గాథాసప్తశతినుండి …

Image Courtesy: http://youresomartha.files.wordpress.com

.

Rainy Season. Raining Cats and Dogs,

Lord of Clouds was desperate to pull

Earth towards him with his jet-reins;

Thunders are but his grunts of vain enterprise.

.

Anonymous

.

(From Gatha Saptasati (A Book of 700 stories in Prakrutam) compiled, edited and augmented by King Hala (CE 19-24) from among the popular stories circulating among the masses)

.

“అవిరల పడంత ణవజలధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ,
అపహుత్తో ఉక్ఖేత్తుం రసఇవమేహో మహిం ఉఅహ.”

గాథసప్తశతి 5వ శతకంలోని 36వ గాథ ఇది. ‘వర్షాకాలం. కుండపోతగా కురుస్తూ బలమైన జలధారలనే పగ్గాలను కట్టి మేఘుడు భూమిని తనవైపు లాగే ప్రయత్నం చేస్తున్నాడు.  కానీ ఎంత ప్రయత్నించినా లాగలేక పోతున్నాడు. మూల్గుతున్నాడు. ఆ మూల్గులే ఉరుములు’ అని ఈ గాథ అర్ధం.

(Courtesy:  సాహిత్యంలో ప్రకృతి – (2) ; http://venkatbrao.wordpress.com/2011/06/04/)

I acknowledge my sincere thanks to Sri venkatbrao in anticipation of his approval to take the poem and the corresponding material from his blog.

“గాథాసప్తశతినుండి …” కి 4 స్పందనలు

  1. అవును శర్మగారూ. ఇది చాలా రసవత్తరమైన ఊహ. అందులోనూ ఏ కవితోద్యమాలచాయలూ అంటని నాటి కవుల భావనా పటిమని సూచించే అచ్చమైన ఉదాహరణ.
    అభివాదములతో

    మెచ్చుకోండి

  2. మూర్తి గారూ, నమస్కారం!

    ‘గాథా సప్తశతి’ తెలుగువారి ఆచార వ్యవహారాలనూ, ఆనాటి ప్రజల అనుభవాలనూ అనుభూతులనూ చిన్న చిన్న గాథలలో గ్రంథస్తం చేసిన ఒక గని లాంటిది. అందులోని సంగతులను చదివిన తరువాత, నాకయితే గడచిన రెండువేల సంవత్సరాలలో మనం పెద్దగా మారిందేమీ లేదనే అనిపిస్తుంది. ‘గాథా సప్తశతి’ లోని సంగతులను ఎన్నిటినో తెలుగు వారికి పరిచయం చేసిన వారిలో అతి ముఖ్యులు, తెలుగు వారికి పూజ్యులు, ప్రాతఃస్మరణీయులు అనదగిన స్వర్గీయ తిరుమల రామచంద్ర గారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు, పంచాజ్ఞుల ఆదినారయణ శాస్త్రి గారు. స్వర్గీయ తిరుమల రామచంద్ర గారు ‘గాథా సప్తశతి’ గురించి వ్రాసిన వ్యాసాలు 1940-1980 మధ్య కాలంలో అప్పటి ‘భారతి’ ‘ఆంధ్ర ప్రభ వార పత్రిక’ లాంటి వాటిలో ప్రచురించబడినాయి. ఈ వ్యాసాలనే సంకలించి రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఒక పుస్తకంగా కూడా ప్రచురించారు. అది ఇప్పుడు దొరుకుతుందో లేదో చెప్పలేను. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ‘గాథా సప్తశతి’ లోని వంద గాథలను తెలుగులోకి అనువదించి ప్రచురించారు. పంచాజ్ఞుల ఆదిణారయణ శాస్త్రి గారు ‘ప్రాకృత గ్రంథకర్తలూ – ప్రజాసేవానూ’ అనే పెద్ద వ్యాసంలో ‘గాథా సప్తశతి’ లోని ఎన్నో సంగతులను ముచ్చటించారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలింది ఏమిటంటే, ‘గాథా సప్తశతి’ లోని ప్రతి గాథలోనూ సామాన్యుడే hero!

    ‘గాథా సప్తశతి’ లోని గాథలలో నిక్షిప్తమై వున్న తెలుగువారి జీవనానికి సంబంధించిన సంగతులను ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నేను నా బ్లాగులలో (తెలుగు, ఇంగ్లీషు) వ్రాసిన సంగతులన్నిటికీ కూడా వీరి రచనలే అధారం.

    ముందుగానే అన్నట్లుగా, ‘గాథా సప్తశతి’ అనే ఆ గనిలోంచి తవ్వి తీసి, ఆసక్తి వున్న ఇప్పటితరం పాఠకులకు అందించాల్సింది చాలా వుంది. మీ చేతనియినంత మీరు చేయగలరని ఆశిస్తూ…

    ధన్యవాదాలతో,

    వెంకట్.బి.రావు

    ముందుగానే అన్నట్లుగా, ‘గాథా సప్తశతి’ అనే ఆ గనిలోంచి తవ్వి తీసి, ఆసక్తి వున్న ఇప్పటితరం పాఠకులకు అందించాల్సింది చాలా వుంది.

    మీ చేతనియినంత మీరు చేయగలరని ఆశిస్తూ…

    ధన్యవాదలతో,

    వెంకట్.బి.రావు

    మెచ్చుకోండి

    1. వెంకట్ గారూ,
      ముందుగా అనువాదాలకి మీ అనుమతి ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారి గాథాసప్తశతి లోని గాథలనూ అందులోని చమత్కారాలనూ చిన్నప్పుడెప్పుడొ చదివాను. మళ్ళీ మీ బ్లాగు చూసిన తర్వాత అవి జ్ఞప్తికి వచ్చాయి. ముందుగా ప్రణాళిక వేసుకోకపోయినా, నా మనసుకి నచ్చినవీ, అందులో కొన్ని ఇంతకుముందు ఎవరికీ దొరకనివీ కొన్ని కవితల అనువాదాలు కొనసాగిస్తున్నాను. అందుకని గాథాసప్తశతి లోంచి ఎందుకు అనువదించకూడదు? అనుకొని చేశాను. సాహిత్యానికి ఇది ఉడత సేవ మాత్రమే. అభివాదములతో

      మెచ్చుకోండి

Leave a reply to venkat.b.rao స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.