Missed Letter – K. Geetha Hi, pal! Howdy? Its ages since you penned your last letter! Nay, eons!!! Moments we caressed our wounds And the pep talk transcending epochs still lay under the creased folds. . Letter is An elixir that fills Every time you breathe with doubled-up enthusiasm It’s an amazing leaf that relieves Your heart with letters. . Hi, pal! Howdy? Home, children, neighborhood, Loans, allowances, office, other mundane concerns… Why Make a call for festivals? Send a message, that will do! Talking from the land-line, So bye for now, lest bill would soar! Where is the room for romance of language? Diction itself drizzles down like spores . Blossoming blue sky Touch of verdure grace The sudden appearance of rainbow The elegant rain-embedded cloud… . Be that cell-to-cell is free Or the ‘space-compressor’ cell is a boon Can you hear the beat of the heart Behind that pronounced word? Can it transmit the real musical Symphony of the words aligned? . A letter is an epic How many times ever it was re-licked ! It’s an inerasable imprint of the heart How many times ever you read it!! It’s an immutable form of the volatile word Soul of the suppressed dreams… Where had they gone those assertions of mutual welfare? Where were ‘yours friendly’s and ‘yours lovingly’ leave takings? ‘Hello’ , ‘Hi’ ‘Bye’ or “CU” A smattering of courtesy A scattering of scissored words strewn And an asphyxiation of roots of words! . Hi, pal! Howdy? Whenever I saw a letter stuffed into the door handle My heart used to leap up… fledged! Flashing in my memory It used to spring an inadvertent smile Over and again, whatever I did!! Gee God! What happened!!! Dull… dry …dreary conversations, and Angst shadowing the heart Are ‘cut’ behind the ‘bills’ Many calls you can’t afford to miss Are anguishing as ‘missed calls’ . Pal! Dear pal!! Letter is the only memento for life!!! An oasis that quenches your thirst by degrees. Life is immortal in a lively letter That exhorts from past… when present frightens! . In the postman’s bag, at best, There are few LICs, ‘On IGS’s now, And occasionally… few land-line bills. Post card has become a relic of the past. Not to speak of the Inland Letter And the envelope-gloomed Envelopes. No use ruing, our own undoing. . Alarms… clocks…letters… Cell is now all in one! Radios and cameras Are on her morrow’s menu!! Pal! There’s no time to speak Nor time to spare for the pen. Hello! Hello!! Pl mail this msg to all!!! Land to land Or cell to cell… no matter. Pl. send this msg urgently. See it’s prominently displayed on cell screen And the phone could hear: “Here letter is on her death-bed.” . K. Geeta . Missed Letter . మిత్రమా! బాగున్నావా! ఉత్తరం రాసి ఎన్నాళ్ళయింది!!! కాదు కాదు ఎన్నేళ్ళయింది!!! గాయాల్ని తడుముకున్న క్షణాలు విలయాల్ని దాటుకెళ్ళిన ఊసులు మడతల చాటునే మిగిలాయి ఉత్తరమంటే శ్వాసించినపుడల్లా రెట్టింపు జీవనోత్సాహాన్ని నింపే అమృతం అక్షరాల్తో గుండెని సేదదీర్చే అద్భుత ప్రపత్రం హలో- మిత్రమా! బాగున్నావా! ఇల్లూ- పిల్లలూ- ఇంటా- బయటా ల్లోనూ- అలవెన్సులూ- ఆఫీసు- ప్రాపంచికాలు పండుగలకు ఫోనెందుకు? మెసేజిద్దూ— చాలు. లాండ్ లైన్నించికదా- బిల్లవుతుంది మరికచాలు భావుకత్వానికి చోటేదీ? భాషే పుప్పొడై రాలిపోతుంది. వికసించే ఆకాశం హరితాన్విత లయవిన్యాసం ఇంద్ర ధనుస్సు సాక్షాత్కారం వర్షాకృత మేఘరాగం సెల్-టు-సెల్ ఫ్రీయైనా దూరాల్ని తగ్గించే ‘సెల్ ‘ వరమైనా మాటదాపున గుండెస్వరం వినిపిస్తుందా? అక్షరాల వెంటపరుచుకునే అసలు నాదం ధ్వనిస్తుందా…! మరమ్మత్తులు చేసినా మహాకావ్యం ఎన్నిసార్లు చదివినా చెరగని హృదంతరం ఉత్తరం- మారే మాటకు మాయని రూపం అణిగిన స్వప్నాల అసలు శరీరం ఉత్తరం- ఉభయకుశలోపరి లేవీ? స్నేహంతో, ప్రేమతో- ముగింపులేవీ? హలో, హాయ్ లు బాయ్, సీయూలు. తెగిపడినమాటల అవయవాలు గొంతునులిమేసిన పదాల కుదుళ్ళు మిత్రమా! బాగున్నావా! ద్వారానికి వేలాడే లేఖనిచూస్తేనే రెక్కలొచ్చినట్లుండేది ఏ పని చేస్తున్నా మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి చిర్నవ్వు మొలిచేది. ఎంతపని జరిగింది! తడిపొడి సంభాషణలు- గుండెచాటు అసంతృప్తి జాడలు బిల్లు వెనక ‘కట్ ‘ అవుతున్నాయి మిస్ కాలేనివెన్నో ‘మిస్ద్ కాలై’ దుఃఖిస్తున్నాయి మిత్రమా! మిత్రమా! మరోజన్మకైనా ఉత్తరమేగా చెరగని జ్ఞాపిక అంచెలంచెలుగా సేదతీరే దప్పిక ప్రాణమున్న లేఖల్లో చిరంజీవి జీవితం వణికించే వర్తమానం వెనుక వెన్ను తట్టే లేఖాగతం పోస్ట్ మాన్ సంచీలో కాసిన్ని ఎల్.ఐ.సీ.లు, ఐజిఎస్లూ మహా అయితే లాండ్ ఫోన్ బిల్లులూ కార్డుముక్క కరువైపోయింది ఇన్ లాండ్ ఇక్కట్లు, కవర్ల పాట్లు కడుపుచించుకుంటే కాళ్ళమీద పడ్తుంది. అల్లారాలు, గడియారాలు, ఉత్తరాలూ సెల్ తో చెల్లు రేడియోలు, కెమేరాలు రేపటి ఆహారాలు మిత్రమా! మాట్లాడేందుకు సమయం లేదు రాసేందుకు తీరిక లేదు హలో! హలో! ఈ వార్త అందరికీ ‘మెయిల్ ‘ పంపు లాండ్ టు లాండ్ సెల్ టు సెల్ ప్లీజ్ వెంటనే మెసేజెస్ ఇవ్వు సెల్ కళ్ళకి కంపడేలా ఫోనుచెవులకి వింపడేలా ఈ వాఋత పంపు ఇక్కడ ఉత్తరం కొన ఊపిరితో ఉంది. తెలుగు మూలం: ‘మిస్డ్ లెటర్ ‘ శీత సుమాలు కె. గీత Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూలై 8, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుకె. గీతమిస్డ్ లెటర్శీత సుమాలు Motherland … Aranya KrishnaSivreddy స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.