులు జన్మనివ్వగలరు గాని ఎలా బతకడమో నేర్పించలేరు. అది ఎవరికివారు తనజీవితాలనుండి, ఏకాంతంగా అనుభవించిన సుఖదుఃఖాలనుండి నేర్చుకోవలసిందే. కవయిత్రి ఈ సత్యాన్ని తను ప్రేమద్వారా, ప్రేమలోని ఆటుపోట్లద్వారా నేర్చుకుందని తాత్పర్యం.
    అభివాదములతో

    మెచ్చుకోండి

  3. ee kavith chadivaka aame life story chadavalanipinchindandi,
    chaalaa depth, vedana kanipisthunnai,
    meeru anumathisthe, mee adugu jadallo,
    nenu kooda naa tholi anuvadham, e kavitha tho prayathnidhamanukuntonnannadi,
    with your permission and blessings.
    thanking you sir.

    మెచ్చుకోండి

    1. భాస్కర్ గారూ,
      భలేవారే. నా అనుమతి దేనికి? నాకు కూడా ఏ కాపీ రైట్లూ లేవు. కేవలం ఆమె కవిత్వం అంటే ఇష్టం తప్ప. అసలు ఈ బ్లాగులో ప్రతి అనువాదానికీ మూలాన్ని ఇవ్వడానికి కారణం, ఏ అనువాదమూ సంపూర్ణమూ సమగ్రమూ కాదుకాబట్టి, ఎవరైనా మరో అనువాదం చేద్దామనుకున్నప్పుడు మూలంకోసం వెతుక్కోకూడదన్న కారణంతోటే. ఒక కవిత ఎంతమంది అనువాదం చేస్తే అంత మంచిది. అది దాని ప్రాచుర్యాన్ని ఒకవైపు గుర్తుచేస్తే, రెండవవైపు కవిహృదయాన్ని ఎన్నికోణాల్లో వీలయితే అన్నికోణాల్లో ఆవిష్కరించే అవకాశం కలుగుతుంది. తప్పకుండా అనువాదం చెయ్యండి. దాన్ని అందరితో పంచుకొండి.
      మనఃపూర్వక అభినందనలూ, అభివాదాలతో.

      మెచ్చుకోండి

  4. thank you sir, i will try for my first translation.

    మెచ్చుకోండి

Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.