.
నాకో వ్యక్తి బాగా ముఖం పరిచయం,
లోపాలేమీ కనిపించని వాడు.
ఏడాదవుతుందో, లేదా కొంచెం ఎక్కువో
రోజూ మా ఇంటి పక్కనుండే వెళుతుండేవాడు.
అయితే అతనితో నే నెన్నెడూ మాటాడ లేదు.
.
ఓ సారి ఎందుకో
మూడు మైళ్ళ దూరం వెళ్ళడం తటస్థించింది.
అక్కడ అతను ఓ వీధిలో తారసపడ్డాడు. చేతికర్రతో సహా.
అతన్ని నేనూ నన్ను అతనూ
ఎగాదిగా చూసుకున్నాం చాలసేపు.
.
తర్వాత ఏదో దూరపుటూర్లో కనిపించాడు.
అతని ముఖం చూడగానే
అసంకల్పితంగా తలవంచి పలకరించాను.
అతను కూడా ఆశ్చర్యపోతూ,
వెంటనే తలవంచి పలకరించి,
పక్కనించి వెళ్ళిపోయాడు.
.
తర్వాత విదేశంలో కలిసినప్పుడు,
అతని చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను.
చాలా సేపు ఇద్దరం పిచ్చాపాటీ మాటాడుకున్నాం.
ఏదో వెయ్యేళ్ళబట్టి పరిచయం ఉన్నవాళ్ళలా.
.
ఇటీవల,
ఇద్దరం వనభోజనానికి వెళ్ళినప్పుడు,
అతను తెచ్చినది నేను తిన్నాను.
అతను పడిన కష్టాలు అతనూ,
నా దేశదిమ్మరి బాధలు నేనూ కలబోసుకున్నాం.
ఇద్దరం ఒకరికొకరు ప్రాణస్నేహితులమయిపోయాం.
.
నా కేమని అనిపిస్తుందంటే,
గొప్పా, బీదా తేడా లేకుండా
ఈ భూమ్మీద పుట్టిన ప్రతివారికీ
చిన్నతనంలోనో పెద్దయ్యాకో ఏదో ఒక రోజు
అపరిచితులో, శత్రువులో ఇలానే తెలుస్తారు.
.
Leave a reply to ఎందుకో ‽ ఏమో స్పందనను రద్దుచేయి