అనువాదలహరి

My Lord ! … Viswanatha

Image Courtesy: http://smashingtips.com

.

My Lord! The abode you commit me to live…

Is an essence of intense darkness of the night,

A veritable trove of abject poverty, disconsolate,

And, dabbed with endless stream of tears.

.

And in that Stygian darkness my Lord! you once

Flourished, eons ago; And, that day my humble cot

was pervaded with a passel of  flowery perfumes

wafted around by the winds of ecstasy!

.

That’s all!  Darkness took over the reign again.

This endless enduring darkness and I

Have been locked up in a bear-hug ever since

Reminiscing you, and your profile of that moment.

.

Viswanatha Satyanarayana

.

స్వామి! పరిగాఢ శర్వరీఛ్ఛవి, దరిద్ర

తానిధానము, తేజోవిహీన, మనవ

రతపరిసృతభాష్పధారామిళితము

నన్ను నీ వుండుమన్నంగణంబు తండ్రి!

.

ఈ మహాంధకారంబున నెపుడొ యొక్క

సారి మెరిసితి, వానాడు సామి! నా కు

టీర మానందవాయుప్రచారశతస

హస్ర కుసుమపరీమళవ్యాపృతంబు!

.

దానితో సరి, మరల నాంధ్యమ్ము క్రమ్మె,

తొలి చివరలేని ఈ చీకటులును, నేను

ఒక్కరొక రప్పళించుకొంచుండినాము,

నిన్ను, నీ నాటి మెరుపు మన్నించుకొంచు!

.

విశ్వనాధ సత్యనారాయణ

(10 September 1895 – 18 October 1976)

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తిరుపతివేంకటకవుల శిష్యులు, తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, అక్షరాలా శతాధికగ్రంథ కర్త. పరమ ఛాందసుడనీ, “పాషాణపాకప్రభో” అనీ సమకాలీనులలో కొందరు అతని భావజాలానికీ, రచన శైలికీ విమర్శించినా, తనదైన మార్గంలో,  అసమాన మేధాసంపత్తితో నిర్భయంగా సాగిన కవి. అయితే,  అద్భుతమైన కల్పనాశక్తితో పాటు,  అతని రచనలలో కొన్నిచోట్ల సరళతా, సమకాలీన ప్రతీకలూ కూడ కనిపిస్తాయి.

2 thoughts on “My Lord ! … Viswanatha”

    1. శర్మగారూ,
      విశ్వనాథవారిగురించి చెప్పడానికి నేనెంత? ఆయనని చదివితే భాషపట్ల కొందరికి భయమూ, మరికొందరికి అభిమానమూ కలుగుతాయి. ఆయన కొన్ని సందర్భాలలో ఉపయోగించిన పదాలు ఇంకేమాటవాడినా ఆ భావతీవ్రతని వెలిబుచ్చలేవు అన్న భావనని కలిగిస్తాయి. ఉదాహరణకి, చీకటిలో మగ్గుతున్నాననడానికి ఆయన, “తొలి చివరలేని ఈ చీకటులును, నేను ఒక్కరొక రప్పళించుకొంచుండినాము” అంటాడు. ఈ అప్పళించుకొను అన్న మాట చీకటి ఎంత గాఢమైనదో, వదుల్చుకుందామన్నా వదలడం లేదో తెలియజేస్తోంది.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: