
.
ఒరే, నాన్నా! నీకో విషయం చెప్పాలి:
నా జీవితం ఏమీ
బంగారు మెట్లెక్కినంత సాఫీగా గడిచిపోవడంలేదు.
అన్నీ కర్రమెట్లే.
చాలాచోట్ల మేకులు దిగి ఉన్నాయి.
మెట్లకి పెచ్చులూడిపోయాయి.
చెక్కలు అక్కడక్కడ కన్నాలు కూడపడ్డాయి.
దానిమీద తివాచీ చిరిగిపోయి కొన్ని చోట్ల బోసిగా కూడా ఉంది
అయినా, ఆగకుండా ఎక్కుతూనే ఉన్నాను.
మధ్యలో మార్గాయాసం తీర్చుకుంటున్నాను.
అవరోధాలొచ్చినపుడు దిశమార్చుకుంటున్నాను,
ఒక్కోసారి ఎక్కడా వెలుతురుకనరానప్పుడు,
చీకట్లోనే గుడ్డిగా ప్రయాణిస్తున్నాను.
కాబట్టి, నాన్నా,
నువ్వెన్నడూ వెనకడుగెయ్యడానికి ప్రయత్నించకు.
మెట్లమీదే చతికిలబడిపోకు
ముందుకి సాగడం కష్టంగా కనిపిస్తోందని.
నాన్నా! క్రుంగిపోవద్దు.
నేను ఇంకా ఎక్కుతూనే ఉన్నానురా తండ్రీ,
నేనింకా ఎక్కుతూనే ఉన్నాను.
నా జీవితం ఏమీ
బంగారు మెట్లెక్కినంత సాఫీగా గడిచిపోవడంలేదు.
.

Leave a reply to జ్యోతిర్మయి స్పందనను రద్దుచేయి