శర్మగారూ,
అవును. ముందు మనకు వాడు దారికి అడ్డువచ్చేడని కోపమూ, చేసిన తప్పుకు శిక్ష అనుభవించేడన్న భావనా ఒక్క క్షణం పాటు అనిపించవచ్చు. ప్రమాదం మరీ చిన్నదయితే ఇంకా కోపం ప్రదర్శించవచ్చేమో కూడా. కానీ, ఆ ప్రమాదమే ప్రాణాంతకమయినపుడు, మన స్పందన వేరేగా ఉంటుంది. పైకి ఎన్ని చెప్పినా మనం నేరం చేసినపుడు మన మనసుకి తెలుసు. ఆ అపరాధభావన నుండి తప్పించుకోడం కష్టం. అప్పుడు ప్రమాదానికి గురయినవారిపట్ల సానుభూతీ, మనలోని నిద్రపోయిన మానవత మేల్కొంటాయి. మనకు చాతనయిన సహాయము చేసి ఎలాగయినా ప్రాణాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తాం.
నమస్సులతో,
శ్యామలరావు గారూ,
ముందుగా నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు. మీకు అర్థం కాలేదని కాదు, ఇది ఒక్కోసారి మనం చేసే చిన్ని పొరపాట్లవల్ల పెద్దప్రమాదాలు జరిగినపుడు, అవి జీవితాంతం వెన్నాడే బాధ. నాకు తెలిసి మా బావగారు చిన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని ఎందుకోకోపం వచ్చి చెంపదెబ్బ కొట్టబోతే, అతను తప్పించుకునే ప్రయత్నంలో చెవివెనకనున్న నాడికి తగిలి అతను చనిపోయాడట. అప్పడినుండి ఇప్పటివరకు అతను ఎంతకోపం వచ్చినా దెబ్బలాడడమేగాని చెయ్యిచేసుకోరు. కళ్ళెదుట ఒక నిండు జీవితం సమసిపోడానికి మనం కారణం అయితే, ఆ బాధ వర్ణనాతీతం.
ధన్యవాదాలతో,
పెద్ద పోష్టు గదా. రాత్రి తీరికగా చదువుదామనుకున్నా. విషయం జోలికింకా పోలేదు. నా కామెంటు ‘నిర్వచనం’ అన్న శీర్షిక మీద మాత్రమే. బహుశః ‘అనిర్వచనీయం’ అందామనుకున్నారేమో తెలియదు.
మీరన్నట్లు ఒక సంఘటన యొక్క తీవ్రత చాలు జీవితాన్ని మలుపు తిప్పటానికి.
కవిత శీర్షిక ‘నిర్వచనం’ కాదు. శీర్షిక తెలుగు మూలం లో కూడా ఇంగ్లీషు టైటిల్ “ఏక్సిడెంట్”. చిత్రంగా తెలుగు కవితలకు ఈ రకమైన ఇంగ్లీషు శీర్షికలుంచడం పై మొన్న యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక కాన్ఫరెన్సులో చర్చకూడా జరిగింది.
‘నిర్వచనం’ నిర్మల గారికవితా సంకలనం పేరు.
ధన్యవాదాలతో
అనువాదం కూడా అద్భుతమైన కళ అని నిరూపించారు. నిర్మలగారు చూస్తే మరింత సంతోషిస్తారేమో. ఒక కవిలోని భావనని అనుభవించి అనువదించడం అసాధారణమైన ప్రక్రియ.
భావ ధారుడ్యం కలిగిన పదాల ఎంపిక (egregious guilt .unkempt beard,Insufferable embarrassment etc) gave deep anchorage to the thought. Really excellent sir.
శ్రీనిక గారూ,
పసిపిల్లల భవిష్యత్తులు అర్థాంతరంగా ముగిసిపోవడమన్న ఆలోచనే బాధాకరం. ఈ క్రషింగ్ సీజను వస్తే చాలు, చెరుకులారీ క్రింద పడి ఎక్కడో ఒక చోట పిల్లలు చనిపోయారని వార్తలలో చదవడం విశాఖజిల్లావాసులుగా మీకు బాగా పరిచయం ఉండే ఉంటుంది. అందులోనూ చోడవరం లాంటి సంకుచితమైన త్రోవలలో. పిల్లలు వెనకపడడమూ మానరు, ప్రమాదాలూ జరగకనూ మానవు. అందుకని ఈ విషయం మనసు కలచివేసే అనుభవాన్ని తట్టిలేపింది.
మీ సహృదయపూర్వకమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు.
Leave a reply to శ్రీనిక స్పందనను రద్దుచేయి