స్త్రీ స్వభావము … డొరతీ పార్కర్

.

నేను ఇటలీలో ఉన్నంతసేపూ

నా మనసెందుకు ఇంటిమీదకి పోతుంది,

అదే నా స్వంతగడ్డమీద ఉన్నప్పుడు,

ఇటలీ చూడాలని ఎందుకు మనసు పరితపిస్తుంది?

.

స్వామీ! ప్రియతమా! నువ్వెదురుగా ఉన్నంతసేపూ

చిత్రంగా, నన్ను ఎక్కడలేని నిరుత్సాహమూ ఆవహించి, అదే

నువ్వు లేచి కనుమరుగవగానే, మనసు నీ కోసం,

నువ్వు వెనక్కి రావాలని తహతహలాడుతుందెందుకు?

డొరతీ పార్కర్

.

On Being A Woman

.

Why is it, when I am in Rome,
I’d give an eye to be at home,
But when on native earth I be,
My soul is sick for Italy?

And why with you, my love, my lord,
Am I spectacularly bored,
Yet do you up and leave me- then
I scream to have you back again?

.

Dorothy Parker

(August 22, 1893 – June 7, 1967)

American Poet, Critic, Short Story Writer and Satirist.

“స్త్రీ స్వభావము … డొరతీ పార్కర్” కి 9 స్పందనలు

  1. హహ్హహ్హా.. భలే ఉందిగా కవిత.. 😀
    నాకు నిజమే అనిపిస్తోంది. ఎందుకలా అని అడక్కండి.. నాకూ సమాధానం తెలీదు.. 😛

    మెచ్చుకోండి

    1. అమ్మా మధురవాణీ,
      ఒక వైయక్తిక అనుభవాన్ని కవిత్వీకరించడమంటే, అందులోని సార్వజనీనతని బయటకి తేగలగడమే. అది చదవగానే, అరే నాకూ అలానే అనిపిస్తుంది అనుకోగలిగితే, ఆ ప్రయత్నం సార్థకమైనట్టే.
      ఆశీస్సులతో

      మెచ్చుకోండి

    1. Sarmagaru,

      It is so true. Perhaps, the difference lies in the intensity with which people crave for the change.

      with best regards

      మెచ్చుకోండి

  2. ఇంకా “మీ అనువాదం బాగుంది” అనటం – ఆవుపాలు తీయన, తాటిపండు కమ్మనా అని రాగం తీయటమౌతుంది.

    😉 చాన్నాళ్ల క్రితం చదివిన ఒక ఇంటర్వ్యూ, కథ గుర్తుకు వచ్చాయి. మొదటిది షబానా ఆజ్మీ “ప్రపంచంలో ఎక్కడకి వెళ్ళినా మా బొంబాయి (ఇప్పటి ముంబై అనుకోండి) దుమ్ము ధూళీ కోసం ఉవ్విళ్ళూరుతాను. తిరిగి వచ్చాక ఇక్కడ ఇరుకు, తొక్కిడితో ఉక్కిరిబిక్కిరి అవుతాను.” అనటం. (చాలా దగ్గర్గా చప్పాననే అనుకుంటున్నాను ఆమె మాటలు)

    రెండవది – హైదరాబాదు అత్తారింటి నుంచి గౌతమి (ఈ రైలు రెండు వైపులకి ఉదయాన చేరుతుంది) లో కన్నారింటికి వెళ్ళిన ఒక కొత్తగా పెళ్ళైన యువతి, రైలు పక్కన రోడ్డు మీద అరటి గెలల సైకిళ్ళు, పాల కావిళ్ళు చూసి సంబరపడ్డం, తన ఊరికి చేరువగా ఉన్నానని ఆనందపడ్డం, తిరిగి వస్తూ సికిందరాబాదు సమీపాన కిళ్ళీ వాసనలు, టీ ఘుమ ఘుమలు పీలుస్తూ, తన నెలవుకి చేరానని, తన మనిషిని చూస్తానని మురవటం ఆ కథ సారాంశం.

    మెచ్చుకోండి

  3. ఉషారాణి గారూ,
    అసలు సృష్టే Dynamism లోంచి వచ్చింది. ఏదీ ఎక్కడ స్థిరంగా నిలకడగా ఉండదు. స్థితిస్థాపకతే గాని ఎక్కడా స్థిరత్వం ఉండదు (బహుశా మనకి అందుకే rest కంటే restlessness ఎక్కువ). మనవాళ్ళు భ్రాంతి అన్న మాట వాడేరు. మరి ఎక్కడనుండి ఆ Concept సంగ్రహించేడో గాని మహానుభావుడు ఐన్ స్టైన్, కాలాన్ని కూడా ఒక Dimension చెయ్యగలిగేడు. ఆ మార్పుని కోరే తత్త్వం (ఒక్క చావుకోరుకోవడం మినహా) మనిషి నరనరాల్లో జీర్ణించుకుపోయిందనుకుంటాను. అది ఒక genetic trait. గొప్పకవిత్వం లోని లక్షణం వైయక్తికత లోంచి సార్వజనీనత- సార్వజనీనతలోంచి వైయక్తికత తీసుకురాగలగడం. మీరిచ్చిన రెండు ఉదాహరణలూ చక్కగా సరిపోతాయి.
    అభివాదములతో

    మెచ్చుకోండి

  4. నిజమేనండి – ఆ అస్థిమితపు ఆరాటమే ఇంత మానవ పరిణామానికి ఆధారం కావచ్చు. నిజానికి ఇది/ఈ కవితాంశం ఫీమేల్ ఇన్స్టింక్ట్ అనేకన్నా మనిషి పోకడ అనడం సబబు. ఎప్పుదో రాసుకున్న నా మాట ఇది “అసలు జీవితంలో మన సదుపాయం కొరకు ఏర్పరుచుకున్న [provisional] సత్యాలు తప్పించి, శాశ్వతం [eternal] అన్నది ఏదీ లేదేమోనని నాకు చాలా చాలా సార్లు చాల సందర్భాలలో అనిపిస్తూవుంటుంది..”
    ***
    మళ్ళీ మరొక వ్యాఖ్య ఎందుకని; ‘వాపిరిగొట్టు’ అన్న నా పదప్రయోగం పై మీ స్పందన ఆలస్యంగా చూసాను. దాన్ననుసరించి ఈ మాట – మా ఇంట్లో వాడే చాలా పదాలు ఎక్కువగా వినను బయట. కానీ, ఆయా సందర్భాల్లో నాకవే గుర్తుకు వస్తాయి. ఉదా: మానియాద (బెంగ), ద్యానవారిపోయింది (నోస్టాల్జియా), గోరోజనం (గీర/గర్వం), సుత (ధరలు పెరిగిపోయాయి ఉల్లిపాయ తో సుత) ఇలా.

    మెచ్చుకోండి

  5. ఉషారాణి గారూ,
    “అసలు జీవితంలో మన సదుపాయం కొరకు ఏర్పరుచుకున్న [provisional] సత్యాలు తప్పించి, శాశ్వతం [eternal] అన్నది ఏదీ లేదేమోనని నాకు చాలా చాలా సార్లు చాల సందర్భాలలో అనిపిస్తూవుంటుంది.”
    బాగా చెప్పారు. సృష్టిలో తాత్కాలిక సత్యాలు తప్పించి శాశ్వత సత్యాలు… “ప్రకృతి నిరంతరం మార్పుకిలోనవుతుంటుంది” అన్నది మినహాయిస్తే… ఉండవని నేను నమ్ముతున్నాను.
    ఇక మీరు ఇంట్లోవాడే పదాలవిషయం లోకి వస్తే, ఇవాళ భాష ఎంత పలచబడిపోయిందో అర్థం అవుతుంది. అది చిక్కిపోతున్న కొద్దీ fine shades of meaning కరువైపోతుంది. గీర్వాణం, గోరోజనం అన్న మాటలు పరిచయమే గాని, మానియాద (బెంగ), ద్యానవారిపోయింది (నోస్టాల్జియా), సుత అన్న మాటలు మొదటిసారి వింటున్నాను. ఎంత చక్కగా వాడుకోవచ్చు వాటిని కవిత్వం లో. మంచిమాటలు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    అభివాదములతో

    మెచ్చుకోండి

Leave a reply to kastephale స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.