కొడుక్కి అమ్మ ఉత్తరం … లాంగ్స్టన్ హ్యూజ్

Don't turn back
Don’t turn back (Photo credit: xXxRawrKidRawrxXx)

.

ఒరే, నాన్నా! నీకో విషయం చెప్పాలి:
నా జీవితం ఏమీ
బంగారు మెట్లెక్కినంత సాఫీగా గడిచిపోవడంలేదు.
అన్నీ కర్రమెట్లే.
చాలాచోట్ల మేకులు దిగి ఉన్నాయి.
మెట్లకి పెచ్చులూడిపోయాయి.
చెక్కలు అక్కడక్కడ కన్నాలు కూడపడ్డాయి.
దానిమీద తివాచీ చిరిగిపోయి కొన్ని చోట్ల బోసిగా కూడా ఉంది

అయినా, ఆగకుండా ఎక్కుతూనే ఉన్నాను.
మధ్యలో మార్గాయాసం తీర్చుకుంటున్నాను.
అవరోధాలొచ్చినపుడు దిశమార్చుకుంటున్నాను,
ఒక్కోసారి ఎక్కడా వెలుతురుకనరానప్పుడు,
చీకట్లోనే గుడ్డిగా ప్రయాణిస్తున్నాను.
కాబట్టి, నాన్నా,
నువ్వెన్నడూ వెనకడుగెయ్యడానికి ప్రయత్నించకు.
మెట్లమీదే చతికిలబడిపోకు
ముందుకి సాగడం కష్టంగా కనిపిస్తోందని.

నాన్నా! క్రుంగిపోవద్దు.
నేను ఇంకా ఎక్కుతూనే ఉన్నానురా తండ్రీ,
నేనింకా ఎక్కుతూనే ఉన్నాను.
నా జీవితం ఏమీ
బంగారు మెట్లెక్కినంత సాఫీగా గడిచిపోవడంలేదు.

.

Français : Explanation of License: The is a wo...
Français : Explanation of License: The is a work by photographer Gordon Parks for the U.S. Office of War Information of 1943. U.S. Office of War Information Prints & Photographs Division Library of Congress REPRODUCTION NUMBER: LC-USW3-033841-C (Photo credit: Wikipedia)

లాంగ్స్టన్ హ్యూజ్

.

Mother To Son
.
Well, son, I’ll tell you:
Life for me ain’t been no crystal stair.
It’s had tacks in it,
And splinters,
And boards torn up,
And places with no carpet on the floor—
Bare.
But all the time
I’se been a-climbin’ on,
And reachin’ landin’s,
And turnin’ corners,
And sometimes goin’ in the dark
Where there ain’t been no light.
So, boy, don’t you turn back.
Don’t you set down on the steps.
‘Cause you finds it’s kinder hard.
Don’t you fall now—
For I’se still goin’, honey,
I’se still climbin’,
And life for me ain’t been no crystal stair.
.
Langston Hughes

(February 1, 1902 – May 22, 1967)

American Poet, Social Activist, Novelist, Playwright, and Columnist.

“కొడుక్కి అమ్మ ఉత్తరం … లాంగ్స్టన్ హ్యూజ్” కి 11 స్పందనలు

  1. అమ్మ! చెప్పింది !! తాను ఆచరించింది ఆచరణలో పెట్టమని.
    ఆగవద్దని ఆగాక సాగిపొమ్మని !! అమ్మ అమ్మే!

    ఇంతకు ఏమిటో తెలుసా ఆమె చెప్పిన..
    మేకులు, ఊడిన పెచ్చులు, కన్నాలు,

    గుండెకు గుచ్చుకున్న గునపాల – మేకులు
    మదిలో తలపోసిన జ్ఞాపకాల/ఊహల తాలూకు మేడల గోడల (నుంచి) – ఊడిన పెచ్చులు
    ఆశలన్నీటికి నిరాశలు ఎదురైనప్పుడు అడియాసగా మారిన బ్రతుకులో మిగిలిన – కన్నాలు

    చినిగిపోయిన తివాచి ఆమె వస్త్రాలు కాగా,
    కొడుకు బాగోగులకై తాను (నగ నట్ర అమ్మి) కేవలం మట్టి గాజులతో బోసిగా నిలిచింది తాను.

    తాను ఇచ్చిన సందేశం :
    అవరోధాలు ఎన్ని ఎదురైనా లక్ష్యం మరువకు
    సాధన ఆపకు
    అవసరమైనంత మేరకు అలుపు తీర్చుకో, కాని
    అడ్డు ఎదరైనప్పుడు నడక దిశా మారాలే తప్ప ప్రయాణం గమ్యం దిశగానే సాగించు!
    వెలుతురు కనపడనప్పుడు (ఆశా వాదం సన్న గిల్లినప్పుడు)
    గుడ్డిగా (భగవంతుని పై) భారం మోపి
    ముందుకు నడువు, వెనుకడుగు వేయకు, చతికిల పడకు
    నేను నీతో పాటే … నీ వలె నడుస్తున్నాను రా తండ్రీ !!
    ఇంత కంటే ఇంకేమి భరోసా కావాలి

    అమ్మ! నీ మాటే నాబాట !!

    మీ అనువాద భాగాన్ని ఈ video క్రింద description గా ఉన్చేతే
    శాశ్వత పరచి నట్లు ఉంటుంది ఈ తల్లి ఉత్తరాన్ని
    తమరి అనుమతి కై… నిరీక్షిస్తూ..

    http://endukoemo.blogspot.in

    ?!

    మెచ్చుకోండి

  2. శివ గారూ,
    మీ అభిమానానికి కృతజ్ఞతలు. అనువాదం వాడుకుందికి నాకేమీ అభ్యంతరం లేదు గానీ, మీ వీడియోలో నా పేరుకన్నా, లాంగ్స్టన్ హ్యూజ్ పేరు తప్పనిసరిగానూ, ప్రస్ఫుటంగానూ కనిపించాలని మనవి చేస్తున్నాను. ఈ బ్లాగులోని అనువాదాలని ఎవరు ఎలాగైనా ఉపయోగించుకుందికి వీలుగా CC2.5 Licence మీ ఉత్తరం చూసిన తర్వాత నా బ్లాగుకి జతచేశాను. నాకు అనువాదాలమేరకే స్వాతంత్ర్యం ఉంది. చదువరుల సౌలభ్యంకోసమూ, అందులో ఈ అనువాదం నచ్చనివారు తాము మరొక మంచి అనువాదం చేసుకుందికి అనువుగా ఉండడానికి జతచేశానుగాని, మూల పాఠానికి నాకు ఎక్కడా అనుమతులు లేవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. గ్రహించగలరు.
    అభివాదములతో,

    మెచ్చుకోండి

  3. ఒక్కోసారి ఎక్కడా వెలుతురుకనరానప్పుడు,
    చీకట్లోనే గుడ్డిగా ప్రయాణిస్తున్నాను.
    కాబట్టి, నాన్నా,
    నువ్వెన్నడూ వెనకడుగెయ్యడానికి ప్రయత్నించకు.
    మెట్లమీదే చతికిలబడిపోకు
    ముందుకి సాగడం కష్టంగా కనిపిస్తోందని.
    నాన్నా! క్రుంగిపోవద్దు.

    తల్లి ఎంత గొప్పమాట చెప్పింది. నేటి వారు, కొంతమంది, దీనికి పరమ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, ఆశావాదం చచ్చిపోతోందా? మూర్తిగారు కొద్దిగా చెప్పరూ?

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      మీరు పూజ్యులు. మీకు నేను చెప్పెదేముంది? తెలుగులో ఇంగ్లీషులో ఎన్నో సామెతలున్నాయి మనిషి తన శక్తిని అనుసరించి ఆశలపరిథిని నిర్ణయించుకోవాలని. ఈ శక్తి తెలివితేటలకి సంభందించినదీ, ఆర్థిక పరిస్థితులకు సంబంధించినదీ, ఇతర సామాజిక పరిస్థితులకి సంబధించినదీను. కానీ, ఇప్పుడు బజారులోదొరికే పుస్తకాల్లోనూ, కార్పొరేటు సంస్థల వ్యక్తివికాశతరగతుల్లోనూ ఊదరగొట్టే శిక్షణ మనిషి మానసిక స్థితిని తన శక్తికి మించిన ఆశలవైపు మళ్ళిస్తున్నాయిగాని, మనిషి తన ప్రయత్నంలో విఫలమైనపుడు దాన్ని జీర్ణించుకోగల సమర్థతనీ, దాన్ని విశ్లేషించుకుని తన వైఫల్యానికి తాను బాధ్యత వహించి ముందుకి సాగిపోగల మానసిక పరిణతిని కల్పించలేకపోతున్నాయి. దానివల్ల ఏడాదికేడాదీ సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా పెరిగిపోయే లక్ష్యాలూ, అందుకోగలిగినపుడు ఆనందం లేనపుడు నిరాశలో కూరుకుపోడం జరుగుతోంది. ఇక్కడ పైకి ఎన్ని మాటలు చెప్పినా, ఉద్యోగుల మధ్య, hierarchyమధ్య human relations చెబుతున్నారుగాని, మన ఉత్పత్తులూ సేవలూ సాటి మనిషికి అందించగల నాణ్యతా ప్రమాణాలూ, వినియోగదారుడితో human relations అన్న విషయం లో ధ్యాస ఉండటం లేదు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ప్రజావసరాలైన విద్య ఆరోగ్యం విషయాల్లో కార్పొరేటు సంస్థల్లా లాభనష్టాల బేరీజులో ఉన్నాయి. ఈ సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో కకావికలమైపోతున్న మనసుకి ఊరటకల్పించగలిగింది మనిషికి పరిణతిచెందిన మనసే. అది కుటుంబ సంస్కారం మాత్రమే నేర్పగలదు. అందులో తల్లి పాత్ర విశిష్టమైనది. తల్లి మనకి జీవం పొయ్యడమేగాదు, జీవితాన్నీ, జీవించే విధానాన్నీ అలవరుస్తుంది. అందుకే భారతీయ చింతనలో ప్రకృతిశక్తుల్ని స్త్రీ మూర్తులుగా పూజించడం. స్త్రీని మనం చులకనగా చూసినన్నాళ్ళూ, మన మనసులో పూజ్యతాభావం హరించిపోతుంది. దాని పరిణామాలే మిగతావన్నీ.
      చైతన్యవంతమైన స్త్రీలు ఉన్నంతకాలం ఆశావాదం చచ్చిపోదు.
      అభివాదములతో,

      మెచ్చుకోండి

  4. అమ్మ మాట బిడ్డకి ఎప్పుడూ.ఉత్తెజంగానే ఉంటాయి. తాను ఎక్కి వెళ్ళిన మెట్లు గురించి చెపుతూనే బిడ్డని వెనుతిరిగి చూడవద్దని చెప్పే తల్లి ఆశావాదం కి,,చైతన్యం కి . ప్రతీక.
    మీ అనువాదం,శివ గారి వ్యాఖ్యానం,వీడియో, కష్టే ఫలే గారి వ్యాఖ కూడా చాలా బాగున్నాయి.
    ధన్యవాదములు.

    మెచ్చుకోండి

  5. Thank you Vanaja garu.

    with best regards

    మెచ్చుకోండి

  6. మూర్తిగారు మనసు నిండిపోయింది. ఆనందం. ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  7. ఎంత గొప్ప ఆశావాదం. ప్రతి తల్లి చదువవలసిన తన బిడ్డలకు చెప్పవలసిన గొప్ప కవిత..

    మెచ్చుకోండి

  8. అమ్మా జ్యోతిర్మయీ,
    అందులో ఎంతమాత్రం సందేహం లేదు. పూర్వం తల్లిదండ్రులు పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దడానికే ఎక్కువ పాటుపడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు ఎక్కడలేనివీ సంపాదించిపెట్టడానికీ తరతరాలు తిన్నా తరగనిగనులు సంపాదించడానికీ వెచ్చిచ్చిస్తున్నారుతప్ప వ్యక్తిత్వం ఊసు అసలులేనేలేదు. జీవితాన్ని జీవించడంలో ఉన్న మజానీ, సౌందర్యాన్నీ తెలియజెప్పే దృక్పథమే కొరవడింది. నిన్న Dead Poets Societyఅన్న సినిమా చూశాను బహుశా కొన్ని సంవత్సరాలతర్వాత. అదికూడా నా కవిమిత్రుడు తీసుకువచ్చి ఇచ్చాడు. అందులో టీచరు చెబుతాడు కవిత్వం ఆవశ్యకత. వాల్ట్ వ్హిట్మన్ కవితలు ఎన్నో కోట్ చేస్తాడు. పరిణతి చెందుతున్నవయసులో పిల్లలకు నేర్పవలసిన పాఠాలు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం, అందులోని సౌందర్యాన్ని ఆశ్వాదించగలగడం. తమకష్టాలని ఏకరేవుపెట్టడంలో, తాముకష్టపడిపోయేమన్నదానిమీద కంటే, జీవితంలో కష్టాలున్నాయిసుమా, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలితప్ప దిగులుపడిపోకూడదన్నదాని మీద ఎక్కువ దృష్టి ఉంచాలి. జీవితానికి పిల్లలని తయారుచెయ్యాలి తప్ప, పిరికివాళ్లలా సుఖాలవెనక దాక్కునేలా చెయ్యకూడదు.
    ఆశీస్సులతో

    మెచ్చుకోండి

  9. murty garu..chala baagundi..aanuvadam chakkaga undi…

    మెచ్చుకోండి

    1. Arun Bavera garu,

      Thank you and welcome to my blog.

      With very best regards,

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.