అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మే 14, 2016

    వేసవి వాన… హార్ట్లీ కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

    దుమ్ము దట్టంగా పేరుకుంది; తెల్లగా చిరాకుగా ఉంది, అరబ్బు ఏడారి ఇసుకని కొట్టొచ్చినట్టు అనుకరిస్తూ. అడవులూ, పర్వతాలూ ఎండవేడికి కునుకుతీస్తునాయి; బయళ్ళు ఎండకి మాడిపోయి దాహంకోసం తపిస్తున్నట్టున్నాయి; చిన్న సెలయేళ్ళు వాటి కాలువలని బోడిగా విడిచిపెట్టాయి అవి ఏమిటో పోల్చుకుందికి ఒక్క చలమైనా లేకుండా; సన్నబడిపోయిన నది ఆకలితో అలమటిస్తున్న రాక్షసుడి ఎముకల్లాంటి రాళ్ళ మధ్య మెరుస్తోంది. ఒక్క సారిగా కొండలు నల్లబడ్డాయి, క్రిందని పొయ్యిలోంచి వచ్చినట్టు గాలి వేడిగా; అక్కడ ఉండడం మహాకష్టం. జూనో అసూయతో…

  • మే 13, 2016

    మూడు రోజులు… జేమ్స్ రాబర్ట్స్ గిల్మోర్, అమెరికను

    చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! ఓహ్, నిన్నరాత్రి చూశాను సూర్యుణ్ణి కాంతి విహీనంగా చీకటి సముద్రంలోకి గుంకుతూ ‘నిన్న ‘ ఒక భయంకరమైన ప్రేతాత్మ. చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! ప్రతి పొద్దూ సరి కొత్త సమస్యలతో పొడుస్తుంది అయినా, ఉత్సాహంగా, ధైర్యంగా, రంగంలోకి దిగుతాను, ‘ఈ రోజు ‘… నా పోరాటం కొనసాగిస్తాను చెయ్యవలసిన దనంతం; చేసిందతి స్వల్పం! కానీ అంతా ముగిసిపోయేక, విజయం సాధించేక, ఆహా! మనసా! ఏమి చెప్పను? నా బాధలూ, అశాంతీ…

  • మే 12, 2016

    జీవితం… బ్రయన్ వాలర్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవి

    మనం పుడతాము, నవ్వుతాము, ఏడుస్తాము, మనం ప్రేమిస్తాము, కుంగిపోతాం, నశిస్తాం! ఆహ్! ఇక ఎందుకూ మనం నవ్వడం ఏడవడం? మనం ఎందుకు పుడతాం ఎందుకు గిడతాం? నిగూఢమైన ఈ రహస్యానికి సమాధానం ఎవరికి తెలుసు?   అరే! నాకయితే మాత్రం తెలీదు! మనిషి కంటికి కనబడకుండా పువ్వులెందుకు వికసిస్తాయి? ఆహ్లాదకరమైన ఋతువులెందుకు ఇట్టే సమసిపోయే చక్కని ఊహలెందుకు రేపుతాయి? మరణిస్తాయని తెలిసినా, ఆ వస్తువులకే మన మనసులెందుకు ఆరాటపడతాయి? మనం అపరాథాలతో, బాధతో శ్రమిస్తూ, పోరాడుతాం, దూరంగా…

  • మే 11, 2016

    మధురక్షణం … మేరీ ఫ్రాన్సిస్ బట్స్, బ్రిటిషు రచయిత్రి

    తీరుబాటులేని పనితో గడిచిన రోజు ముగిసింది ఇంటిపనులు చక్కబెట్టుకోడం అయింది పగలల్లా చికాకు పరిచిన బాధ్యతలు సూర్యుడితోపాటే శలవుతీసుకున్నాయి చీకటి చిక్కబడుతున్న సంధ్యవేళ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కూచున్నాను గులాబి పువ్వులాంటి నా చిన్నారి నా గుండెమీద నిద్రపోతోంది. తెల్లని కనురెప్పలు పట్టు పోగు అంచుతో పల్చబదుతున్న వెలుగుని నిరోధిస్తున్నాయి ఒక చిన్ని పిడికిలి గట్టిగా బిగిసి అమ్మ చేతివేళ్ళని ఆసరాగా పట్టుకుంది మెత్తని దుప్పటి ముడతల్లో ఇంతసేపూ చురుకుగా ఉన్న పాదాలు చివరికి ఎలాగైతేనేం విశ్రాంతి…

  • మే 10, 2016

    పొద్దు పొడుపు… లాంగ్ ఫెలో, అమెరికను కవి

    సముద్రం మీంచి గాలి ఉవ్వెత్తుగా పైకి లేచి, అడిగింది “ఓ మంచు తెరలారా! నాకు దారి ఇవ్వండి!” ఓడవంక చూసి ఇలా అరిచింది, “ఓ నావికలారా! చీకటి తొలగిపోయింది. ఇక కొనసాగించండి మీ ప్రయాణం!” దూరాన ఉన్న నేలకి ఉరుకులతో పరుగులెత్తి మేలుకొలిపింది, “ఒహోయ్! లేవండి పొద్దుపొడుస్తోంది” అడవితో ఊసులాడుతూ, “నీ కలరవాలేవి? నీ ఆకులతోరణాల్ని వేలాడదియ్యి!”అంది. ముడుచుకున్న పక్షిరెక్కను గోముగా నిమురుతూ, ఓ పికమా! లే! లే! లేచి కమ్మగా ఒక పాట పాడు!” కళ్ళాలవెంట…

  • మే 9, 2016

    ప్రేమించొద్దు… కెరొలీన్ ఎలిజబెత్ సారా నార్టన్,

    ప్రేమించొద్దు, ప్రేమించొద్దు, చాతకాని మట్టి మనుషులారా! అందమైన ఆశల మాలికలన్నీ మట్టిపూలతో చేసినవే అవి వికసించి కొద్ది గంటలైనా గడవక ముందే, ఆ వస్తువులు వాడి రాలిపోడానికి ఉద్దేశించినవే ప్రేమించొద్దు! ప్రేమించొద్దు, ప్రేమించొద్దు. మీరు ప్రేమించినది మారిపోవచ్చు. దొండపండు వంటి పెదవి మిముజూసి నవ్వకపోవచ్చు కరుణ చిప్పిలే నయనాలు మిమ్ము వింతగా చూసి పట్టించుకో పోవచ్చు గుండె వెచ్చగా కొట్టుకో వచ్చు, కానీ అది విధేయం కాకపోవచ్చు, ప్రేమించొద్దు! ప్రేమించొద్దు! మీరు ప్రేమించినది మరణించవచ్చు… ఆహ్లాదమూ ఆనందకరమైన…

  • మే 8, 2016

    తల్లీ- బిడ్డా…. యూజీన్ ఫీల్డ్ అమెరికను

    ఒక రాత్రి చిన్న మంచు బిందువొకటి గులాబి ఎదమీద పడింది… “ఓ చిన్ని చుక్కా! నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాలే ఇక్కడ నిశ్చింతగా సేదదీరు” అని ఆదరించింది అనురాగముతో మెరుస్తున్న గులాబిని చూసి ఆకసానికి ఈర్ష్యతో ముఖం నల్లబడింది వెంటనే వేడి వెలుగుల దూతను పంపి మంచు బిందువును హరించింది. “ఓహ్! దైవమిచ్చిన నా బిడ్డని నాకిచ్చీ! అది నా ప్రాణం…” అని గులాబి బాధతో ఆక్రోశించింది కానీ, ఆకసం విజయ గర్వంతో నవ్వింది పాపం, గులాబి తల్లి,…

  • మే 7, 2016

    సేవ… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి

    (ఈ రోజు రాబర్ట్ బ్రౌనింగ్ 205 వ జన్మదినం.)   అన్ని సేవలూ భగవంతుని దృష్టిలో సమానమే ఇప్పుడు నడిచినా, ఒకప్పుడు నడిచినా అతను మన నేలమీద నడిస్తే స్వర్గమే. మనందరం అతనెలా అనుకుంటే అలాగే పనిచెయ్యగలం మనలో గొప్పవాళ్ళైనా, నీచులైనా తోలుబొమ్మలమే ఇందులో ఒకరు ఉత్తములూ, ఒకరు అధములూ లేరు. “చిన్న సంఘటన” అనొద్దు. “చిన్న” దేమి? ఇంతకంటే ఎక్కువ బాధ కలగాలా? ఇంతకంటే ఏదో పెద్ద సంఘటన జరగాలన్నట్టు? ప్రభూ! జీవితంగా చుట్టుకునే కర్మల…

  • మే 6, 2016

    పిల్లలు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

    తల్లులెలాంటి వారో పిల్లలలాంటి వారు. వెర్రి అభిమానపడే తండ్రి అంత వెర్రిగా చూచినా, ఉయ్యాలలో నిద్రపోతున్న కొడుకుమీద రాశిపోసిన తన అన్ని ఆశలూ, భయాలతో తల్లి తన పేగుబంధంతో చూసినట్టుగా ఆ చిన్నారి హృదయాన్ని ప్రేమగా చూడలేడు. తన ప్రక్కన మోకాళ్ళమీద కూచుని తన రూపుదిద్దుకుంటున్న తన ముఖంలో ఎప్పుడూ తల్లి పోలికలు వెదుకుతున్న నాన్నను చూసి ఆ చిన్నారి ఆశ్చర్యంగా,గుడ్లప్పగించి చూస్తాడు; కానీ, ఆమె ఒక్కతెకే చేతులు చాచి నిలబడతాడు; ఆమె ఒక్కతెకే ఆ కళ్ళు…

  • మే 5, 2016

    త్యాగం… సెబా స్మిత్… అమెరికను

    కొండవాలంతా చలిగాలులు వీస్తున్నాయి త్రోవకనరాని ఆ ఆరుబయలు బావురుమంటోంది, సమయం ఎంతయిందో తెలియరాని ఆ చీకటి రాత్రి పాపం, ఒక తల్లి తన బిడ్డతో దారితప్పి తిరుగుతోంది. తేలిపోతున్న మంచుని కాగలించిందా అన్నట్టుగా ఆమె గుండెను పొదువుకుని బిడ్డ నిద్రిస్తోంది. గాలి ఇంకా చల్లగానే విసిరికొడుతోంది. నడి రాత్రి అప్పుడే గడిచిపోయింది తేలివస్తున్న మంచు బాగా ముసురుకుంటోంది: ఆమె అవయవాలు చచ్చుబడి, శక్తిసన్నగిలింది. “భగవంతుడా!” అంటూ ఆమె గట్టిగా మొరపెట్టుకుంది, “నేను చనిపోవలసి వస్తే, నా బిడ్డను…

←మునుపటి పుట
1 … 88 89 90 91 92 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు