నను మరువకు … డేవిడ్ హార్కిన్స్

http://tengossip.com/wp-content/uploads/2010/02/remember-me-still12.jpg
Image Courtesy: http://tengossip.com

.

నేను వెళిపోయేనని ఏడువకు, 

బదులుగా

నేను కొంతకాలం జీవించినందుకు సంతోషించు.

కళ్ళుమూసుకుని దేవుని ప్రార్థించకు

నేను వెనుతిరిగి రావాలని,

బదులుగా

కళ్ళు విప్పి నేను మిగిల్చిపోయినవి గమనించు.

నన్ను ఇక చూడలేక పోతున్నందుకు

నీ హృదయం శూన్యంగా

అనిపిస్తుందని నాకు తెలుసు.

కానీ, నీ మనసు

మనమిద్దరం గడిపిన స్నేహపరిమళాలతో

నిండిపోవాలని కోరుకుంటున్నాను.

రేపటికి వెన్నుతిప్పి

నువ్వు నిన్నలోనే బ్రతకాలనుకుంటావో,

లేక మనిద్దరి మధ్యా నిన్న గడిచినదానికి 

రేపు సంతోషంగా ఉంటావో నీ ఇష్టం.

నన్ను గుర్తుంచుకుని

నేను వెళ్ళిపోయేనని ఖేదిస్తావో,

నా జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకుని

దాన్ని శాశ్వతం చేస్తావో!

నువ్వు ఏడ్చి ఏడ్చి

మనసు వికలమై,

నిన్ను నువ్వుకోల్పోయి

ప్రపంచానికి ముఖం చాటుచేస్తావో,

లేక నేను కోరుకున్నట్టుగా,

నీ కన్నీరు తుడుచుకుని,

చిరునవ్వు తెచ్చుకుని,

ప్రేమించడం మళ్ళీ నేర్చుకుని

ముందుకి సాగిపోతావో…

.

ఇక నేను కొనసాగలేను…

నేను వెళ్లక తప్పదు…

నేను ఇక శలవు తీసుకుంటాను…

ఉంటా!

.

డేవిడ్ హార్కిన్స్

(నవంబరు 14, 1958 -)

బ్రిటిషు కవి, చిత్రకారుడు.

చిత్రమైన పరిస్థితుల్లో కవిగా గుర్తించబడ్డ మధ్యతరగతి  చిత్రకారుడి ఈ కవిత వెనక గమ్మత్తైన కథే ఉంది. 2002 లో బ్రిటిషు మహరాణి తన తల్లి Funeralలో అజ్ఞాత వ్యక్తి వ్రాసిన కవితగా ఇందులోని  కొంతభాగాన్ని చదివినపుడు దేశమంతా అట్టుడుకిపోయింది ఈ కవిత ఎవరు రాసేరో తెలుసుకుందికి. ఇదిగో ఈ లింక్ చదవండి. 


http://www.guardian.co.uk/books/2002/sep/16/artsfeatures.poetry

.

Remember Me

.

Do not shed tears when I have gone
but smile instead because I have lived.

Do not shut your eyes and pray to God that I’ll come back
but open your eyes and see all that I have left behind.

I know your heart will be empty because you cannot see me
but still I want you to be full of the love we shared.

You can turn your back on tomorrow and live only for yesterday
or you can be happy for tomorrow because of what happened
between us yesterday.

You can remember me and grieve that I have gone
or you can cherish my memory and let it live on.

You can cry and lose yourself become distraught
and turn your back on the world
or you can do what I want – smile, wipe away the tears,
learn to love again and go on.

*I can’t go on. I must go on. I’ll go on.

(*Line taken from Samuel Beckett’s novel ‘The Unnameable.’)

David Harkins

He was recognised as a poet by accident. There was an interesting story behind this. please read this link:

http://www.guardian.co.uk/books/2002/sep/16/artsfeatures.poetry

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: