Revolution Is a Perennial Spring- Arun Bavera . Comrade! Water is seeping under your words Your papers are dampening Your sentences are losing their edge Your index is Missing its aim. Your fist no longer remains air-tight. . You are cooling emotions down Learning secrecy, of late. Giving room for ‘behind-the-curtain’ dealings Throwing blame on the weaponry Bringing nonviolence these days Often on to the agenda Expressing your skepticism About the Philosophy. Your seat on the dais Is noticed vacant very frequently Your hands no longer Embrace the pamphlets. Your looks no longer Rain swords. . Why all of a sudden today An umbrella opened up on your head Comrade? Does Sun scorch you today More than ever before? Seems you have forgotten those mornings When day broke on the rifle’s barrel You now started covering up Your shoulders with the rug of fears And, shunning old friendships As easily as you would doff old clothes. . OK It looks as though You are searching for a subtle way out. It is now confirmed That you can’t stand up to these struggles. Better you vacate the post now. We can’t hail them as heroes Who hang up their arms Mid way through the war. There the door you opened Is as narrow as you are. One or two shadows That break off from light Might jump the fence that way. . So be it. No problem. Revolution is a perennial spring. Always It is redolent with fresh waters here. A galore of invitations spring up in our path everyday. And umpteen bodies blossom Red each day. . Arun Bavera Feb 2, 2002. ఉద్యమం ఊటబావి . మిత్రుడా! నీ మాటల క్రిందకి నీళ్ళు చేరుతున్నాయి నీ కాగితాలు చెమ్మగిల్లుతున్నాయి నీ వాక్యాలు పదును తగ్గుతున్నాయి నీ చూపుడువేలు గురి తప్పుతోంది నీ పిడికిలి మధ్యలో గాలిచొరబడుతోంది. . నువ్వు ఆవేశాల్ని శీతలీకరిస్తున్నావు నువ్వుకొత్తగా దాపరికాలు నేర్చుకుంటున్నావు తెరచాటు వ్యవహారాలకి చోటిస్తున్నావు ఆయుధాలమీద అపవాదులు విసురుతున్నావు. . ఈ మధ్య పదేపదే అహింసని ఎజెండాలోకి లాక్కొస్తున్నావు సిధ్ధాంతం మీద సందేహాలు చీదరిస్తున్నావు తరచూ వేదిక మీద నీ కుర్చీ ఖాళీగా వుంటోంది నీ అరచేతులు కరపత్రాలను కౌగిలించుకోవడం లేదు నీ చూపులు ఖడ్గాలు వర్షించడం లేదు. . హఠాత్తుగా ఈ వేళ, నీ నెత్తిమీద గొడుగు మొలిచిందేం మిత్రుడా? సూర్యుడీవేళ కొత్తగా కాలుస్తున్నాడా? తుపాకీ గొట్టం మీద తెల్లారిన ఉదయాల్ని మరిచిపోయావు నువ్వు భయాల్ని భుజాల చుట్టూ గొంగళిలా చుట్టుకుంటున్నావు పాతస్నేహాల్ని పాతబట్టలు విప్పుకున్నంత తేలికగా విసర్జిస్తున్నావు. సరే, నువ్వు నాజూకైన దారికోసం వెతుక్కుంటున్నట్టున్నది. . ఈ ఒడిదుడుకులు నీ ఒంటికి సరిపడవని తేలిపోయింది యిక శిబిరం ఖాళీ చెయ్యి యుధ్ధం మధ్యలో ఆయుధాలు దించేసిన వారిని మేం వీరులుగా కీర్తించలేం. అక్కడ నువ్వుతెరుచుకున్న ద్వారం చాలా యిరుకైంది- నీలాగే వెలుగునుండి తెగిపడ్డ నీడలు ఒకటో అరో అటు దూకేస్తాయి. . అయినా ఫర్వాలేదులే, ఉద్యమం ఊటబావి యిక్కడ నిరంతరం కొత్తనీరు పరిమళిస్తోనే వుంటుంది మా మార్గం మీద రోజూ లక్ష ఆహ్వానాలు మొలుస్తూనే వుంటాయి రోజూ లక్ష దేహాలు ఎర్రగా చిగురిస్తోనే వుంటాయి. . అరుణ్ బవేరా ఫిబ్రవరి 7, 2002 (ఒక కన్నీటి చుక్కకోసం- కవితా సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూలై 21, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుArun Bavera Between Man and Man- Arun BaveraThe Last Touch- K. Geetha స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.