
(నిరలంకారంగా కనిపిస్తున్న ఈ మాటల వెనక, కవి పేదరికాన్నీ, దుర్భరమైపోయిన జీవితాన్నీ, స్వేఛ్ఛాప్రియత్వాన్నీ, జీవించగల అదృష్టాన్నీ ఎంత గాఢంగా, నిగూఢంగా చెప్పాడో గమనించండి. “కారు బయట” అన్న మాట, కారులో కూర్చోవాలంటే ఖర్చు అని పరోక్షంగా సూచించడానికీ, దుకాణాల కిటికీలు విండో షాపింగ్ కీ, ఇందులో పేర్కొన్న ప్రకృతి ప్రసాదించే వనరులుతప్ప ప్రతీదీ ఖరీదైనదే అని సూచిస్తూ, వ్యంగ్యంగా చెప్పాడు.)
.
మనం స్వేఛ్చగా బ్రతికేస్తున్నాం.
గాలి ఉచితం, మేఘాలు ఉచితం,
ఈ కొండలూ, లోయలూ ఉచితమే.
వర్షం ఉచితం, మట్టి ఉచితం.
కార్ల బయట అంతా ఉచితం,
సినిమా హాళ్ళ బయట జాగా ఉచితం,
దుకాణాల కిటికీలు ఉచితం.
రొట్టే, వెన్నా అలా కాదే.
కాని మళ్ళీ ఉప్పునీరు ఉచితం.
స్వాతంత్ర్యం కావాలంటే
నీ జీవితాన్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది
కాని, బానిసత్వం ఉచితం…
ఎక్కడో అక్కడ… కావాలనుకున్నవాడికి
మనం ఖరీదు చెల్లించక్కరలేకుండా బ్రతికేస్తున్నాం,
ఉచితంగా.

Leave a reply to ఎందుకో ‽ ఏమో స్పందనను రద్దుచేయి