నిరాశా గీతం – part 2 Neruda
ఓ శిధిలావశేషాల రాశీ! అన్నీ నీలోలయించాయి.
ఓడముందు నిలబడి, నావికునిలా
నువ్వు గీతాల్లో ఇంకా వికసిస్తూనే ఉన్నావు, కెరటాల్ని అదుముతూనే ఉన్నావు,
పాలిపోయిన శీఘ్ర చోదకుడూ, అదృష్టంలేని వడిశల వేటగాడూ,
ఇది ఇక నిష్క్రమించవలసిన సమయం, రాత్రి ప్రతి ఝాముకీ
ఘోషిస్తున్న కెరటాలు ఒడ్డును చుట్టుముడుతున్నాయి.
తెల్లవారుఝామున ఓడరేవులా చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉంది.
ఓహ్. అన్నిటికీ దూరంగా, అన్నిటికీ దూరంగా.
“నిరాశా గీతం – part 2 Neruda” కి 2 స్పందనలు
-
ఎంత గాఢతను మూటగట్టుకున్నాయి ఈ పదాలు.. మీ అనువాదానికి ధన్యవాదాలండీ..
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
thank you.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి