Between Man and Man- Arun Bavera . I hereby ban your dreams Your ideas And your ways Peace must prevail in the state! From now on, nobody should agitate. I ban food and clothing for the indigent. Those with ‘Siamese’ belly and back Only abet disturbances; They all flock together and raise revolutions Keep them away from one another And plant rifles between them for guard. . I ban those looks Of one looking into the eyes of the other. Ideas easily transmit through looks, Signals circulate, There will be daggers in those looks, Be ware! . I hereby ban light and warmth to everybody. Grope in darkness! For that matter, better to shove and lock them in dungeons. Don’t let hot-blooded youth on to the streets. Decapitate them lest they should raise head From the histories rewritten by us. Let’s send philosophers to teach them. If possible, commission Saints Resurrected from their graves. Once in a while, at night, permit oldies Onto the roads patrolled by army…no problem. . But, primarily, I ban poets. They are the root cause of all evils. They are the seeds of insurgence. They can write messages on winds; They broadcast and farm words about them; Sew those fingers, sew those mouths of poets; Pluck their eyeballs and pocket them; crucify them. At any cost, Peace must prevail in the state! . Arun Bavera. . మనిషికీ మనిషికీ మధ్య . మీ కలల్ని నిషేధిస్తున్నాను మీ భావాల్ని నిషేధిస్తున్నాను మీ మర్గాల్ని నిషేధిస్తున్నాను రాజ్యంలో శాంతి వర్ధిల్లాలి! ఎవరూ ఆందోళించకూడదు దరిద్రులకి తిండీ బట్ట నిషేధిస్తున్నాను కడుపులు వీపులకంటుకు పోయిన వాళ్ళే కల్లోలాలు సృష్టిస్తారు అంతా గుమిగూడి విప్లవాలు చేస్తారు ఒకరికొకర్ని ఎడంగా వుండనివ్వండి మనిషికీ మనిషికీ మధ్య తుపాకుల్ని కాపలా వుంచండి . ఒకరికళ్ళలోకి ఒకరు చూసుకునే చూపుల్ని నిషేధిస్తున్నాను చూపుల్లో భావప్రసారాలు జరుగుతాయి, సంకేతాలు సరఫరా అవుతాయి, చూపుల్లో చురకత్తులుంటాయి- జాగ్రత్త! అందరికీ వేడీ వెలుతురూ నిషేధిస్తున్నాను. చీకట్లో పారాడండి. అసలు చీకటిగదుల్లోకి కుక్కి తాళాలు పెట్టించడం మంచిది. రక్తం సలసలా మరిగే కుర్రాళ్ళెవరినీ వీధుల్లోకి రానీకండి. మేం రాయించిన చరిత్రపుస్తకాల్లోం చి లేవకుండా తలలు కొట్టేయండి. పాఠాలు బోధిం చడానికి వేదాంతుల్ని పంపిద్దాం వీలైతే సమాధుల్నించి లేచిన సన్యాసుల్ని పిలుద్దాం ఎప్పుడన్నా, రాత్రుళ్ళు, ముసలాళ్ళని సైన్యం కాపలావున్న రోడ్లమీదకి అనుమతించండి- ఫర్వాలేదు ముఖ్యంగా- కవుల్ని నిషేధిస్తున్నాను. అన్ని అనర్ధాలకూ మూలం వాళ్ళు తిరుగుబాట్లకి విత్తనాలు వాళ్ళు గాలిమీద గీతాలు రాస్తారు చుట్టూ అక్షరాలు జల్లి పెంచుతారు అంచేత, కవులకి వేళ్ళు కుట్టండి, నోళ్ళు కుట్టండి, కళ్ళుపీకి జేబుల్లో పెట్టండి, శిలువవెయ్యండి రాజ్యంలో శాంతి వర్ధిల్లాలి! . అరుణ్ బవేరా (ఒక కన్నీటి చుక్కకోసం – కవితా సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూలై 18, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుఅరుణ్ బవేరాఒక కన్నీటి చుక్కకోసం A Lesson —K GeethaRevolution Is a Perennial Spring- Arun Bavera స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.