అనువాదలహరి

You And I – Arun Bavera

Image Courtesy: http://kvsuranussi.com/museum.jpg

.

I came to life in the dialogues you could not scribe

I gleaned responses from the words you concealed behind your silence

I continue my march from wherever you stopped.

I rear your dreams in my eyes

I lend my voice to your songs

I  drained your wounds into my griefs wetting with my blood

I filtered your grief into my tears…

All your rivers I  course them into my sea

And I precipitate all your storms into my floods

I parade all your joys  in my festivals

I display your pleasures in my laughter

I keep your boats afloat in my waters

I make your presence felt in your absence

All your horizons get incarnadine in me

All your watches shall  daybreak in me.

.

I am one 

Who jumps unto you walking you over, and

Grafted  his corp to your soul.

You are one

Who charged his heart with the verdure of the fields,

And I 

Who love the cosmic expanses.

.

Comrade!

You and I  are not different.

.

 Telugu Original: Arun Bavera

.

నువ్వు రాయలేని సంభాషణల్లో

నేను జీవం పోసుకున్నాను

నీ మౌనం వెనుక దాచుకున్న మాటల్లో

నేను స్పందనలేరుకుంటున్నాను

నువ్వాగినచోటల్లా

నేను నడుస్తునే వున్నాను

.

నీ కలల్ని

నా కళ్ళలో పెంచుతున్నాను

నీ పాటల్ని

నా గొంతుతోపాడుతున్నాను

నీ గాయాల్ని

నా బాధల్లోకి ఒంపుకున్నాను

నా రక్తంతో తడుపుతున్నాను

.

నీ శోకాన్ని

నా కన్నీళ్ళలోకి వడబోసుకున్నాను

నీ నదులన్నింటినీ

నా సముద్రంలో కలుపుకుంటున్నాను

నీలో తుఫానుల్ని

నా వరదలోకి తర్జుమా చేస్తున్నాను

నీ ఆనందాల్ని

నా ఉత్సవాల్లో ఊరేగిస్తున్నాను

నీ సంతోషాల్ని

నా నవ్వుల్లో ఆరబోస్తున్నాను

నీ పడవల్ని

నా నీటిమీద మోస్తున్నాను

నువ్వు లేని వేళల్లో

నీ ఉనికిని చాటూతున్నాను

నీ దిక్కులన్నీ

నాలో ఎర్రబడతాయి

నీ జాములన్నీ

నాలో తెల్లవారుతాయి.

.

నేను నీ మీంచి నడుచుకుంటూవచ్చి

నీ లోకి దూకుతున్న వాణ్ణి

నా దేహాన్ని

నీ దేహంతో అంటుకట్టుకున్నవాణ్ణి

నువ్వు

పంటచేల పచ్చదనం మనస్సులో నింపుకున్నవాడివి,

నేను

ఆకాశాల్ని ప్రేమిస్తున్న వాణ్ని

.

నువ్వూ నేనూ

వేరుకాదు నేస్తం…

.

తెలుగు మూలం: అరుణ్ బవేరా ( “నువ్వూ-నేనూ”  ఒక కన్నీటిచుక్కకోసం కవితా సంకలనం నుండి)

2 thoughts on “You And I – Arun Bavera”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: