-
సానెట్ 18… షేక్స్పియర్
ఈ రోజు (ఏప్రిల్ 23, 2016) షేక్స్పియర్ 400వ వర్ధంతి. ఏప్రిల్ 26 1564న బాప్టిజం జరిగినట్టు రికార్డులు చెపుతున్నాయి. అప్పటి అచారాలను బట్టి 23 ఏప్రిల్ అతని పుట్టిన రోజుకూడా అవడానికి అవకాశం ఉంది. సాహిత్యంలో కీర్తిప్రతిష్టలు ఎప్పుడూ దేశ, కాల, భాషాపరిమితులకు లోబడి ఉంటాయి. ఒకవేళ కొందరు ఇతరభాషలలోకి అనువదించబడినా, వాళ్ల రచనల విషయం గాని, రీతి గాని కాలపరీక్షకు నిలిచిన సందర్భాలు చాలా అరుదు. బహుశా ప్రపంచసాహిత్యంలో అటువంటి అరుదైన గుర్తింపుకి నోచుకున్నది షేక్స్పియర్, కాళిదాసులు…
-
సానెట్ 27… షేక్స్పియర్
పాటుబడి, అలసిపోయి, నేను తొందరగా పక్కెక్కుతానా నడిచి నడిచి బడలిన నా అవయవాలకి విశ్రాంతినిద్దామని; సరిగ్గా అప్పుడే మొదలౌతుంది మరో ప్రయాణం నా తలలో, శరీరం పని అయిపోయిందనగానే, మనసు పని మొదలుపెడుతూ: నా ఆలోచనలన్నీ,(నే నున్న చోటునుండి దూరంగా) నీ కోసం భక్తితో తీర్థయాత్రకు ఉపక్రమిస్తాయి, అరమోడ్చిన నా కనురెప్పల్ని సాగదీసి తెరిచి మరీ అంధులు చూడగలిగే చీకటిలోకి చూపులు సారిస్తాయి. ఉన్న తేడా అల్లా, అదృశ్యమైన నా ఆత్మ దివ్యచక్షువుకి చర్మచక్షువుకి అగోచరమైన నీ…
-
సానెట్ 26 … షేక్స్పియర్
నా ప్రేమకు నెలవైన ఓ స్వామీ! నీకు దాస్యం చేయడంలోనే నా సేవా ధర్మాన్నిమీ ప్రభుపాత్రత కట్టిపడేసింది, అందుకే నీకీ లిఖిత సందేశాన్ని పంపుకుంటున్నాను,నాలో విధినిర్వహణమాత్రమే చూడండి, ప్రదర్శించే తెలివిని కాదు. సేవానిరతి ఘనమైనా, మందబుద్ధియైన నాలాంటి వాడు మాటల్లో చెప్పలేకపోవడంలోనే దానిని తేటతెల్లం చేస్తాడు; నా జీవితాన్ని ఏ గ్రహాలు శాసిస్తునాయో గాని, వాటి అనుగ్రహ వీక్షణాలు నా మీద ప్రసరించి, నిరాడంబరమైన నా ప్రేమని సవస్త్రను చేసి మీ అభిమానానికి యోగ్యుడనని ఋజువుచేసేదాకా మీ…
-
సానెట్ 25… షేక్స్పియర్
గ్రహాలు అనుకూలంగా ఉన్న అదృష్టవంతుల్ని వాళ్ళు పొందే సమ్మానాలకీ, బిరుదులకీ గర్వపడనీ, అటువంటి అదృష్టానికి నోచుకోని నాలాంటి వాడు అటువంటి వాటి సత్కారాలలో ఆనందాన్ని వెతుక్కోలేడు. రాకుమారుల అనుగ్రహానికి పాత్రులైనవారు సూర్యముఖిలా తమ సర్వశక్తులూ వాళ్లకే అంకితం చేసి బ్రతుకుతారు; దానితోపాటే వాళ్ల అహంకూడా సమాధిచేసుకుంటారు, వాళ్ళు కన్నెర్ర చేస్తే తమ గొప్పదనం మటుమాయం కదా మరి. పాపం ఎన్ని వేలసార్లు విజయాన్ని సమకూర్చిపెట్టినా పరాక్రమవంతుడైన గొప్ప యోధుడు ఒక్కసారి ఓటమిపాలైతే సమున్నత గౌరవ పీఠం నుండి…
-
సానెట్ 24 … షేక్స్పియర్
నా నేత్రాలు చిత్రకారుడి పాత్ర ధరించి నీరూపు రేఖవిలాసాన్ని నా గుండేలోకి దోచుకున్నాయి; ఈ శరీరపు చట్రంలో దానిని బిగించాయి. చిత్రకారుడి ఆలోకనంలో అది కళాత్మక సృష్టి. నీ నిజమైన చిత్రం ఎక్కడ ఉందో నువ్వు చూడాలని చిత్రకారుడు అభిలషిస్తునప్పటికీ; నా మనో మందిరంలో ఇప్పటికీ వేలాడుతున్న చిత్రానికి తలుపులు తెరిచేవి నీ మెరిసే కళ్ళే. ఇప్పుడు చూడు కళ్ళు కళ్లకి ఏమి ఉపకారం చేశాయో: నా కళ్ళు నీ చిత్రాన్ని గీసాయి; నీ కళ్ళు నాకు…
-
సానెట్ 23… షేక్స్పియర్
రంగస్థలి మీద నిపుణతలేని నటుడు భయంతో తన సంభాషణలు మరిచిపోయినట్టు; ఒక ముక్కోపికి పట్టరాని కోపం వచ్చి అతని బలమే, బలహీనతై కూలబడినట్టు; నేను, నా మాటలు నమ్మరేమోనన్న భయంతో ప్రేమ సంసర్గాన్ని తగురీతిలో స్తుతించలేకున్నాను అతిశయించిన ప్రేమ బరువుతో నలిగిన నా మనసు తనకున్న సహజమైన బలాన్ని కోల్పోతోంది. ప్రేమని సమర్థిస్తూ, ప్రతిఫలాన్ని అన్వేషిస్తూ ఈ నాలుక ఇంతవరకు పలికిన పలుకులన్నిటికంటే ఇకపై, నా కవితలే తమ పద విస్తృతితో ఈ మనసు చెప్పదలుచుకున్నదంతా మౌనంగా…
-
సానెట్ 21… షేక్స్పియర్ ఇంగ్లీషు కవి

కవితా కన్యలాగే నేనూను అందమైన బొమ్మని చూడగానే కవిత్వం అల్లలేను; నిన్ను ప్రకృతే ఒక అలంకారంగా సింగారించుకుంటోంది. ప్రతి అందమూ నీ అందంతో సరిపోల్చుకుంటున్నాయి గర్వంగా చెప్పుకునే అందాల జంటలు ఏర్పడుతున్నై, సూర్యుడూ-చంద్రుడూ, ఈ భూమీ-రత్నగర్భయైన సముద్రం, వసంతంలో చిగిర్చే తొలిపూలవంటి అపురూపమైన వస్తువులతో మేదినీవలయ పరివేష్టితమైన ఈ రోదసి నిండి ఉంది. నా ప్రేమ ఎంత సత్యమో అంత సత్యంగా రాస్తాను నా మాట నమ్ము, ఏ తల్లి కన్న బిడ్డైనా అందంగా ఉన్నట్టు నా…
-
సానెట్ 19 … షేక్స్పియర్
సర్వభక్షకీ కాలమా! సింహపు గోరుసైతం మొండిచెయ్యగలవు, భూమి తను సృష్టించిన అందాల్ని హరించేలా చెయ్యగలవు బాగా కోపించి ఉన్న పులినోట్లోంచి కోర పెకలించగలవు చిరంజీవి ఫీనిక్స్ నిసైతం దాని రక్తంలోనే ఆహుతిచెయ్యగలవు; ని రాకపోకలతో ఋతువులానంద దుఃఖ హేతువులు చెయ్యగలవు వడి అడుగుల కాలమా! నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మిగతా ప్రపంచాన్నీ అక్కడి అశాశ్వతమైన సొగసుల్నీ. కానీ, నువ్వొక్కటి మాత్రం చెయ్యకుండా నిన్ను శాసిస్తున్నాను: నా ప్రియతమ అందమైన కనుబొమలు నీ చేతులతో సరిదిద్దకు నీ…
-
సానెట్ 17… షేక్స్పియర్
రానున్న కాలాల్లో నా కవితలెవడు నమ్ముతాడు వాటి నిండా నీ అందంగురించిన విశేషాలే ఉంటే? ఒక్క దైవానికి తెలుసు; నీ శరీరాన్ని భద్రపరిచిన ఆ సమాధి నీ అందంలో సగాన్నికూడా ప్రకటించలేదు. నేను నీ కన్నుల అందాన్ని గురించి వ్రాయగలిగితే, ఒక్కొక్క కవితలో చెప్పలేనన్ని నీ సొగసులూ వర్ణిస్తే, రాబోయే రోజుల్లో ప్రజలు అంటారు,”ఈ కవి అబద్ధాలకోరు. అటువంటి అందాలు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదు.” అని. కాలంతో పాటు రంగు వెలిసిన నా కాగితాలని…
-
సానెట్-16 … షేక్స్పియర్
కాబట్టి, నిరంకుశమైన కాలం మీద బలహీనమైన నా కవితలకంటే, మిక్కిలి బలంగా నువ్వే ఎందుకు ఎదురు దాడి చెయ్యకూడదు? నీ జవసత్త్వాలుడిగినా బలంగా నిలవకూడదు? అనువైన ఈ క్షణాలని మహదానందంగా గడుపు; ఎవరికీ మనసు అర్పించని ఎన్నో యువతీ మనోద్యానాలున్నాయి పవిత్రమైన కోరిక కోరినపుడు, ప్రాణప్రదమైన పూలందించగలవు నీ పోలికలున్న చిత్తరువులకంటే ఎక్కువపోలికలతో. జీవితం, వయసుతెచ్చే ముడుతల్ని సరిదిద్దవలసి వచ్చినపుడు అటు కాలలేఖిని గాని, ఇటు “అ-ఆ”లు దిద్దుతున్న నా కలానికిగాని తరతరాల దృష్టిలో నిన్ను శాశ్వతంగా…