How can I be a poet? … Nanda Kishore

Tell Me That You Love Me, Junie Moon
Tell Me That You Love Me, Junie Moon (Photo credit: Wikipedia)

.

Do you know?  I love.
I love her, the very idea of her,
And every inch of her
…always and endlessly
I love …

With nothing else to do or say

I just go on loving her.

The whole village would be wailing either
for the crop being dry, or field becoming a fallow;
for the loss of grain to rain or, to sudden sweeping flood;
for the crop being lost to the pests or, to the beasts;
Or for want of money to pay the principal or, the interest
ad infinitum.
And it migrates in search of a greener pastures.

Not lagging behind, I too migrate into my thoughts…
Bear-hug her;
And get lost in the thoughts
Of the moments I spent in her presence, or
About our love-making;
About the past memories
Or the enduring ignorance;
I try to recollect them most
And scribble a semblance of poetry.   

From dawn to dusk

The whole village breaks its neck
And the sweat streams down
To wet the verdurous fields

Me too assay in my imaginings
Showering springs of fond desires.
I liken the spectrum to her varied hues
And regale it is all a manifestation of my love.

Due either to inefficient administration or corruption

Prices go northwards
And the quantities southwards.
Feet find it hard to drag themselves.

Oblivious to the pervading suffering
I continue my flights into her imagination
I will be lavish in expending my words
But be miserly in my ideas.

Strange,
It never hurts or embarrasses me
When I had to buy water in cans
Unable to find a drought in the open;
Or when I had to walk down miles
For the kiss of a fresh breeze…
They never spur me to write a poem.

skyscrapers appropriate the sky before my very eyes
They steal the Sun and hide the Moon behind,
I recreate the clouds and the skies in my mind
And shall hover between the cellar and the Penthouse
And in that invisible vacuous loneliness

I still want not words in praise her beauty

That the moonlight is her countenance or
Light … a reflection of her smiles…
Some such crazy things I write
And drop down stretching my hands skywards.

One or two of my kin join the revolution
And ask me join and lend them a hand.
Answer-less, I remain stone dead silent
Occupied with strange and exotic thoughts.
In no time, her memories inebriate me once more.
 
Death of an activist reaches my ear somehow.
I grieve perfunctorily, and look into the sky.
But, even there, I see her form.
I find her in the brilliance of the Milky Way.
I shut myself from the sheen of martyrs
With impromptu lenses, lest it should reach my eye.

Life succumbs to accident as I watch
People in the hospital
Wail their eyes and hearts out in agony
I see the handicapped scattered severally
But I reach home coolly.

The siren of 108 ceases instantly.
Silence envelopes suddenly from nowhere.
I forget everything and reconcile in no time.
I bemoan my endless grief, and pen
How deeply she hurt me.

I regale in the bliss of weaving words
And curse myself that I did not get wiser.

I shall be walking everyday amidst
the destitute, helpless
the half-clad and the forced prostitutes…
But I turn a Nelson’s eye to their nudity

Describing her unseen blooms of youth
And dreaming of hugging her
I doze in the sedation of that poetry.
I revel, besot with her love    

Shaking me to my senses
Somebody pleads me to write something

Turning over the pages of news paper,
I make up for my lack of emotion and
I throw out words dabbed in glycerine-tears
I am averse to rewriting history
Nor even commission my mind to read it
Yet, it seems I know enough
No matter what people think of me.

With no sense of the present,
I always dream of her everyday.

Fall sets about in many families with War
Knives a-flower with every swish
Guns and bombs turn in their own seasons
Capitalism craves for its prestige.

But I will be steeped in affected naturality
To enjoy her spirit
And I will be madly searching for her
Walking through the pools of blood.
Scorning her sometimes
And importuning at other times,
Giving form to my imaginary love,
I question her knowing the answers before.

I am unable to make out still,
What the poet is there for after all?
For himself, or for the society?

.

(108 is an Emergency Medical Service and Accident Relief van run by Government of Andhra Pradesh)

Image courtesy: Nanda Kishore

Nanda Kishore

A young Engineering Student awaiting his final year results

and

a socially conscious and enthusiastic poet.

.

నేనెట్లా కవినైత?…

తెలుసా?నే ప్రేమిస్తుంటాను.
తనని ఊహని, తనువులోని అణువుల్ని
నిరంతరం అదేపనిగా
ప్రేమిస్తుంటాను.

చేసేది, చెప్పేది ఏమీలేక
నిత్యం ఆమెని ప్రేమిస్తూనే ఉంటాను.-

చేను ఎండిందనో, బీడు పడిందనో,
వానకో వరదకో గింజ రాలిందనో
పురుగుకో పుట్రకో పంటపోయిందనో
అసలుకో మిత్తికో డబ్బు చాల్లేదనో
ఊరంతా ఎందుకో ఏడుస్తుంటుంది.
వీలైనంతగా ఎక్కడికో వలసపోతుంది.

నేనూ తలపుల్లోకి వలసపోతాను.
తనని గట్టిగా వాటేసుకుంటాను.
తనతో గడిపిన క్షణాల్నో, జరిపిన శృంగారాన్నో
గతించిన జ్ఞాపకాల్నో, గతించని అజ్ఞానాన్నో
వీలైనంతగా గుర్తుచేసుకుంటాను.
కవిత్వంలాంటిది రాస్తుంటాను.

ఉదయంనుండి సాయంత్రందాక
ఊరు ఊరంతా శ్రమిస్తూనే ఉంటుంది.
చెమట ధారగా పారుతుంటుంది.
పచ్చని చేలని తడుపుతుంటుంది.

నేను ఊహల్లో శ్రమిస్తూ గడిపేస్తాను.
వలపు ధారలు కురిపిస్తాను.
ఏడు రంగులు తనవే అంటుంటాను.
అంతా ప్రేమనే అనుకుంటుంటాను

అవినీతికో అసమర్ధపాలనకో
ధరలు పెరిగిపోతాయ్.
బరువులు కొద్దికొద్దిగా తగ్గిపోతాయ్.
కాళ్ళు ఈడ్చుకుంటూ కదులుతాయి.

నేను కష్టాన్ని కాస్తైన లెక్కచేయక
తన ఊహల్లోనే తేలుతుంటాను.
అక్షరాల్ని విరివిగా ఖర్చుచేస్తుంటాను
భావాల్ని మిక్కిలిగా పొదుపు చేస్తుంటాను.

గుక్కెడు నీటికి గతిలేక-
నీళ్ళ  క్యాన్లని కొంటున్నప్పుడో,
చల్లటి చిరు గాలి స్పర్శకోసం-
అల్లంత దూరాలు నడిచినప్పుడో
నాకెందుకో అసలే సిగ్గనిపించదు.
అపుడసలెందుకో కవిత్వం రాదు.

నా కళ్ళముందే భవనాలు ఆకాశాన్ని దోచేస్తాయి.
నా సూరిన్ని వెన్నెలని కనపడకుండా చేస్తాయి.
నేను మేఘాల్ని, అకాశాల్ని ఊహించుకుంటాను.
సెల్లార్`కి పెంట్`హౌస్`కి మధ్యలో
కనపడని ఏకాంతంలో వేలాడుతుంటాను
అప్పటికీ తన అందాన్ని పొగుడుతూనే ఉంటాను.

వెన్నెల వదనమనో కాంతుల నవ్వులనో
పిచ్చిగా ఏదేదో రాస్తూనే ఉంటాను.
నింగికి చేతులు చాచి కూలిపోతుంటాను.

సోదరుల్లో ఒకరో ఇద్దరో ఉద్యమిస్తారు.
నన్నూ తోడు రమ్మని అడుగుతారు.
నేను సమాధానం లేని మౌనంలో ఉండిపోతాను.
అనుభవంలేని ఆలోచనతో నిండుకుంటాను.
మళ్ళీ తన మత్తులో మునిగిపోతాను.

కార్యకర్త మరణ వార్త ఎలాగోలా చెవిన పడుతుంది.
కాసేపు దుఃఖించి చుక్కల్లోకి చూస్తాను
అక్కడా తన రూపమే కనిపిస్తుంది.
పాలపుంత వెలుగుల్లో తనని పోల్చుకుంటాను.
అమరుల కాంతి కళ్ళకి చేరకుండా
మాయకటకాల్ని సృష్టించుకుంటాను.

యాక్సిడెంటులో ప్రాణాలు
నా కళ్ళముందే కదిలిపోతాయి.
ఆసుపత్రిలో జనాలంతా
నొప్పితో విలవిలమంటు అరుస్తుంటారు.
వికలాంగులు ఎందరో  విడివిడిగా కనిపిస్తుంటారు.
నేను ఇంటికి చేరిపోతాను.

108 శబ్ధం వెంటనే ఆగిపోతుంది.
ఎక్కడిదో నిశ్శబ్ధం అలుముకుంటుంది.
కాసేపటికి అంతా మరిచిపోతాను.
నా వేదనే అనంతమని విర్రవీగుతాను.
మనసు గాయపడిందని రాసుకుంటాను.

అక్షరాల్ని అల్లుకుంటు పరవశిస్తాను.
బుద్ధి రాలేదని తిట్టుకుంటాను

అనాధగానో అబలగానో
జోగినిగానో, వివస్త్రగానో
పడి ఉన్న శరీరాల మధ్యనుండే
రోజూ నడుస్తాను.
ఆ నగ్నత్వాన్ని దాటవేస్తాను.

కనపడని పరువాల్ని వర్ణిస్తూ,
హత్తుకునే నిమిషాల్ని కలగంటూ,
నిదురలాంటి కవిత్వంలో జోగుతుంటాను.
ప్రేమోన్మత్తుడనై సంచరిస్తాను.

ఎవరో ఒకరు నన్ను పట్టి కుదుపుతారు.
ఏదో ఒకటి రాయమని అడుగుతారు.

వార్త పత్రిక తిరగేసి వెలితిని కొంచెం పూడ్చుకుని
గ్లిసరిన్ కన్నీటిలో తడిపిన అక్షరాల్ని
అక్కడ ఇక్కడ విసిరేస్తాను.

చరిత్రలోకి ఒక్క అడుగు వేయాలన్న మనసు రాదు.
చదవాలంటే ఎందుకో ఓపిక ఉండదు.
నాకున్న జ్ఞానమే అనంతమనే
పిచ్చి ప్రేలాపనలో లీనమవుతాను.

మానం మరిచిన వర్తమానంలో
ఆమెకై రోజు కలవరిస్తుంటాను.

యుద్దంలో శిశిరాలు నర్తిస్తుంటాయి.
ఖడ్గాల్లో వసంతాలు గానం చేస్తాయి.
తుపాకులు బాంబులు ఋతువుల్ని సృష్టిస్తాయి.
సామ్రాజ్యవాదం ప్రతిసృష్టికై పాకులాడుతుంది.

నేను లెక్కకి అందని సహజత్వంలో మునిగిపోతాను.
ఆమెలోని ప్రకృతిని ఆస్వాదిస్తాను.
రక్తపు మడుగుల్లో నడుచుకుంటు
ఆమెనే వెర్రిగా వెతుకుతుంటాను.
ఒక్కోసారి నిరసించుకునో
మరోసారి నిలదీస్తూనో
లేని మనసుకి రూపమిచ్చి
సమాధానం తెలిసీ
ప్రశ్నిస్తుంటాను.

 కవి తనకోసమో,ప్రపంచంకోసమో
నాకెప్పటికీ అర్ధం కాదు!

నంద కిషోర్ 

“How can I be a poet? … Nanda Kishore” కి 4 స్పందనలు

    1. Thank you for the compliment. I convey it to the poet.
      with best regards

      మెచ్చుకోండి

  1. “కవి తనకోసమో ప్రపంచంకోసమో” ఈ సామాజిక స్పృహ కోసం వెతుకుతున్న అభ్యుదయ వాదులకీ కవులకీ ఈ కవిత మీ అనువాదం ఓ నిధి….మరో మంచి ప్రయత్బం మూర్తిగారూ…..

    మెచ్చుకోండి

    1. Thank you vasudev garu for your support. And congrats to Nanda Kishore.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: