ఆత్మవిశ్వాసం… లేయాన్ ఫెలిపె, స్పానిష్ కవి

(ఆధునిక స్పానిష్ సాహిత్యం లో ఒక ప్రముఖ కవిగా గుర్తింపు పొందిన  ఫెలిపె, ఫార్మసీ చదివి, తండ్రి ఆనందం కోసం కొంతకాలం ఫార్మసిస్టుగా పనిచేసినా, సాహిత్యం పట్ల ఉన్న వ్యామోహం కొద్దీ, సంచార  నాటకబృందంలో జేరితే,  బాధ్యతా రహితంగా ప్రవర్తించి వ్యాపారం నష్టపరచినందుకు రెండేళ్ళు కారాగార శిక్ష అనుభవించేడు. 1936-39 మధ్య స్పానిష్ సివిల్ వార్ లో రిపబ్లికనుల తరపున పోరాడేడు. 1938 లో స్వయంగా దేశం వదిలి మెక్సికోలో జీవితాంతం ప్రవాసజీవితం గడిపేడు. చే గెవాడా ని 1967లో  CBI బొలీవియాలోని ఒక మారుమూల పల్లెలో కాల్చి చంపిన తర్వాత, అతని దగ్గర దొరికిన వస్తువుల్లో, అంచులు బాగా నలిగిన నోట్సుపుస్తకం దొరికింది. అందులో పావ్లో నెరూడా (చిలీ), నికొలాస్ గిగేన్ (క్యూబా), సిజార్ వలేహో (పెరు),  లేయాన్  ఫెలీపె(స్పెయిన్)ల 69 కవితలు ‘చే’ స్వదస్తూరీతో వ్రాసినవి ఉన్నాయి.

ఈ కవితలో మనిషి ప్రకృతితో మమేకమవకుండా, విశ్వరాగానికి అనుగుణంగా ప్రవర్తించకుండా, తనదైన శైలిలో బుధ్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడో సూచిస్తున్నాడు. చివరలో రోట్టెలు కాల్చేవాడి ప్రస్తావనలో, మనిషిని మనిషిగా గుర్తించకపోతే, ఒక బిచ్చగాడిని మనం కసురుకుని, న్యూనతాభావంతో చూస్తే, తను బిచ్చగాడినని అతను అనుకునేలా మనం ప్రవర్తిస్తే  ఆ మనిషికి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని చెప్పినట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. కోటు lapel మీద గులాబీ ఆత్మ విశ్వాసానికి సంకేతంగా నేను భావిస్తున్నాను. )

.

మనిషి ఊరికే బండచాకిరీ చెయ్యడం తప్ప తెలివితేటలు లేని పిల్లాడు

హుషారుగా గడపవలసిన రోజుని, చెమటలుకారేలా చేశాడు.

డోలు వాయించవలసిన కర్రని బొరిగ గా మార్చేడు

భూమి మీద ఆనంద తాండవం చేసేలా వాయించడానికి బదులు

దానితో తవ్వడం ప్రారంభించేడు

మనకే గనక నక్షత్రాల అభినందనలకి ప్రతిరోజునీ

ఒక కవిసమయంగా మార్చి ఠీవిగా నడవగల సమర్థత ఉంటేనా!

నా ఉద్దేశ్యం, ఎవరికీ సూర్యుడి లయకి అనుగుణంగా

పొలం దున్నగల చాకచక్యం లేదనీ,

ప్రేమతో, చాకచక్యంతో  ఎవరూ పంటను కోయలేదనీ.

ఈ రొట్టెకాల్చే వాడు,  ఉదాహరణకి, ఈ రొట్టెకాల్చే వాడు,

ఆ ఆకలిగొన్న బిచ్చగాడికి మనిషినన్న ఆత్మవిశ్వాసం ఎందుకు నింపడు?

.

Image Courtesy: http://t0.gstatic.com

లేయాన్ ఫెలిపె

స్పానిష్ కవి

ఏప్రిల్ 11, 1884 – సెప్టెంబర్ 17, 1968.

.

A Rose of Flour

.

But man is a laborious and stupid child
who has made out of the game a sweaty (working) day.

He has turned the drum stick to a hoe,
and instead of playing on earth a song of joy
has been digging her.
If we only knew walking to the applause of the stars
and making a poetic symbol of every day!
I mean nobody knows digging in the rhythm of the sun
and nobody had yet cut off an ear with love and grace.

This baker, for example, why this baker
does not put a rose of white bread
on the lapel of that hungry beggar?

León Felipe

(11 April 1884 – 17 September 1968)

Spanish Poet

( I interpret the ‘Rose on The Lapel’ as a symbol of self-confidence.  If we don’t treat a beggar as a fellow human being, but make him feel he is a beggar, his confidence in himself shall be dented. The poet criticises how man is not in sync with universal harmony, but laboriously drags his feet in pursuit of his own.  Six of Felipe’s poems were found in the dog-eared note-book CBI seized from the person Che Guevara after assassinating him in a remote village in Bolivia.)

The Rose of Flour

“ఆత్మవిశ్వాసం… లేయాన్ ఫెలిపె, స్పానిష్ కవి” కి 6 స్పందనలు

  1. మనిషిని మనిషిగా చూడలేని నిహిత స్వార్ధం

    మెచ్చుకోండి

    1. Sarmagaru,

      The “I” is the root cause of all ills. So long as Two I’s meet and unite to become U, life will be like that.
      with best regards

      మెచ్చుకోండి

  2. To make a rose shaped bread and put it in the lapel of the beggar…I see it as returning him his dignity even while giving him charity…not throwing some piece of food in his bowl and making him feel small…making him feel an equal…that is how I read it.

    మెచ్చుకోండి

  3. Precisely Shernaz.

    Somehow, when we help others in need, the consciousness that we are doing some good job at the moment of action shall not leave us. Even the tone and tenor at the point of action reflects that. The poet subscribes to natural living… eat what nature blesses you… make life a pleasure instead of making living an endeavour, a life long toil.

    with best regards

    మెచ్చుకోండి

  4. కవితకి అర్థాలు వెదికి తీయడం బావుంటుంది ఎపుడూను. నిగూఢమైనవైతే ఇంకాను. మీతో వ్యతిరేకించటం కాదు కానీ నా అన్వయింపు ఇది. ‘A Rose of Flour’ అన్న శీర్షిక, ‘a rose of white bread on the lapel’ అన్న ప్రయోగం చాలాసేపే ఆలోచించేలా చేసాయి. lapel మీదన పెట్టే పిన్స్, బాడ్జెస్ కొన్నిసార్లు అలంకారప్రాయమైనా, ఎక్కువగా ఒక సంస్థ ప్రతినిధులు వాడేవీ (ప్రతిష్ట చిహ్నాలుగా) , లేదూ, ఆయా వ్యక్తుల గౌరవార్థం తొడగబడేవి కనుకా – ఎత్తుగడలోనే ప్రాకృతికపరమైన మనిషి కురచతనం వ్యక్తీకరించటం వలన, రొట్టెకాల్చే వాడు ఆకొని ఉన్న ఆ అన్నార్తునికి సాదరంగా/గౌరవంగా ఇవ్వటంలోనే దానికి అందం అని తెలుసుకోలేకపోయాడు. ఆత్మవిశ్వాసం కన్నా గాలి, భూమి, సూర్యచంద్రాదుల సౌందర్యం ఇనుమడించేలా మనిషికి ఎలా ఇవ్వబడుతున్నాయో, ఆ రొట్టెకీ బిచ్చగాడు ప్రతినిధిగా నిలవటం సహజమని కవి మనోభావమేమో! అసలు బ్రెడ్ ని “పిండితో చేసిన గులాబీ పువ్వుగా” అభివర్ణించటంలోనే కవి మనసు సుందరంగా వెలికి వచ్చింది.

    మెచ్చుకోండి

  5. ఉషారాణిగారూ,
    నా దృష్టిలో, కవి హృదయాన్ని ఆవిష్కరించే సందర్భంలో, అభిప్రాయభేదం ఎప్పుడూ ఆహ్వానించదగ్గదీ, హర్షించదగ్గదీ. ఎందుకంటే, అవన్నీ కలిపి సత్యానికి మనల్ని దగ్గరగా తీసుకెళ్తాయి. “బ్రెడ్ ని “పిండితో చేసిన గులాబీ పువ్వుగా” అభివర్ణించటంలోనే కవి మనసు సుందరంగా వెలికి వచ్చింది” అని మీరన్న మాటతో ఏకీభవిస్తున్నాను. మొదటిపాదాల్లో ప్రకృతి ఇవ్వడం గురించి ఉంది గాబట్టి, దాని మీద stress ఉందని నేను భావించాను. ఇక్కడ నేను రాసినఆత్మవిశ్వాసం కంటే, shernaz Wadia చెప్పిన అన్నార్తుడికి కల్పించవలసిన ఆత్మగౌరవానికి (Personal Dignity) దగ్గరగా వస్తుందేమో ననుకుంటున్నాను. ప్రకృతికి ప్రతినిధిగా నిలబడవలసి వస్తే, రొట్టెలుచేసేవాడు ప్రతినిధిగా నిలబడడానికి అర్హుడౌతాడు… బిచ్చగాడికంటే. మీరు చెప్పినట్టుగా A Rose of Flour, A Rose of White Bread on the lapel దీన్ని ఎలా అన్వయించాలో నన్ను రెండు రోజులు చాలా వేధించాయి. దానికి ఏదైనా ప్రత్యేకమైన ప్రయోగం ఉందేమో నని చాలా చోట్ల వెతికేను. అయితే, అలాంటి ప్రయోగం దొరకలేదు కాని, నెట్లో చాలాకాలం క్రిందట మూలం తెలియకుండా సర్క్యులేట్ అయిన The Rose Lapel అన్న అద్భుతమైన చిన్న కథ దొరికింది. అది ఈ రోజు ఉంచుతున్నా. ఇలాంటి వ్యాఖ్యలు మన సాహిత్య అవగాహనని పెంచుతాయని నా విశ్వాసం.
    అభివాదములతో,

    మెచ్చుకోండి

Leave a reply to Shernaz స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.