-
రేపటి కి… సామ్యూల్ జాన్సన్, ఇంగ్లీషు రచయిత
(ఐరీన్(Irene) నాటకం నుండి) . రేపు చేద్దామనుకుంటున్న పని! వయసుతోపాటు సంపాదించుకున్న అపురూపమైన జ్ఞానం రేపటికి మిగులుతుందా? యవ్వనానికి నెచ్చెలి… వాయిదా తత్త్వం… పిరికితనం, తెలివితక్కువదనం, ఓటమి విధిలిఖితమై రేపటికోసం ఎదురుచూస్తూ జీవితాన్ని వృధా చేస్తుంది. ఆశగా, కోరికలునిండినకళ్ళతో రేపటికై గుడ్లప్పగించి చూస్తుంది మధ్యలో మృత్యువు చొరబడి ఆ అవకాశాన్ని తన్నుకుపోయేదాకా! చిత్రం ప్రతి రోజూ అనవరతంగా ఈ మోసం జరుగుతూనే ఉన్నా అది గ్రహించలేని దౌర్భాగ్యులతో నిండి ఉంది ఈ ప్రపంచం చలికాలంలో మంచులో కవాతు…
-
వసంత కాలం …హఫీజ్, పెర్షియన్ సూఫీ కవి
వసంతం వచ్చేసింది! గులాబులూ, మల్లెలూ, కలువలూ మట్టిలోంచి తలెత్తుతున్నాయి– నువ్వు ఇంకా ఎందుకు మట్టి క్రిందే పడి ఉంటావు? బరువెక్కిన మేఘాల్లా నా ఈ కళ్ళు నీ సమాధి చెర మీద వర్షిస్తుంటాయి కన్నీళ్ళు నువ్వుకూడా మట్టిలోంచి తల పైకెత్తేదాకా! – హఫీజ్… పెర్షియన్ సూఫీ కవి 1325 –1389 The days of Spring are here! The eglantine, The rose, the tulip from the dust have risen– And…
-
ఉత్తరధృవప్రభలు… బెంజమిన్ ఫ్రాంక్లిన్ టేలర్, అమెరికను కవి
ఉత్తరధృవాన్ని ఆక్రమించడానికి సూరీడు మంటల బావుటాల సేనలతో వేంచేసేడు అక్కడి గాలి తెరచాపలపై వాటిని వదలగానే నక్షత్రాల వెలుగుల్లో అవి గడ్డకట్టుకుపోయాయి. ఇప్పుడక్కడ చల్లబడ్డ పతాకలు రెపరెపలాడుతున్నాయి శాశ్వతంగా వేడిమికోల్పోయి, ఉత్తరధృవప్రభలుగా. . బెంజమిన్ ఫ్రాంక్లిన్ టేలర్ (1819- 1887) అమెరికను కవి . Northern Lights . TO claim the Arctic came the sun With banners of the burning zone. Unrolled upon their airy spars, They froze…
-
పికెట్ కావలి … ఎథెలిండా ఏలియట్ బీయర్స్, అమెరికను కవయిత్రి
ఈ కవిత మొదటిసారిగా “పోటోమాక్ పొడవునా అంతా నిశ్శబ్దం” అన్న శీర్షికతో ప్రసిద్ధమైన ఈ కవిత మొదటిసారి “హార్పర్ వీక్లీ” 1861 నవంబరు 30 సంచికలో ప్రచురించబడింది. *** పోటోమాక్ నది పొడవునా అంతా నిశ్శబ్దం,” అంటారందరూ కాకపోతే, ఏప్పుడో ఒక సారి దారితప్పి జరిగే సంఘటనలో ఏ పొదలోదాక్కున్న శత్రువు జరిపే కాల్పులకి రాత్రి గస్తీ తిరుగుతూ పహారా కాసే కావలి సైనికుడెవరైనా మరణిస్తే మరణించవచ్చు. అదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదు, ఎప్పుడో ఓసారి, ఒకరో…
-
తెలియరాని తన్మయత్వం… ఫ్రాన్సిస్ క్వార్లెస్… ఇంగ్లీషు కవి
తమ తుంటరి ప్రవాహాలతో రాళ్ళని దొర్లిస్తూ అన్ని దేశాలూ తిరిగి వేల నిర్జనప్రదేశాలు చూసి చివరకి మిరిమిట్లుగొలిపే థేమ్స్ నదిలో కలిసి అంతకంటే పెను కెరటాలలో విలినమయ్యే గట్లూ రెంటినీ విడదీస్తూ పారే రెండు సెలయేళ్ళలా కలిసేము. అందుకే నేను నా ప్రియాతి ప్రయతమ సొత్తును; తనూ నాకు అంతే. చాలా ప్రయత్నం చేసిన తర్వాత మేము కలుసుకున్నా మేమిద్దరం విడిగా అసంపూర్ణులమైనా, ఇపుడు పరిపూర్ణులమే. మా ఇద్దరిలో ఎవరు వేరొకరికోసం తపించనక్కరలేదు. నేను జనుమునైతే,…
-
రోదించండి, రోదించండి, అణిగిపోయే పెనుగాలులారా!… హెన్రీ నీలే, ఇంగ్లీషు
అత్యంత విచారకరమైన మీ గాధ లేవీ జీవితమంత విషాదంగా ఉండవు లెండి; మనిషిని పోలిన ఇతివృత్తాన్ని దేన్నీ మీరెన్నడూ ఎత్తుకుని ఉండరు; లేదా, అంత దుఃఖ బాహుళ్యమైనదీను. రాలిపో! రాలిపో! వాడిపోయిన పత్రమా! శరదృతువు దుఃఖమంతగా కాల్చివెయ్యదులే అటువంటి అందమైన పూలను చిదిమెయ్యదులే; దట్టమైన చీకట్లు జీవితాన్ని ముసిరినప్పుడు అది తుఫానుకన్నా భీకరమైనదీ ఆ క్రుంగుపాటు మహా విషాదకరమైనదీ. ఓ నినదించే వీణియా! ష్, ష్! సడిచేయకు! గాయకులారా! మీ గాత్రాన్ని ఆపండి! ఓ మధురమైన మురళీ,…
-
సానెట్ 12… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్ పియర్ 400 వ వర్థంతి సంవత్సరం నేను గడియారాన్ని చూస్తూ కాలం లెక్కపెట్టుకుంటూ దివ్యమైన రోజు ఘోరమైన రాత్రిలోకి మునిగిపోడం గమనించినపుడు; గతించిన గులాబి వన్నె ప్రాయపు సౌందర్యరుచులు గుర్తుచేసుకుని తెల్లని శరీరం నిండా తేరుతున్న నల్లని ముడుతలు చూసినపుడు; మొన్నటి వరకూ ఆకాశమంత పందిళ్ళు వేసి ఎండనుండి పశులగాచిన మహోన్నతమైన వృక్షాలిపుడు మోడులై నిలబడడం చూసినపుడు; వసంతపు పచ్చదనమంతా కట్టలు కట్టలుగా గట్టి బిరుసెక్కిన గడ్దాంతోపాటు పాడెమీద మోసుకుపోతున్నపుడు; నీ అందం గురించి…
-
స్త్రీల ఔన్నత్యము… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభాకాంక్షలతో . మేము గొప్పపనులు చేస్తే ప్రేమిస్తారు, శలవులకి ఇంటికి వచ్చినా, లేక చెప్పలేని చోట గాయాలపాలై తిరిగొచ్చినా. మీరు పతకాల్ని ఆరాధిస్తారు; మీకు గొప్ప నమ్మకం యుద్ధంలోని కళంకాన్ని శౌర్యం కప్పిపుచ్చుతుందని. మమ్మల్ని ఉక్కు కవచాల్లా తయారు చేస్తారు. మహాసంతోషంగా వింటారు, మట్టికొట్టుకుపోతూ ప్రమాదాల్నెదిరించిన మా కథలకి పులకిస్తారు. దూరంగా ఎక్కడో యుద్ధం చేస్తున్నపుడు మా లోపలి ఉద్రేకం మీరే మేము మరణిస్తే, జ్ఞాపకాలను పచ్చగా ఉంచుకుంటూమరీ శోకిస్తారు.…
-
వైద్యులు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ప్రతి రాత్రీ నేను మేలుకునే ఉంటాను ప్రతి పగలూ పక్కమీద పడుకునే ఉంటాను వైద్యులూ, వేదనా, మృత్యువూ నా తల దగ్గర చర్చించుకోవడం వింటూ. వాళ్ళు లోగొంతులో చికిత్సావిధానం గురించి శాస్త్ర పరిభాషలో మాటాడుకుంటుంటారు, ఒకరు త్వరగా కోలుకోవాలని వాదిస్తే రెండవవారు, నిర్వాణము నెమ్మదిగా రావాలని. నా లాంటి ఒక అతి సామాన్య జీవికి అది నిజంగా చాలా గర్వకారణం అటువంటి గొప్ప పేరుపడ్డ వ్యక్తులు నా పక్కన నిలబడి చర్చించుకోవడం . సారా టీజ్డేల్ August…
-
ఇహ మన సంబరాలు ముగిసినట్టే … షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వర్థంతి సంవత్సరం సాహిత్యం మానవజీవితపు అపురూపమైన సంపదను దాచుకునే అందాల భరిణె అనుకుంటే, దానిలో … రాగద్వేషాలూ, భావోద్వేగాలూ, చేతనాచేతనావస్థలూ….ఒకటేమిటి జీవితపు ఏ పార్శ్వాన్నీ విడిచిపెట్టకుండా, ఏ పాత్రతోనూ మమేకమవకుండా, అన్ని పాత్రలకీ సమన్యాయంచేస్తూ సృష్టించిన వస్తుసముదాయపు శిల్పి … షేక్స్పియర్. ఏ భాషకు ఆ భాషలోనే సాటిలేని మహాకవులూ, సాహిత్యకారులూ ఉన్నా, దేశకాల పరిమితులకి అతీతంగా అన్నిభాషలవారిచే తనకావ్యసృష్టికి మన్ననలను అందుకోగలిగిన కవి షేక్స్పియర్. కవిత్వం ఆ రోజుల్లో (మన…