గొల్లపదం … జాన్ బన్యన్

[జాన్ బన్యన్ ఒక అతిపేద కుటుంబం నుండి వచ్చి (అతని తండ్రి పాత్రలకు మాట్లు వేస్తూ బతికేవాడట. తనుకూడ అదేవృత్తికొంతకాలం కొనసాగించేడు). అతని  సవతితల్లి పోరు భరించలేక 16వ ఏట ఇల్లు వదలి వెళ్ళిపోయి అన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై, తన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకున్నా, తను పెళ్ళిచేసుకున్న ఒక అనాధ స్త్రీ తండ్రి ఆమెకు వారసత్వంగా ఇచ్చిన రెండే రెండు పుస్తకాలు Plain Man’s Pathway to Heaven by  Arthur Dent; Practice of Piety by Lewis Bayly… అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసాయి.  మనిషి  ఎంతచెడ్డవాడైనా, ఏ ఒక్క రోజైనా  తనని తాను ఆత్మపరీక్షచేసుకుని జీవితాన్ని సరిదిద్దుకుందామనుకుంటే, ఆరోజు నుండీ అతనికి తిరుగు ఉండదు అని జాన్ బన్యన్ తన జీవితం ద్వారా నిరూపించేడు. ప్రొటెస్టెంటుగా అతనికి ఉపన్యాసాలిచ్చే తగిన అనుమతి / అధికారం లేనందుకు జైలు శిక్షవిధించినా, అక్కడే ఖైదీలకి బోధిస్తూ గడపడమేగాక, బహుశ అతని “Pilgrim’s Progress” కావ్యానికి బీజం అక్కడే పడి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఆంగ్ల సాహిత్యంలో అద్భుతమైన పదవిన్యాసంతో వ్రాయబడిన కావ్యం అది. అవడానికి అది క్రైస్తవ మత గ్రంధమైనా, నమ్మకమున్న ఇతర మతాలకుకూడా వర్తిస్తుంది. అందులో  బన్యన్ జీవుడి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎన్ని అడ్డంకులు వస్తాయో, వాటిని నమ్మకం ద్వారా ఎట్లా ఎదుర్కోవచ్చునో చూపించే ప్రయత్నం చేసేడు.]

.

నేలమీదనుండేవాడికెన్నడూ పడిపోతాననిగానీ,
ఒదిగి ఉండేవాడికి గర్వం వల్లగానీ భయం ఉండదు.
వినయంగా ఉండేవాడికి భగవంతుడు
ఎప్పుడూతోడుగా ఉండి నడిపిస్తాడు

అది ఎక్కువా తక్కువా అన్న చింతలేకుండా,
నాకు ఉన్నదానితో సంతృప్తి ఉంది.
హే భగవాన్! నేను ఎల్లప్పుడూ సంతృప్తినే కోరుకుంటున్నాను,
ఎందుకంటే అలాంటి వాళ్ళని నువ్వెప్పుడూ రక్షిస్తావు గనుక

ఈ పల్లవికి పరిపూర్ణత
ఈ చింతనతో జీవనయాత్ర కొనసాగించినప్పుడే.
ఇహంలో కొంచెమనిపించినా, పరంలో పరమసుఖందొరుకుతుంది.
ఇది వయసుతో నిమిత్తం లేకుండా సర్వకాలాలకూ వర్తిస్తుంది.

.

(Pilgrim’s Progress కావ్యం నుండి)

జాన్ బన్యన్ 

.

[ఈ పద్యాన్ని బమ్మెర పోతనగారి భాగవతం అష్టమస్కందం వామనావతార ఘట్టంలోని ఈ పద్యపాదాలతో సరిపోల్చి చూడండి.
“సంతుష్టుడీ మూడుజగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము,
సంతోషిగాకుంట సంసారహేతువు, సంతసంబున ముక్తి సతియు దొరకు”]

.

The Shepherd Boy sings in the Valley of Humiliation.

.

He that is down needs fear no fall,
He that is low no pride;
He that is humble ever shall
Have God to be his guide. 

I am content with what I have,
Little be it or much;
And, Lord, contentment still I crave
Because Thou savest such.

Fulness to such a burden is
That go in pilgrimage;
Here little and hereafter bliss
Is best from age to age…

.

(From Pilgrim’s Progress)

John Bunyan

(28 November 1628 – 31 August 1688)

“గొల్లపదం … జాన్ బన్యన్” కి 13 స్పందనలు

  1. I spent sometime in Bedford in 2007 and saw the statue of John Bunyan and heard abt him for the first time. Its heartening to read your comparision of his poetry with Bammera Potana. Lovely. Thanks sir.

    మెచ్చుకోండి

    1. sujata garu,

      Thank you for your visit and comments. Hailing from such modest means, perhaps even less than modest, if Bunyan could acquire such literary flair as to contemplate a work like Pilgrim’s Progress, that in itself is a great achievemnet by any standards. Perhaps language aligns itself when you have the ideas coming out, rather pouring out so effusively as in the case of our Bammera Potana. They are poets born with a blessing. Many of the lines from Pilgrim’s Progress have become idioms.

      with very best regards

      మెచ్చుకోండి

  2. ఎంత గొప్ప తాత్వికతను ఎంత అలతి అలతి పదాల్లో చెప్పాడండీ కవి. మీ అనువాదం హాయిగా ఉంది.

    మెచ్చుకోండి

  3. ఫణీంద్రగారూ,
    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఎక్కడోచదివాను. సత్యం ఎప్పుడూ సరళంగానే ఉంటుంది. మనం ఉపయోగించే మాటలే దాన్ని జటిలం చేస్తాయి. ఒకోసారి భావాన్ని కవీత్వీకరించడం లో కవులు పదబంధాల మోజు లేదా mazeలో దాన్ని కప్పెస్తారు. అందుకే సామాన్యపాఠకుడికి అది చిక్కకుండా పోతుంది.
    అభివాదములతో,

    మెచ్చుకోండి

  4. వస్తువేదయినా బంగారం ఒకటే కదా! గొప్ప వాళ్ళంతా ఒక లాగే ఆలోచిస్తారట. మంచి కవిత సరళ అనువాదం.

    మెచ్చుకోండి

    1. Dear Sarmagaru,

      This is your 100th Comment on my blog. i am so obliged to you for your blessings and continued interest you have shown in my blog through out.
      with very best regards,

      మెచ్చుకోండి

      1. Really interesting. Thank u

        మెచ్చుకోండి

  5. కలకాలం గుర్తుండిపోయే కవిత..మీ అనువాదం చాలా బావుంది. పోతానామాత్యుని పద్యంతో పోల్చడం ఇంకా బావుంది.

    మెచ్చుకోండి

  6. అమ్మా జ్యోతిర్మయీ,
    పోతనగారికీ, జాన్ బన్యన్ కీ మధ్య సుమారు రెండువందల సం వత్సరాల అంతరం ఉంది. కానీ, చిత్రంగా, దేశాలు మారినా, కాలాలు మారినా, నమ్మకాలలో తేడాలున్నా, మనిషి మనుగడలో సంతృప్తి యొక్క ఆవశ్యకత విషయం లో ఎక్కడా తేడా లేకపోవడం దాని గొప్పదనాన్ని నిరూపిస్తుంది. ఇంత చిన్నపాటి సత్యాన్ని గ్రహించి హాయిగా జీవించలేకే, అమాత్యుల ఆడుగులకు మడుగులొత్తి, విద్యుక్త ధర్మాన్ని త్యజించి, తమవిద్యకి న్యాయం చెయ్యక అవమానాలు పాలవడం.
    ఆశీస్సులతో

    మెచ్చుకోండి

  7. దేహాంతే తవ సాయుజ్యం = ability to reach your abode after leaving the body అన్న పదం అప్రయత్నంగా గుర్తుకొచ్చింది. సంతృప్తి చాలా పెద్ద ఆశయం, దాన్ని సాధించటానికి ఎందరం కృషి చేస్తున్నామో గాని. ఇక, ఇది ప్రదర్శనాభిలాషగా అనిపిస్తుందని వెరపు ఉన్నా – నావే ఒకానొక పర్వ దినాన రాసుకున్నవి.

    విషయవాసన సంహరించు
    మితభాషణమే నాకు భూషణం
    అనురాగపుజల్లులు కురిపించు
    అదే నాకు కనకధార
    చెరగని చిరునగవు వరమివ్వు
    అదే నాకు ఆభరణం
    సంకల్పసిద్దికి నాలో నెలవుండు
    మోక్షమార్గాన నీవే నాకు తోడు

    * మీ అనువాదాలన్నీ చదువుతున్నానండి. కాస్త సమయాభావం, కానీ ప్రతి సాయంత్రం ఒక 10ని. మీ బ్లాగులో గడపటం చాలా సంతృప్తినిస్తుంది.

    మెచ్చుకోండి

  8. ఉషారాణిగారూ,
    “ప్రదర్శనాభిలాష అనిపిస్తుందని వెరపు ఉన్నా” అన్నారు. మీరు అలాంటి వెరపు పెట్టుకోవద్దు. కనీసం నా బ్లాగు విషయం లో. అభిప్రాయాలు కలబోసుకుందికి దాన్ని మించిన సాధనం మరొకటిలేదు.
    ఇక మీరు రాసిన ఆత్మనివేదనకొస్తే, ఎవరో చెప్పినట్టు భగవంతుడుదగ్గరకి మనం mendicant గా వెళ్ళకూడదు. మనకిచ్చినదానితో సంతృప్తిచెందితేనేఇహం లో ఆత్మశాంతి. మనం జీవించినదే సత్యం మిగతాదంతా మిధ్యే. సంకల్పసిద్దికి నాలో నెలవుండు అన్నారే….అదే మన guiding spirit కావాలి. మనచుట్టూ ఉన్నవాతావరణం అప్పుడప్పుడు మనం నడుస్తున్న మార్గం సరియైనది కాదేమో అనే శంకను కలుగజేస్తుంది. ఒకోసారి అదిశృతిమించితే తీవ్రమనోవేదనకు గురిచేస్తుంది. సరిగ్గా అలాంటప్పుడే… ఈ మాటలు…సంకల్పసిద్దికి నాలో నెలవుండు… అని పునశ్చరణ చేసుకోవాలి. మితభాషణం, స్వార్థం లేని అనురాగం, చెరగని చిరునవ్వు కి మించి జీవితంలో కావలసిన వరాలు ఇంకేమిటుంటాయి?
    అభివాదములతో

    మెచ్చుకోండి

  9. “సత్యం ఎప్పుడూ సరళంగానే ఉంటుంది. మనం ఉపయోగించే మాటలే దాన్ని జటిలం చేస్తాయి. ఒకోసారి భావాన్ని కవీత్వీకరించడం లో కవులు పదబంధాల మోజు లేదా mazeలో దాన్ని కప్పెస్తారు. అందుకే సామాన్యపాఠకుడికి అది చిక్కకుండా పోతుంది. ”

    సత్యం!

    పోతనార్యునితో పోలిక చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందరో మహానుభావులు!

    మెచ్చుకోండి

  10. కొత్తావకాయగారూ,
    ఇది చదవగానే నాకూ ఆశ్చర్యమేసింది. పోతనగారి భావాలు యధాతథంగా ఉన్నాయి అతని రచనలో. గొప్పవాళ్ళు ఎప్పుడూ ఒక్కలా ఆలోచిస్తారన్న మాట ఉట్టినే పుట్టలేదు.
    అభివాదములతో

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.