Charlie Chaplin’s Speech in The Great Dictator

watch the speech here: Charlie Chaplin’s Memorable Speech

నా బ్లాగు మిత్రులకీ సందర్శకులకీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

————————————————————————-

ఈ శుభ సందర్భం లో 1940 ల నాటి ఒక అద్భుతమైన చిత్రంలో మహానటుడు చార్లీ చాప్లిన్ ఇచ్చిన ఉపన్యాసం అనువాదంగా సమర్పిస్తున్నాను.

ఇది 70 సంవత్సరాలు గతించినా ఇప్పటికీ ఒక్క అక్షరం పొల్లుపోకుండా అన్వయిస్తుందంటే, ఒక పక్క రచయిత సునిశితమైన పరిశీలనాశక్తికీ, పదౌచిత్యానికీ సంతోషిస్తూనే, పుడుతూనే స్వతంత్రవాయువులు పీల్చుకున్న నాతరం ఇటువంటి దౌర్భాగ్యస్థితులు రాకుండా ఉండేందుకు సరియైన ప్రయత్నాలు చెయ్యలేదే అని వేరొకపక్క సిగ్గుపడుతున్నాను. 

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని ప్రజాక్షేమానికీ, తమ విధేయతని రాజ్యాంగానికీ కాకుండా,  అధికారయంత్రాంగం రాజకీయనాయకులకు బానిసత్వాన్ని ప్రకటించుకుని, వారితో భాగస్వాములై, ప్రజాసంస్థల్నీ, ప్రజాధనాన్నీ నిర్లజ్జగానూ, నిస్సిగ్గుగానూ దోచుకుంటూ, రెండు వ్యవస్థలూ ప్రజలదృష్టిని ప్రధానసమస్యలనుండి చిల్లరమల్లర విషయాలమీదకి మరలించి పబ్బం గడుపుకుంటుంటే; విద్యార్థులూ, మేధావులూ రకరకాల ఇజాల వాదనల్లో ములిగి, నిజజీవితంలో చెదురుమదురుగా కనిపించే నిజాయితీపరులూ, సాహసాన్ని ప్రదర్శించిన వాళ్ళూ, విలువల్ని పాటించినవాళ్ళూ, ఎన్ని అవాంతరాలొచ్చినా ధైర్యంగాఎదుర్కొని నిలిచినవాళ్ళూ తమ మార్గదర్శులుగా గాక, వెండితెరమీద వెర్రివేషాలువేసేవాళ్ళే ఆరాధ్యదైవాలుగా, అనుకరించవలసిన నమూనాలుగా చేసుకుంటున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి ఎటువంటి దుర్దశ పడుతుందో నేటి భారతీయ సాంఘిక సామాజిక ఆర్థిక చిత్రమే అచ్చమైన నమూనాగా అద్దం పడుతుంది. 

అయినా నిరుత్సాహపడనక్కరలేదు. మనం ఒక్కసారి కన్నుతెరిచి, సత్యాన్ని గ్రహించి, కర్తవ్యాన్ని గుర్తించి, మన మతవిశ్వాసాలు మనల్నివిడదియ్యడానికికాక, బాధ్యతగలపౌరులుగా, ఒక అపూర్వమైన నాగరికతకి వారసులుగా, భవిష్యత్తును శాసించగల అవకాసాన్ని గుర్తించిన క్రియాశీలురుగా ఎరిగి,  మనసా వాచా కర్మణా ఆచరణలో చూపించగల సమర్థులమైనపుడు, మనమే మనకు కావలసిన రీతిలో మనకు ఆమోదయోగ్యమైన పరిపాలన పాలకులచేత రాబట్టుకోగలము.

అటువంటి యువతరానికోసమే ఈ అనువాదం:

****

Image Courtesy: http://t2.gstatic.com

న్ను క్షమించండి…

నాకు చక్రవర్తిని అవుదామన్న ఆశ లేదు. అది నా ఉద్దేశ్యమూ కాదు.

నేను ఎవరినీ శాశించాలనిగానీ, వపరుచుకోవాలని గానీ అనుకోవడం లేదు. దానికి బదులు, అవకాశం ఉంటే వాళ్ళు యూదులో, ఆస్తికులో, నాస్తికులో, నల్లవారో, తెల్లవారో అన్న భేదం లేకుండా అందరికీ సహాయం చెయ్యాలనుకుంటున్నాను.

మనందరమూ అలాగే అనుకుంటాము. అసలు మనిషన్న ప్రతివాడూ అలాగే అనుకుంటాడు.

మందరమూ ఒకరింకొకరి సంతోషాన్ని చూసి బ్రతకాలనుకుంటాం,  ఒకర్నొకరు దుస్థితిలోకి తోసి కాదు. మనం ఒకర్నొకర్ని ద్వేషిస్తూ, అసహ్యించుకుంటూ బ్రతకాలని కోరుకోం.

ఈ సృష్టిలో అందరికీ చోటుంది;

ఈ పుడమితల్లి అందరికీ తగిన తిండీ బట్టా అవకాశాలూ కల్పించగల కల్పవల్లి.

మనందరి జీవితాలూ స్వేఛ్ఛా సౌందర్యాలతో అలరారగలవు.

కానీ, మనం దారి తప్పిపోయాం.

దురాశ మనిషి మనసుని విషపూరితం చేసింది… మనుషుల మధ్య ద్వేషమనే ముళ్ళకంచెలు కట్టింది; మనం దౌర్భాగ్యంలోనూ, రక్తపాతంలోనూ, మగ్గేలా చేసింది.

మనం వేగాన్ని అభివృధ్ధిచెయ్యగలిగేం గాని  మనం అందులో ఇరుక్కుపోయాం. మన యంత్రాలు దేన్నైనా సమృధ్ధిగా ఉత్పత్తి చెయ్యగలవు… కానీ మనచుట్టూ ఆకలీ, లేమీ తాండవమాడుతున్నాయి.

మన విజ్ఞానం మనల్ని నిర్లిప్తులుగానూ  స్వార్థపరులుగానూ మార్చింది; మన నిశిత బుధ్ధి మనల్ని కఠినుల్నీ, నిర్దయుల్నీ చేసింది. మనకు ఆలోచన అనంతం, స్పందన శూన్యం; యంత్రం కంటే కూడా ఇప్పుడు మనకు మానవత్వం అవసరం; తెలివితేటలకంటే కూడా ఇప్పుడు కనికరమూ, మృదుత్వమూ మనకు అవసరం. ఈ లక్షణాలు లేకుంటే, జీవితం హింసామయమై అంతా సర్వనాశనమై పోతుంది.

విమానాలూ, రేడియో మనల్ని దగ్గర చేశాయి. అసలీ ఆవిష్కరణల వెనుకగల ఆంతర్యం మనుషుల్లో మంచిదనానికై అలమటిస్తోంది; విశ్వ సౌభ్రాతృత్వంకోసం, మనందరి ఐకమత్యం కోసం అర్రులుజాస్తోంది. ఇప్పుడుకూడా నా గొంతుక ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికి చేరుతోంది… మనుషుల్ని హింసించి, అమాయకుల్ని బంధించే వ్యవస్థకు బలి అయిపోయిన… నిరాశా పీడితులైన స్త్రీలూ, పురుషులూ, పసిపాపలూ… వారందరికీ. 

నాగొంతు వినగలిగిన వాళ్ళందరికీ నేను చెప్పేదొక్కటే: నిరా పడవొద్దు.

ఈరోజు మనమున్న దౌర్భాగ్యస్థితికి కారణం కొందరి దురాశ ఫలితమే … మానవ వికాసానికీ అభివృధ్ధికీ అసూయపడేవారి భయోజనితమే.

మనుషులమధ్య ద్వేషాలు నశిస్తాయి. నియంతలు మట్టికరుస్తారు… ప్రజలదగ్గరనుండి వాళ్ళు లాక్కున్న అధికారం తిరిగి ప్రజలకి సంక్రమిస్తుంది; మనిషికి ప్రాణములమీద తీపి లేనంతవరకూ … స్వాతంత్ర్యం సమసిపోదు.

సైనికులారా!

మీరు మూర్ఖుల ఆదేశాలకు తలొగ్గకండి, వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడమే కాకుండా బానిసలుగా చేసి— మీరు  జీవితంలో ఏమిచేయ్యాలో, ఏది ఆలోచించాలో, దేనికి ఎలా స్పందించాలో శిక్షణ ఇస్తూ, మీ ఆలోచనల్లోకి జొప్పించి, మీకు తిండిపెడుతూ, మిమ్మల్ని పశువులుగా చూస్తూ, వాళ్ల ఆయుధాలకి ఆహారంగా చేస్తారు.

ఈ అసహజమైన మనుషులకి, యంత్రాలవంటి మనుషులకి, యంత్రాల్లా ఆలోచిస్తూ యంత్రాల్లాంటి హృదయమున్న మనుషులకి తలొగ్గవద్దు. మీరు యంత్రాలు కాదు… మీరు పశువులు కారు…  మీరు మానవులు. మీకు హృదయం ఉంది … హృదయాంతరాల్లో మీకు మానవత్వం మీద అపారమైన ప్రేమ ఉంది.

మీరు ఎవరినీ ద్వేషించరు… ప్రేమనెరుగని వాడే ద్వేషిస్తాడు… ప్రేమననుభవించనివాళ్ళూ, కృత్రిమంగా జీవించేవాళ్ళే ద్వేషిస్తారు. 

సైనికులారా! 

బానిసత్వం కోసం పోరాడకండి! స్వాతంత్ర్యం కోసం పోరాడండి!

ఋషి లూకా ప్రవచించిన 17వ అధ్యాయంలో రాసి ఉంది: భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు… ఏ ఒక్క మనిషిలోనో, లేదా ఏ చిన్ని సమూహంలోనో కాదు… ప్రజలందరిలోనూ… మీలో, నాలో ప్రజలమందరిలోనూ ఉన్నాడు.

ప్రజలు మీరందరి దగ్గరా ఉంది అసలైన శక్తి… యంత్రాల్ని నిర్మించగల శక్తి… ఆనందాన్ని సృష్టించగల శక్తి. మీ కందరికీ జీవితం స్వేఛ్చగానూ, ఆనందమయంగానూ చెయ్యగల శక్తి … ఈ జీవితాన్ని ఒక అద్భుత సాహసొపేతమైన ప్రక్రియగా మలచగల శక్తి.

కాబట్టి ప్రజాస్వామ్యం పేరుతో మనమందరమూ ఆ శక్తిని వినియోగిద్దాం… అందరమూ ఏకమౌందాం రండి!

మనమొక కొత్త ప్రపంచంకోసం పరిశ్రమిద్దాం… ఒక సభ్య ప్రపంచం కోసం… ఎక్కడ ప్రతివ్యక్తికీ పనిచెయ్యడానికి అవకాశమూ, భవిష్యత్తు పట్ల విశ్వాసమూ, ముదిమిలో భద్రతా ఉండగలవో అటువంటి ప్రపంచం కోసం

వీటిని హామీలుగా ఇచ్చే ఈ దుర్మార్గులు అధికారానికి ఎదిగారు. కాని వాళ్ళు అబధ్ధాలకోరులు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరు… ఇకముందెన్నడూ నెరవేర్చరు కూడా.

నియంతలు స్వతంత్రంగా ఉంటారు గాని, ప్రజల్ని మాత్రం బానిసల్ని చేస్తారు. మనం ఆ వాగ్దానాల్ని నిజం చెయ్యడానికి పోరాడుదాం రండి.  మనం ఈ ప్రపంచాన్ని ఒక  స్వేఛ్ఛా ప్రపంచంగా … జాతీయతల హద్దులు చెరిపివేస్తూ, దురాశా, ద్వేషం, ఓర్వలేనితనం లేనివిగా చేద్దాం. మనం ఒక వివేకవంతమైన ప్రపంచం కోసం… ఎక్కడ విజ్ఞానమూ అభివృధ్ధీ సమిష్టి ఆనందాన్ని సమకూర్చగలవో అటువంటి ప్రపంచ నిర్మాణం కోసం పరిశ్రమిద్దాం.

సైనికులారా!… ప్రజాస్వామ్యం పేరుతో అందరూ ఏకం కండి!

.

Hope… I’m sorry but I don’t want to be an Emperor – that’s not my business – I don’t want to rule or conquer anyone. I should like to help everyone if possible, Jew, gentile, black man, white. We all want to help one another, human beings are like that.

We all want to live by each other’s happiness, not by each other’s misery. We don’t want to hate and despise one another. In this world there is room for everyone and the earth is rich and can provide for everyone.

The way of life can be free and beautiful.

But we have lost the way.

Greed has poisoned men’s souls – has barricaded the world with hate; has goose-stepped us into misery and bloodshed.

We have developed speed but we have shut ourselves in: machinery that gives abundance has left us in want. Our knowledge has made us cynical, our cleverness hard and unkind. We think too much and feel too little: More than machinery we need humanity; More than cleverness we need kindness and gentleness. Without these qualities, life will be violent and all will be lost.

The aeroplane and the radio have brought us closer together. The very nature of these inventions cries out for the goodness in men, cries out for universal brotherhood for the unity of us all. Even now my voice is reaching millions throughout the world, millions of despairing men, women and little children, victims of a system that makes men torture and imprison innocent people. To those who can hear me I say “Do not despair”.

The misery that is now upon us is but the passing of greed, the bitterness of men who fear the way of human progress: the hate of men will pass and dictators die and the power they took from the people, will return to the people and so long as men die [now] liberty will never perish…

Soldiers – don’t give yourselves to brutes, men who despise you and enslave you – who regiment your lives, tell you what to do, what to think and what to feel, who drill you, diet you, treat you as cattle, as cannon fodder.

Don’t give yourselves to these unnatural men, machine men, with machine minds and machine hearts. You are not machines. You are not cattle. You are men. You have the love of humanity in your hearts. You don’t hate – only the unloved hate. Only the unloved and the unnatural. Soldiers – don’t fight for slavery, fight for liberty.

In the seventeenth chapter of Saint Luke it is written ” the kingdom of God is within man ” – not one man, nor a group of men – but in all men – in you, the people.

You the people have the power, the power to create machines, the power to create happiness. You the people have the power to make life free and beautiful, to make this life a wonderful adventure. Then in the name of democracy let’s use that power – let us all unite. Let us fight for a new world, a decent world that will give men a chance to work, that will give you the future and old age and security. By the promise of these things, brutes have risen to power, but they lie. They do not fulfil their promise, they never will. Dictators free themselves but they enslave the people. Now let us fight to fulfil that promise. Let us fight to free the world, to do away with national barriers, do away with greed, with hate and intolerance. Let us fight for a world of reason, a world where science and progress will lead to all men’s happiness.

Soldiers – in the name of democracy, let us all unite!”

.

(Text Courtesy: http://www.nikolasschiller.com/blog/index.php/archives/2009/08/10/3574)

“Charlie Chaplin’s Speech in The Great Dictator” కి 4 స్పందనలు

 1. ఇప్పటికి ఇది నిత్య నూతనమే

  మెచ్చుకోండి

  1. శర్మగారూ,
   అది అక్షరాలా నిజం. అందుకే ఒక పక్క బాధా, మరొక పక్క రచయిత దూరదృష్టికి ఆనందమూ కలుగుతాయి.
   అభివాదములతో

   మెచ్చుకోండి

 2. chaplin garu anduke eenatiki cinipremikulaku chirasmaraniyudu. Aayana chitralu aanati samajika paristitulaku nidarshanam ga vuntai. Mukhyamga ee chitramlo hitler vesha bhasani anukaristu hitler ne edirinchatam goppa sahasam. Murthy garu anuvadam baga chesaru.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: