(ఈ కవితలో అద్భుతమైన వ్యంగ్యంతో కూడిన మేల్కొలుపు ఉంది. మనకి కష్టాలు రాకముందే, ఏదో వస్తుందని ముందే ఊహించుకుని ఆ వరదలో కొట్టుకుపోతుంటాం. మన ఆలోచనలలోనే బందీలం అయిపోతాం. ఆట ఓడిపోతామనే భయంతో ఆడకముందే ఓడిపోతాం. విజయాన్ని సంపాదించకముందే, విజయాన్ని ఊహించుకుని ఆ మత్తులో తేలుతుంటాం. మన గతస్మృతులు అనే రణరంగంలో ఎప్పుడో వధించబడ్డవాళ్ళమి. మనకి ప్రతిక్షణం పునర్జన్మ ప్రసాదిస్తున్నా, ఇంకా గతంలోనే బ్రతకడానికి, మంచైనా చెడైనా, వెంపర్లాడుతుంటాం. మనకి సత్యానికీ (ఈ క్షణం), మిధ్య లేదా ఊహకీ (గతమూ/ భవిష్యత్తూ)మధ్య లేడా తెలీదు. మనం ఈ క్షణంలో చైతన్యంతో ఉంటే మరుక్షణంలో నిరాశానిస్పృహలతో అస్తిత్వం కోల్పోతుంటాం.)
.
నేను
ఇంకా ముంచెత్తని వరదలో
కొట్టుకుపోతున్నాను
నేను
ఇంకా కట్టని బందిఖానాలో
బందీనై ఉన్నాను
నేను
భవిషత్తులో ఆడబోయే
చదరంగం ఆటలో ఓడిపోయాను
నేను
ఇంకా రుచిచూడని నీ మదిరలో
మత్తెక్కి ఉన్నాను
నేను
ఎప్పుడో జరిగిన యుధ్ధంలో
రణరంగంలో వధించబడ్డాను
నాకు
నిజానికీ, ఆలోచనకీ మధ్య
తేడా తెలియదు.
నీడలా
నేను ఉన్నాను
లేను.
రూమీ.
.
I AM AND AM NOT
Leave a reply to ఎందుకో ‽ ఏమో స్పందనను రద్దుచేయి