There wasn’t a day … Naleswaram Sankaram
.
There wasn’t a day without me getting hurt.
And by penning the ultimate word-wound
I don’t intend to rake it further.
When the wound itself begins to voice
Every swoon that lapses down its lips
Accentuates it.
Life is inured to a fiddling tick ticking.
The chappals that bear me
The shirt I don and the pant I enter in,
The food I eat, the water I gut, the air I breathe
And all the rest that help and sustain me
Have all been bubbling with vitality
Are propping up this fruitless bod.
It’s only me that continue to remain
A waxing waste weighing down the earth.
I couldn’t become the crescent of revolution
Nor stream like its philosophical strain .
How long a nameless me should duck under like this?
Languishing in this spineless weakness
I can’t bear subjecting these limbs to hardships myself
.
I wish I were blown to unidentifiable smithereens by some accident;
I wish I were deported severing myself from me;
Surrendering to a wakeless sleep
I wish I were prostrating before my body tabernacle;
I wish this somatic substance gratifies itself
Identifying with clods of earth .
It’s criminal that the system that incites suicides
Itself doesn’t cease.
But how can I help it when
I am stalled from becoming something,
Just like a relic in a museum
I hang on to this system like its futuristic photo,
And I cross myself everyday and watch?
Of what use is this body
When it can’t meld with the wounded and conned
drenching in blood ?
Why should I exist at all
Committing outrage upon myself?
I entreat you, my friend,
Instead of abandoning me
In the lap of this pampering system
Won’t you care to hang this wounded thimble vitae
On some noose of time?
I shall be grateful to you and your time.
I would rather remain a wound
In the history of slave word-wounds I chronicle
Or a refrain of
The wound-composers .
.
Naleswaram Sankaram
Sri Naleswaram Sankaram is working as Telugu Lecturer in Siddipet. He is a prolific writer and an ardent follower of Chalam. But when it comes to publication, “Doodimeda”, from which this selection was taken, was brought out after a long persuasion by his friends and well wishers. His poetry is not as reticent as his person. A man of amiable nature and a sweet temperament. He consciously keeps a low profile.
.
గాయం కాని రోజు లేదు
.
గాయం కాని రోజు లేదు
అంతిమ గాయాక్షరం రాసి మరీ గాయం చేయనూ లేను.
గాయమే నా హృదయమైనప్పుడు
పెదాలమీంచి జారే ప్రతి స్వరం గాయస్వరమై కూర్చుంటుంది.
.
వ్యర్థంగా ప్రాణం కదలాడటం అలవాటైపోయింది
జీవనసాఫల్యంతో నన్ను మోసే చెప్పులూ
వేసుకున్న చొక్కా తొడుక్కున్న ప్యాంటూ
తినే తిండీ తాగే నీరూ పీల్చేగాలీ
నాకోసం సహకరించే ఈ సమస్తం సజీవంగానే బతుకుతున్నాయి
సాఫల్యంలేని నా యీ కాయానికి సహకరిస్తూనే ఉన్నాయి
నేనుమాత్రం నిరుపయోగంగా పెరుగుతున్న నేల బరువుని.
నేనో ఉద్యమ నెలబాలుడ్నైనా కాకపోతి
దాని ధ్యాన ధారగా ప్రవహించకపోతి
ఏమీకానినేను ఎంతకాలమిక్కడ పరుండేది
ఈ నిర్వీర్యపు నిస్సత్తువతో
నా యీ అవయవాల్ని నాకునేను
కష్టాలపాలు చేయడం సహిం చలేను.
.
ఆనవాళ్ళు గుర్తుపట్టలేనంతగానైనా
నాకో ఏక్సిడెంటయి తునాతునకలైపోతే బాగుండు
నాకు నేను ఏమీకానివిధంగా ఎగిరిపోతే బాగుండు
మేల్కోలేని నిదురలోకి ఒదిగిపోయి
నా శరీరానికి ప్రణమిల్లితే బాగుండు
ఆత్మతృప్తితో నా తనువు మట్టితో మమేకమైపోతే బాగుండు
.
ఆత్మాహుతిని ప్రేరేపించే ఈ వ్యవస్థ హననం కాకపోవడమే నేరం!
ఏం చెయ్యనూ? నన్నేమీ కానీకుండా
ఇలానే మ్యూజియంలోని బొమ్మలా
ఈ వ్యవస్థకు వేళ్ళాడే రేపటి భవిష్యత్ పటానికి మల్లే
రోజూ నాకు నేనే అగుపడి
నన్నునేను చూసుకోవడమెందుకు?
గాయాలతో తడిసిముద్దయిపోతున్న
దగాపడినవారిలో ఐక్యంకాని యీ దేహమెందుకు?
నన్ను నేను హింసించుకుంటూ ఈ బ్రతకమెందుకు?
బాబ్బాబు! నన్ను బుజ్జగించే వ్యవస్థ ఒడిలే వదిలేకన్నా
గాయమైన ఈ పిడికెడు ప్రాణాన్నీ
కాలం కొయ్యమీదైనా వేళ్ళాడదీయవా!
నీకూ కాలానికీ ఋణపడిఉంటాను
నేను రాసే బానిసగాయాక్షరాల చరిత్రలో
గాయంగానైనా మిగిలిపోతాను.
గాయాల వాగ్గేయకారులకు గానంగానైనా మిగిలిపోతాను.
.
నాళేశ్వరం శంకరం.
“దూదిమేడ” కవితా సంకలనం నుండి.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి