వస్తానని రాలేదు … థామస్ హార్డీ

broken appointment
broken appointment (Photo credit: Jon Erickson)

.

నువ్వు వస్తానని రాలేదు

కాలం నిర్లిప్తంగా పరిగెత్తుకుంటూ పోయింది.

నన్ను మొద్దుబారిపోయేలా చేస్తూ.

అయినా, నువ్వు నా ఎదురుగా లేకపోవడంకంటే కూడ

ఎక్కువగా బాధించింది… నీ వ్యక్తిత్వంలో

మన విముఖతని సైతం త్రోసిరాజనగల

ఉదాత్తమైన కనికరభావన కనిపించకపోవడం.

ఆశల చిట్టచివరి ఘడియ గడిచిపోయి,

నువ్వురాకపోయిన తర్వాత నేనొంతో దుఃఖించాను.

.

నువ్వు నన్ను ప్రేమించటం లేదు.

ప్రేమ ఒక్కటే మనిషిపై విశ్వాసాన్ని కలుగజేస్తుంది.

నాకు నువ్వు ప్రేమించడం లేదనీ తెలుసు

నువ్వు రావనీ తెలుసు.

కానీ, దైవకార్యాలన్న పేరుపెట్టి పిలవకపోయినా,

మనిషి చేసే తత్సమానమైన ఆనేక పనులఖజానాలోకి,

ఒక స్త్రీ,  తను ప్రేమించకపోయినా,

కాలం చించిపోగులు పెట్టిన మగవాడికి

ఊరటకల్పించడానికి అతనితో ఒక గంటో, ఘడియో

గడపడాన్నికూడ చేర్చడం సబబుగా ఉండదూ?

.

Thomas Hardy
Thomas Hardy (Photo credit: Wikipedia)

థామస్ హార్డీ

(జూన్ 2, 1840 – 11 జనవరి 1928)

ఇంగ్లీషు కవీ, నవలాకారుడూ.

.

A Broken Appointment

.

You did not come,
And marching Time drew on, and wore me numb.
Yet less for loss of your dear presence there
Than that I thus found lacking in your make
That high compassion which can overbear
Reluctance for pure loving kindness’ sake
Grieved I, when, as the hope-hour stroked its sum,
You did not come.

You love not me,
And love alone can lend you loyalty;
-I know and knew it. But, unto the store
Of human deeds divine in all but name,
Was it not worth a little hour or more
To add yet this: Once you, a woman, came
To soothe a time-torn man; even though it be
You love not me.
.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

An English Novelist and Poet

“వస్తానని రాలేదు … థామస్ హార్డీ” కి 3 స్పందనలు

  1. ఆత్మీయులు ప్రేమగా పిలిచినా అనేక అవసర సందర్భాలలో వెళ్ళక (వెళ్ళలేక) పోవటం జరిగింది.
    ప్రేమ లేక కాదు, పరమ ప్రేమ ఉండబట్టే వెళ్ళలేక పోయాను గతం లో…
    మీరు మరీ సర్,
    అమ్మో అమ్మో ఇట్లాంటి heart touching వి రాసేసి మా గత జ్ఞాపకాల వలయాలనే చిక్కుల్లో మమ్ము పడవేయకుడీ!
    according to indian philosophy ఇదిగో ఇట్లాంటి జ్ఞాపకాలే పునర్జన్మకు హేతువౌతాయి..

    Any way

    ప్రేమ ఒక్కటే మనిషిపై విశ్వాసాన్ని కలుగజేస్తుంది

    Nice statement

    🙂

    ?!

    మెచ్చుకోండి

  2. శివగారూ,
    మీ వ్యాఖ్యకి కృతజ్ఞతలు. మనం మాట తప్పిన సందర్భాలనేకం ఉండొచ్చు కానీ, కొన్ని సందర్భాలలో మాట తప్పకూడదు. ఇక్కడ కవి ఒక ముఖ్య విషయం ప్రస్తావిస్తున్నాడు. ఒక వ్యక్తి తనవ్యధలోంచి బయటపడలేని అసహాయస్థితిలో, ఉన్న ఒకే ఒక ఆలంబనగా మనల్ని పిలిచినపుడు. మనకి ఆ వ్యక్తిమీద ఇష్టం ఉన్నా లేకపోయినా, అతనికి మనమీద ఆశలు ఉన్నందుకైనా మానవీయ దృక్పథంతో మాట నిలబెట్టుకోవాలి. అతను మనకి ఏమీ కాకపోవచ్చు కాని, అతనికి మనం చాలా అయిఉండవచ్చు. లేకపోతే, ఒక మనిషి తనకష్టాలనూ, ఆత్మీయవిషయాలనూ పంచుకుందికీ, తన బాధ మనతో వెళ్ళగక్కుకుందుకీ, ప్రపంచంలో ఇంతమంది ఉండగా, మనల్నే ఎందుకు కోరుకుంటాడు. కనుక, మన స్వంత లాభాలని విడిచిపెట్టి అయినా వెళ్ళాలి. దేముడిగుడికి వెళ్ళడం కన్నా నా దృష్టిలో ఇది ముఖ్యమైనది. మనం అతని సమస్యలకు సమాధానం ఇవ్వలేకపోవచ్చు(అసలు వాటికి సమాధానాలే లేకపోవచ్చు. ఆ విషయం అతనికి కూడా తెలిసి ఉండవచ్చు.). ఏ రకమైన సహాయమూ అందించలేకపోవచ్చు. మనం ఇవ్వగలిగిన అమూల్యమైన ధనం మన కాలం. ఓపికగా అతను చెప్పినది వినడానికి మన సానుభూతి. ఒక ఆత్మీయమైన వచనం, ఎంత బూటకమైనదైనా సరే, నటనైనా సరే, బాధలో ఉన్నవాడికి ‘ప్లాసిబో’ లా పనిచేస్తుంది. మనం కూడా కొన్ని సందర్భాలలో అటువంటి చేయూతకోసమే అల్లల్లాడిపోయేమన్న విషయం గుర్తుంచుకుంటే మనం అవతలివాడి అవసరాన్ని గ్రహించగలుగుతాం.
    అభివాదములతో

    మెచ్చుకోండి

Leave a reply to శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి — బాలల రచయిత్రి స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.